Gunde Ninda Gudi Gantalu November 3rd Episode: మనోజ్ అబద్ధం.. రోహిణి హంగామా.. ప్రభావతి టెన్షన్ పీక్స్..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో ఆసక్తికర మలుపులు తిరుగుతాయి. మనోజ్ కోరిక మేరకు ప్రభావతి మీనా నగలు దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటుంది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా తలుపు తెరిచి బంగారం తీసుకుని బ్లాక్ కవర్‌లో వేసుకుని బయటకు వస్తుంది. అయితే ఆమెకు సత్యం ఎదురవుతాడు. "మారవా నువ్వు.. ఇంత వయసు వచ్చినా మారవా?" అని వ్యంగ్యంగా పంచ్ వేస్తాడు. భయంతో ప్రభావతి "బీరువా తలుపు మూయడం మర్చిపోయా" అంటూ నటిస్తుంది. సత్యం అడిగిన కవర్ విషయానికీ "ఇది నా బ్లౌజ్ పీస్" అని అబద్ధం చెబుతుంది. ఇదే సమయంలో మీనా మార్కెట్‌ నుంచి చేప ముక్కలు తెస్తుంది. "ఈరోజు కూర అదిరిపోవాలి" అని బాలు చెప్పడంతో మీనా ఆ కవర్ పట్టుకుని వెళ్తుండగా, ప్రభావతితో గుద్దుకోవడం జరుగుతుంది. ఇద్దరి చేతుల్లోని కవర్లు మారిపోతాయి.

మీనా చేప ముక్కలు అనుకుని నగల కవర్‌ను వంటగదిలో పెడుతుంది. మరోవైపు ప్రభావతి మాత్రం చేప ముక్కల కవర్‌ను మనోజ్‌కి ఇచ్చి "జాగ్రత్తగా ఉండు.. బంగారం అలాగే ఇవ్వాలి" అని చెబుతుంది. మనోజ్ ఆ కవర్‌తో సేటు దగ్గరికి వెళ్లి తాకట్టు ధర అడగగా, సేటు కవర్ తెరిచి చూస్తే అందులో బంగారం బదులు చేపముక్కలు కనిపిస్తాయి. షాక్‌ అయిన మనోజ్ ఏం జరిగిందో అర్థం కాక తికమకపడిపోతాడు. ఇక ఇంట్లో ప్రభావతి కవర్ తెరిచి చూస్తే బంగారం కనిపించడంతో షాక్ అవుతుంది. దానిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీనా చేపల కవర్ కనిపించకపోవడం వల్ల వెతుకుతుంటుంది. సత్యం "ఇదిగో అమ్మా చేప ముక్కలు ఎత్తుకెళ్తున్న పిల్లి" అంటూ వ్యంగ్యంగా అంటాడు. ఇదే సమయంలో మనోజ్ తిరిగి ఇంటికి వచ్చి అసలు కవర్ ఇచ్చేస్తాడు. ప్రభావతి వెంటనే కవర్లు మార్చేసి తప్పు దాచేస్తుంది. అయితే పక్కనే ఉన్న బాలు "తప్పు ఎవరిదో అందరికీ అర్థమైంది" అంటూ ఘాటుగా చురక వేస్తాడు. చివర్లో మనోజ్ నగల ఫోటో తీసి సేటు దగ్గర నాలుగు లక్షలు అడుగుతాడు. "తాకట్టు కాదు.. అమ్మేస్తేనే ఇస్తా" అని సేటు చెప్పడంతో మనోజ్ కూడా అంగీకరిస్తాడు. ఇక సోమవారం(నవంబర్ 3వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 545 November 3rd 2025 here is full story

Courtesy: Jiohotstar

ఉదయం కిచెన్‌లో మీనా చేపల కూర వండుతుంటుంది. ఆ గుమగుమలు బాలు ముక్కును తాగగానే ఆగలేడు. "ఇక ఓ పట్టు పట్టాల్సిందే!" అంటూ కిచెన్‌లోకి నేరుగా వెళ్ళి పోతాడు. సత్యం, కుటుంబ సభ్యులు కూడా తినడానికి సిద్ధమవుతారు. కానీ ప్రభావతి మాత్రం పెద్ద కొడుకు మనోజ్ కోసం వేచిచూస్తూ ఉంటుంది. "మనోజ్ వచ్చాక తింటాడు" అని సత్యం చెప్పడంతో, మొహమాటంగా ప్లేట్ తీసుకుంటుంది ప్రభావతి. ఇంతలోనే బయట నుంచి కంగారు పడుతూ మనోజ్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభావతి గుండెల్లో భయం పుడుతుంది "ఏదో పెద్ద ప్రమాదం జరిగిందేమో!" అనిపిస్తుంది. వెంటనే అతన్ని బయటకు తీసుకువెళ్ళి ఏం జరిగిందని అడుగుతుంది. మనోజ్ మాత్రం కూల్‌గా, "ఏం కాదు అమ్మా... నగలు తాకట్టు పెట్టా. అంత సేఫ్‌గా ఉంది, టెన్షన్ పడాల్సిన పనిలేదు," అని అబద్ధం చెబుతాడు.

అయితే వీరిద్దరూ రహస్యంగా మాట్లాడుకోవడం మీనా గమనిస్తుంది. ఏదో దాచిపెట్టినట్టు అనిపించి "ఏం జరుగుతోంది?" అని అడగబోయేలోపే బాలు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు "లక్షలు మింగేశావా ఏమిట్రా!" ఈ మాట విన్న ప్రభావతి-మనోజ్ ఇద్దరూ భయంతో లోపలికి వస్తారు. సత్యం కూడా గట్టిగా ప్రశ్నిస్తాడు "మళ్లీ ఏం కొంపలు ముంచే ప్రయత్నం చేస్తున్నారు?". అప్పుడు ప్రభావతి సైలెంట్‌గా "ఇక్కడ అంత పెద్ద విషయం ఏమీ లేదు" అని చెప్పేస్తుంది. కానీ బాలు మాత్రం వెనుకాడడు "ఉన్నదంతా మింగేసిన తర్వాత ఇంకేం మిగిలింది అమ్మా?" అని సెటైర్ వేస్తాడు.

రవి కూడా ఈ సీక్రెట్ సంభాషణపై ప్రశ్నిస్తాడు "అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు?" అని అడుగుతాడు. ప్రభావతి వెంటనే టాపిక్ మార్చి మనోజ్‌ను అక్కడి నుంచి పంపేస్తుంది. ఆ తరువాత వాతావరణాన్ని సర్దుబాటు చేయడానికి మీనాను పిలిచి, "నాకు ఆకలి వేసింది, వడ్డించు," అని చెబుతుంది. మీనా వడ్డిస్తుండగా ప్రభావతి అవమానంగా "ఇంకాస్త కూర వడ్డిస్తే నీ పుట్టింటి సొమ్ము పోతుందా?" అంటుంది. దీంతో మీనా కూడా వెనుకాడకుండా "నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా. నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. నచ్చినంత వడ్డించుకోండి," అంటూ గిన్నెను ఆమె చేతిలోకి ఇస్తుంది.

ఇక మరోవైపు, మనోజ్ రూమ్‌లోకి వెళ్ళగానే రోహిణి ఆనందంతో గంతులేస్తుంది. "మీరు బిజినెస్‌లో పండిపోయారు!" అని గొప్పలు చెబుతుంది. మనోజ్ మాత్రం "పండిపోయానో, ఎండిపోయానో తెలియదు" అని తన మనసులో అనుకుంటాడు. రోహిణి ఉత్సాహంగా "ఇలాగే కంటిన్యూ చేస్తే త్వరలోనే కోటీశ్వరులు అవుతాం" అంటుంది. వెంటనే "ఒక్కసారి ఆ లక్ష రూపాయల లాభం చూపించండి" అంటూ డబ్బులు అడుగుతుంది. మనోజ్ చేతిలోని నోట్లను చూసి రోహిణి ఉత్సాహంతో "ఇలాంటి రోజులు మళ్లీ రావాలి" అంటుంది. కానీ మనోజ్ మాత్రం మనసులో "ఇలాంటి రోజులు నా జీవితంలో మళ్లీ రావద్దు" అని అనుకుంటాడు. ఇంతలో రోహిణి ఆ డబ్బులు పట్టుకుని "గోవా ట్రిప్ వెల్దామా?" అని ప్రపోజ్ చేస్తుంది. మనోజ్ కంగారు పడతాడు. అయినా రోహిణి ఆగదు "ఈ విజయాన్ని అందరితో పంచుకోవాలి!" అంటూ డబ్బులు పట్టుకుని కిచెన్‌లోకి దూసుకెళుతుంది.

రోహిణి కిచెన్‌లోకి వచ్చి "మనోజ్ గొప్ప బిజినెస్ చేశాడు. నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మి లక్ష రూపాయల లాభం తెచ్చాడు!" అని డబ్బులు చూపిస్తుంది. బాలు వెంటనే పంచ్ వేస్తాడు "లక్షల మింగేశాడా మళ్లీ?" అని అంటాడు. మీనా కూడా "వచ్చిన దాంట్లో లక్ష మిగిలిందా?" అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. మనోజ్ మాత్రం "నాలుగు లక్షల బిజినెస్ అయితే, లక్ష లాభం వచ్చింది" అంటాడు. మీనా చమత్కారంగా "పర్వాలేదు మీ ఆయన కూడా లక్షల్లో సంపాదిస్తున్నాడు. మా ఆయన ఆ షాప్ చూపించకపోతే మీరు ఇప్పటికి గుడి ముందు అడుక్కు తినేవారు" అంటూ బాలు తరఫున కౌంటర్ ఇస్తుంది.

సత్యం కూడా "నిజంగానే వీడు లక్ష సంపాదించాడా?" అని ప్రశ్నిస్తాడు. రోహిణి "మీకు కూడా అనుమానమా?" అని అహంకారంగా అడుగుతుంది.
సత్యం ప్రశాంతంగా "వాడు ఇప్పటివరకు పోగొట్టుకోవడమే తెలుసు. సంపాదించడం కొత్త అనుభవం కాబట్టి అనుమానం రావడం సహజం," అని చెబుతాడు. రోహిణి మాత్రం "ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు మనోజ్ ఎన్ని లక్షలు సంపాదిస్తాడో చూస్తారు!" అంటుంది. దీంతో ప్రభావతికి ఎక్కిళ్లు పడుతుంటుంది. బాలు వెంటనే పంచ్ వేస్తాడు "మనోజ్ విజయ గాధ వినలేక ఎక్కిళ్లు పడ్డాయి పాపావతికి! కొన్నిసార్లు నిజాలు వంటలో వేసే మసాలాల్లా ఉంటాయి, దిగమింగక తప్పదు!" అని సెటైర్ వేస్తాడు.

రోహిణి "ఇంత పెద్ద విషయం చెబుతుంటే అత్తయ్య ఎందుకు స్పందించడం లేదు?" అని అడుగుతుంది. ప్రభావతి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అవుతుంది. బాలు "అతిగా స్పందించే ప్రభావతి ఎందుకో ఇపుడు మౌనంగా ఉంది... గొంతులో చేప ముల్లు ఇరుక్కుందా ఏమో?" అని వ్యంగ్యంగా చెబుతాడు. మీనా కూడా "ఇంద్రుడు చంద్రుడు అంటూ మనోజ్‌ను పొగిడే అత్తయ్య.. ఈరోజు నిశ్శబ్దంగా ఎందుకుందో?" అంటూ వెటకారం చేస్తుంది. ప్రభావతి మాత్రం తనను తాను సమర్థించుకుంటూ "ఇది నాకు ముందే తెలిసింది. వాడికి దిష్టి తగులుతుందేమోనని బయట పెట్టలేదు" అంటుంది.

అయితే రోహిణి అక్కడితో ఆగదు. లాభంలో 50,000 రూపాయలు తీసుకుని "ఇది మీకోసం అత్తయ్య!" అంటూ ప్రభావతి చేతిలో పెడుతుంది. అతడి ముఖం కమ్మేసినా ఏమీ చెప్పలేక పోతుంది ప్రభావతి. వెంటనే రోహిణి మనోజ్‌ను బయటకు తీసుకెళ్లి "ఇలాగే ఉంటే పరిస్థితి కంట్రోల్‌లో ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో ఇది నీ డబ్బు కాదు, మీనా నగలు అమ్మి వచ్చిన డబ్బు!" అంటూ తీవ్ర హెచ్చరిక ఇస్తుంది. మనోజ్ తలవంచి నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు.

తరువాతి రోజు ఉదయం ప్రభావతి హాల్లో కూర్చుని "మీనా! మీనా!" అంటూ పెద్దగా అరుస్తుంది. బాలు అది గమనించి "ఏంటి ఇంత గోల?" అని అడుగుతాడు. "నీ పెళ్లానికి కాఫీ ఇవ్వాలని తెలియదా?" అంటూ ఆమె ఘాటుగా అంటుంది. దీంతో బాలు కూడా కాస్త ఆగ్రహంతో "ఇంట్లో పనులు మీనా చేస్తే కాఫీ కూడా ఆమెనే పిలిచి ఇవ్వాలా? అని విజిల్ వేస్తాడు బాలు. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న అందరూ హాల్లోకి వస్తారు. రోహిణి "ఏంటి గోల?" అని అడుగుతుంది. మనోజ్ కూడా "మమ్మల్ని చంపక తింటారా?" అని చెబుతాడు. "నిన్ను చంపుకొని తినే జంతువు ఇంకా పుట్టలేదు!" అని బాలు వెంటనే పంచ్ వేస్తాడు. ఇంట్లో ఒక్కసారిగా నవ్వులు పూస్తాయి. కానీ ప్రభావతి మాత్రం సీరియస్‌గా ఉంటుంది.

ఇంతలో సత్యంకి ఫోన్ వస్తుంది. అతని తల్లి సుశీల "నాకు 75వ పుట్టినరోజు వస్తోంది, ఈసారి అందరితో కలిసి జరుపుకోవాలని ఉంది," అని అంటుంది. బాలు సరదాగా " అమ్మా, అప్పడే 75 ఏళ్లా?" అని అడుగుతాడు.అప్పుడే శీలా డార్లింగ్ సూపర్ కౌంటర్ ఇస్తుంది "మీ అమ్మలాగా ఇంకా పదహారేళ్లమని తిరగాలా?" అని. ఈ చమత్కారం ఇంట్లో చిన్న నవ్వును తెప్పించినా, ప్రభావతి మాత్రం చెమటలు పట్టిస్తుంది. సుశీలమ్మ (శీలా డార్లింగ్) కొనసాగిస్తూ "వచ్చే ఏడాది ఉంటానో లేదో తెలియదు. ఈసారి మీ అందరినీ ఊరికి తీసుకురా సత్యం!" అంటుంది. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది "ఏంటి దీర్ఘాలు తీస్తున్నావు? ఊరికి రావడం ఇష్టం లేదా?" అని ప్రశ్నిస్తుంది.

ఇంట్లోని వారంతా తల ఓ కారణం చెబుతారు. మీనా ముందుకు వచ్చి "అందరం రావడం కుదరదు అమ్మగారు, మీరు ఇక్కడికే రండి. మీ పుట్టినరోజు వేడుకలు ఇక్కడే జరుపుదాం," అని సంతోషంగా చెబుతుంది. శీలా డార్లింగ్ అంగీకరిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం మనసులో భయపడుతుంది "అత్తయ్య ఇక్కడికి వస్తే నా రహస్యాలు బయటపడతాయేమో...". ఈ కొత్త ట్విస్ట్‌ తో కథ మరో రహస్య మలుపు తీసుకోబోతోందనే ఆసక్తిని కలిగిస్తూ ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X