Gundeninda Gudigantalu November 1st Episode: మనోజ్ తప్పు వల్ల ప్రభావతికి షాక్! నగల రహస్యం బయటపడిందా?
Courtesy: jiohotstar
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలులో మరోసారి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రసారం అయింది. శుక్రవారం ఎపిసోడ్‌లో మనోజ్ కోరిక మేరకు ప్రభావతి మీనా బంగారం దొంగలించడానికి వెళ్తుంది. బీరువా తలుపు తెరిచి, నగలు బ్లాక్ కవర్‌లో వేసుకుని బయటకు బయలుదేరుతుంది. అయితే అప్పుడే సత్యం ఎదురుపడతాడు. "మారవా నువ్వు... ఇంత వయసు వచ్చినా మారవా" అని సూటిగా చెబుతాడు. భయపడిన ప్రభావతి బీరువా తలుపు వేయడం మరిచిపోయిందని నటిస్తుంది. సత్యం కవర్ గురించి అడగగా "ఇది నా బ్లౌజ్ పీస్ అండీ" అని అబద్ధం చెబుతూ నగలతో బయటపడుతుంది.
ఇక మరోవైపు బాలు కూడా అలాంటి బ్లాక్ కవర్‌లో చేపముక్కలు తెచ్చి మీనాకు ఇస్తాడు. "ఈరోజు కూర అదిరిపోవాలి" అని చెబుతాడు. అదే సమయంలో మీనా ఆ కవర్ పట్టుకుని బయలుదేరుతుంటే ప్రభావతి ఆమెను గుద్దడంతో ఇద్దరి చేతిలోని బ్లాక్ కవర్స్ మారిపోతాయి. మీనా చేపముక్కల కవర్ అనుకుని నగల కవర్ వంటగదిలో పెడుతుంది. ప్రభావతి మాత్రం చేపముక్కల కవర్‌ని మనోజ్‌కి ఇచ్చి "జాగ్రత్తగా ఉండు, బంగారం ఎలా ఉందో అలాగే ఇవ్వాలి" అని హెచ్చరిస్తుంది.

ఇక మనోజ్ ఆ కవర్‌తో సేటు దగ్గరికి వెళ్లి "ఈ బంగారానికి ఎంత వస్తుంది తాకట్టుపెడితే" అని అడుగుతాడు. సేటు కవర్ తెరిచేసరికి అందులో బంగారం బదులు చేప ముక్కలు కనిపిస్తాయి. ఆ సమయంలో ప్రభావతి ఇంట్లో మీనా కవర్ తెరిచి నగలు కనిపించడంతో షాక్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ కవర్ దాచే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో సత్యం ఆమెను చూసి "ఇదిగో అమ్మా చేప ముక్కలు ఎత్తుకెళ్తున్న పిల్లి" అని పంచ్ వేస్తాడు. ప్రభావతి తడబడుతూ "ఇది నా బ్లౌజ్ పీస్, కవర్లు మారిపోయాయి" అంటూ సమాధానం చెబుతుంది.
ఇంతలో మనోజ్ తిరిగి వచ్చి అసలైన కవర్ తీసుకువస్తాడు. దాంతో ప్రభావతి తప్పు బయటపడకుండా వెంటనే కవర్లు మార్చేసి మీనాకు ఇస్తుంది. బాలు మాత్రం పక్కనే ఉండి "మీనా తప్పు కాదు, వాడు కూడా తన కవర్ చూసుకోకుండా ఎలా వెళ్తాడు?" అంటూ చురకలు వేస్తాడు. చివర్లో మనోజ్ సేటు దగ్గరికి వెళ్లి నగలను అమ్మేస్తానని, నాలుగు లక్షలు కావాలని అంటాడు. "తాకట్టు సరిపోదు, అమ్మేస్తేనే ఇస్తాను" అని సేటు చెప్పగానే మనోజ్ కూడా సిద్ధపడతాడు. కానీ వెళ్లే ముందు నగల ఫోటో తీసుకోవడం మాత్రం మరచిపోడు.
గుండె నిండా గుడిగంటలు ఇక కమింగ్ అప్ ఎపిసోడ్‌లో బాలు తన మనసులోని ప్రేమను, స్నేహాన్ని చూపించాలనే ఉద్దేశంతో మీనాతో మాట్లాడుతూ, "శీలా డార్లింగ్ బర్త్‌డేకి బంగారు గొలుసు గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకునేవాడ్ని' అని అంటాడు. 'కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా'అని నిరుత్సాహంగా చెబుతుంది మీనా. వెంటనే మీనా "నా నగలు ఇంట్లోనే ఉన్నాయి కదా.. వాటిని తాకట్టుపెట్టుకుని ఆ డబ్బుతో బామ్మకు గిఫ్ట్ కొందాం" అని చెబుతుంది. బాలు ఆమె మాటలతో కదిలిపోయి "ఇంత మంచితనం నీలో ఉంది అనుకోలేదు" అని మెచ్చుకుంటాడు. కానీ ఈ సంభాషణను మనోజ్ చాటుగా వింటాడు.
వెంటనే ప్రభావతి దగ్గరకు వెళ్లి బాలు మీనాల ప్లాన్ చెబుతాడు. ఈ మాటలు విన్న ప్రభావతి షాక్ అవుతుంది. "రేయ్ మనోజ్... ఆ నగలు ఎలా అయినా తిరిగి తెచ్చేయ్... లేదంటే నా కష్టం అంతా వృధా అవుతుంది" అని బతిమాలుతుంది. మనోజ్ వెంటనే ఆ నగలను తాకట్టు పెట్టిన జువెల్లర్‌కి ఫోన్ చేస్తాడు. కానీ అక్కడి నుండి వచ్చిన సమాధానం వాళ్లిద్దరినీ బిత్తరపోయేలా చేస్తుంది "అమ్మేసిన నగలు కదా.. అవి అప్పుడే కరిగించేశాం" అని జువెల్లర్ చెబుతాడు.
అదే క్షణం మనోజ్‌కు తన తప్పు తీవ్రత అర్థమవుతుంది. "ఏం చేసానో నాకు తెలియదు ప్రభావతి... నీకోసం చేసానని అనుకున్నా కానీ నీకే నష్టం చేశా" అంటూ పశ్చాత్తాపపడతాడు. అయితే ప్రభావతి ఒక్కసారిగా చలించకుండా, తన మాటల ప్రయోగంతో పరిస్థితిని తిప్పి వేయాలని నిర్ణయిస్తుంది. "బంగారం లాంటి వస్తువులు తిరిగి రావు, కానీ మన గౌరవం తిరిగి రావాలి మనోజ్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు" అని అంటుంది.
ఇంతలో బాలు, మీనా ఆ నగలు తాకట్టుపెట్టాలని అనుకుంటున్న సంగతి తెలియక, బామ్మకు గిఫ్ట్ కొనడానికి సిద్ధమవుతారు. అయితే ప్రభావతి ఒక నాటకీయ మలుపులో వాళ్ల ముందే మాటలతో పరిస్థితిని మలుస్తుంది. "బంగారం వద్దు అని నీ భార్య పక్కన పెట్టేస్తే ఆ బంగారాన్నే తీసుకుని నువ్వు వాడుకుంటావా?" అని బాలుకి నొప్పి కలిగేలా మాట్లాడుతుంది. దాంతో బాలు తనలో తాను సిగ్గుపడతాడు.మీనా కూడా "వదిలేయండి అత్తయ్య, మేమే బామ్మకు వేరే గిఫ్ట్ కొనుకుందాం" అని చెబుతుంది.
మొత్తానికి ప్రభావతి మాటల మాయతో మరోసారి పరిస్థితిని తన చేతిలోకి తెచ్చుకుంటుంది. మనోజ్ మాత్రం తన చేసిన తప్పు బాధతో నిస్సత్తువగా మారుతాడు. నగలు కరిగిపోయిన విషయమేమో కానీ, ఈ సంఘటనతో సిరీయల్ లో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఇక ప్రభావతి తన తప్పును ఎంతకాలం దాచగలదు? లేక సత్యం ఏదైనా అనుమానంతో బయటపెడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాలు తదుపరి ఎపిసోడ్‌లో తెలుసుకోబోతున్నాం.


Click it and Unblock the Notifications











