Gunde Ninda Gudi Gantalu Weekly: చింటూకు దక్కిన తల్లి ప్రేమ.. గాయపడిన మీనా మనసు.. ప్రభావతికి షాక్

Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సెప్టెంబర్ 29వ తేదీన 520వ ఎపిసోడ్‌లో విద్య ప్లాన్ ప్రకారం మీనాను ఇంటికొచ్చేలా చేసి, పూలు అల్లడం నేర్పించమని అడుగుతుంది. కానీ మీనా త్వరగా వెళ్ళిపోతే పని పూర్తికాదు కాబట్టి, విద్య ఎక్కువసేపు ఉండేలా మాయమాటలు మాట్లాడి, మీనాను పొగడ్తలతో ఇంప్రెస్ చేస్తుంది. మీనా తన అత్త గురించి చెప్పడం వల్ల విద్య ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో మీనా రోహిణి గురించి తెలుసుకోవడానికి, ఫోటోలు చూపించమని అడగడం వల్ల విద్యలో అనుమానం కలుగుతుంది. ఇక బాలు బయటకి వెళ్లగానే రోహిణి తల్లిపై కోపం చూపిస్తుంది. చింటూ విషయం బయటపడితే తన జీవితం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. రోహిణి తల్లి కూడా తన ఆవేదనను బయట పెట్టి, చింటూని తానే తల్లిలా పెంచుతున్నానని చెబుతుంది. తల్లి తన సుఖం కోసం చింటూని దూరం చేస్తోందని విమర్శ చేస్తుంది. ఈ తగాదా మధ్య రోహిణి ఎమోషనల్‌గా, తన కొడుకును ఎప్పటికీ వదలనని, ఏదోక రోజు భర్తకు నిజం చెప్పేదానని ప్రకటిస్తుంది. చింటూ ఈ సంభాషణ వింటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రోహిణిని తన తల్లిగా అడుగుతాడు. చివరగా రోహిణి చింటూని గుండెలకు హత్తుకుంటుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story September 29th to October 3rd Episodes highlights

Courtesy: JioHotstar

సెప్టెంబర్ 30వ తేదీ, 521వ ఎపిసోడ్‌లో రోహిణి నిజమైన తల్లి అని తెలుసుకుని చింటూ ఏడుస్తూ ఆమెను హత్తుకుంటాడు. రోహిణి పరిస్థితుల కారణంగా తనను ఇంట్లో "అమ్మ" అని పిలవొద్దని కోరుతుంది. దీంతో చింటూ బాధపడుతూనే అంగీకరిస్తాడు. ఇన్ని రోజుకు చింటూ ప్రశ్నలకు సమాధానం దొరికినందుకు సంతోషిస్తుంది సుగుణమ్మ. ఇంతలో బాలు ఇంటికి వస్తాడు. రోహిణి చింటూ కి బిర్యానీ తినిపించడంతో బాలు షాక్ అవుతాడు, పార్లరమ్మలో తొలిసారి తల్లిని చూశానని సెటైర్లు వేస్తాడు. ఇక రోహిణీ చింటూతో సంతోషంగా గడుపుతుంది. మరోవైపు.. మీనా విద్యతో తన అత్తాగారింటి గురించి చెబుతుంది. మీనా సహనం, క్షమా గుణానికి విద్య ఇంప్రెస్ అవుతుంది. కానీ, రోహిణీ తప్పు మీద తప్పు చేస్తూ సమస్యలో ఇరుక్కుంటుందని బాధపడుతుంది. మరోవైపు మీనా చింటూ కి సర్ప్రైజ్ కళ్లజోడు ఇస్తుంది. రోహిణి తన చేతులతో చింటూకు తినిపిస్తోంది. దీన్ని బాలు చూసి షాక్ అవుతాడు. చింటూ, సుగుణమ్మ ఇంటి నుండి వెళ్తారు. ప్రభావతి వారిని మళ్లీ ఇంటికి రానివ్వకపోవడం వల్ల రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక

అక్టోబర్ 1వ తేదీ, 522వ ఎపిసోడ్‌లో ప్రభావతి ఇంట్లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. సుగుణమ్మ చింటూని తీసుకెళ్తానని చెబుతుంది. కానీ మీనా మరో వారం రోజులు పాటు ఇంట్లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ విషయం నచ్చక రోహిణి టేబుల్‌పై ఉన్న పాలగిన్నెను కావాలనే కింద పడేసి టాపిక్ మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని రవి గమనించి శృతికి చెబుతాడు. శృతి రోహిణిని నేరుగా ప్రశ్నించగా, రోహిణి వేరే కారణం చెప్పి తప్పించుకుంటుంది. ఇక ప్రభావతి ఇంటికి వచ్చి చింటూ కుర్చీలో కూర్చోవడంతో మండిపడుతుంది. అంతటితో ఆగకుండా సుగుణమ్మ, మీనాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతలో బాలు చేరి ప్రభావతితో వాగ్వాదం చేస్తాడు. కానీ బాలు మాత్రం రోహిణి ప్రవర్తనపై తీవ్ర అనుమానంతో ఉంటాడు. రోహిణి చింటూపై చూపిస్తున్న ప్రత్యేకమైన ప్రేమను బాలు గమనించి, తల్లి కావాలనే ఆలోచనతో ఉందని అనుకుంటాడు. ఇదే విషయాన్ని మనోజ్‌కి అడగ్గా, అతను బిజినెస్‌పై దృష్టి పెట్టమని రోహిణి ఆపేస్తుంది. మరుసటి రోజు సుగుణమ్మ వెళ్లిపోతామని చెబుతుండగా ప్రభావతి మరోసారి చింటూ పుట్టుకపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది. దాంతో రోహిణి సహనం కోల్పోయి గట్టిగా అరుస్తుంది. ఈ సంఘటనతో బాలు షాక్ అవుతాడు. రోహిణి నిజ స్వరూపం బయటపడుతుందని గ్రహించి నిలదీస్తాడు. చింటూపై ప్రేమ, ఆప్యాయత అన్నీ నాటకమేనా? అని ప్రశ్నిస్తాడు.

అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్ 523లో ప్రభావతి రోహిణి యొక్క ప్లాన్ బయటపెట్టడంతో ఇంట్లో ఉత్కంఠ మొదలవుతుంది. రోహిణి నిజాన్ని వెల్లడించి, వారిని బయటకు పంపించడానికి అసలు ప్రయత్నం చేసినది ప్రభావతే అని చెబుతుంది. అందరూ షాక్ అవుతారు. సుగుణమ్మ మళ్లీ ఇంటికి రానని చెప్పడం వల్ల పరిస్థితే మరింత టెన్షన్‌ఫుల్‌గా మారుతుంది. ఈ సమయంలో చింటూ ఒక్కసారిగా రోహిణిని "అమ్మ" అని పిలవడం అందరిని కంగారు చేస్తుంది. సుగుణమ్మ కారణం చెప్పి సర్దిచేయడానికి ప్రయత్నించినప్పటికీ, రోహిణి లోపల ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత మనోజ్, సుగుణమ్మ గురించి తప్పుగా మాట్లాడటంతో రోహిణి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మనుషులను చిన్నచూపు చూడకూడదని కౌంటర్ ఇస్తుంది. ఇక హాస్పిటల్‌లో కట్లు విప్పుకున్న తర్వాత చింటూ రోహిణిని "అమ్మ" అని పిలుస్తాడు. రోహిణి కన్నీళ్లతో నిజం ఒప్పుకుంటుంది. మీనా, బాలు రాగానే రోహిణి చింటూకి బయట తనను "అమ్మ" అని చెప్పొద్దని సూచిస్తుంది. బాలు "నువ్వు వాడి నిజమైన అమ్మలాగే ఉన్నావు" అని అంటారు. దీనితో రోహిణి మరింత కంగారు పడుతుంది. రోహిణి చింటూకి బర్త్‌డే నాడు వచ్చే హామీ ఇస్తూ వెళ్తుంది. ఇదే సమయంలో ఇంట్లో సత్యం తన పెళ్లి గురించి సరదా జోకులు వేస్తాడు. చిన్ననాటి ఫ్రెండ్ రాజశేఖర్ బాలు ఇంటికి వచ్చి తన అన్నయ్య పెళ్లి కార్డు ఇస్తాడు.

ఇక అక్టోబర్ 3 వ తేదీ, 524వ ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. బాలు సరదాగా చేసిన వ్యాఖ్యలు మీనా మనసును గాయపర్చుతాయి. దీంతో మీనా కోపంతో వంటగదికి వెళ్లిపోతుంది. ఈ పరిస్థితిని అదునుగా భావించిన ప్రభావతి, బాలు మీనాను నిజంగా ప్రేమించలేదని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెబుతూ మీనాను కించపరుస్తుంది. వెంటనే మీనా అందరితో ఘాటుగా మాట్లాడి గదిలోకి వెళ్లిపోతుంది. బాలు ఓదార్చడానికి ప్రయత్నించినా, మీనా తన మనసులోని బాధను బయటపెడుతుంది. ఆ తర్వాత వంటపై తగువులు మొదలవుతాయి. మీనా ఇంట్లో లేకపోవడంతో బాలు టెన్షన్‌లో పడతాడు. ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మరింత ఆందోళన చెందుతాడు. మీనా పుట్టింటికి కాల్ చేసినా, ఆమె అక్కడకీ రాలేదని సుమతి చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. మీనా కోసం వెతకడం ప్రారంభిస్తాడు.
ఈ ఎపిసోడ్‌లో బాలు - ప్రభావతి - మీనా మధ్య ఘర్షణలు, కౌంటర్లు, టెన్షన్ సీన్లు హైలైట్‌గా నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X