For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. అల్లుడి నిజ స్వరూపం బయటపెట్టిన చక్రపాణి, పోలీసుల ముందే అలా!

  |

  హాస్పిటల్ లో ఉన్న వసుధార తల్లిదండ్రులు సుమిత్ర-చక్రపాణిల వాంగ్మూలం తీసుకోవడానికి పోలీసులు వస్తారు. అక్కడ ముందుగా రాజీవ్ గురించి గొప్పగా చెబుతూ వసుధారపై నిందలు వేస్తాడు చక్రపాణి. అది చూసి తెగ సంతోషపడిపోయిన రాజీవ్.. నన్ను మరి పొగిడేస్తున్నారు మావయ్య అనుకుంటూ చక్రపాణి దగ్గరకు వెళ్తాడు రాజీవ్. ఇంతలో రాజీవ్ చెంపపై గట్టుగా కొడతాడు చక్రపాణి. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 13 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్‌ 658లో ఇంకా ఏం జరిగిందంటే?

  వీడే సార్ నన్ను పొడిచాడు..

  వీడే సార్ నన్ను పొడిచాడు..

  చెంపపై చక్రపాణి కొట్టగానే షాక్ తో మావయ్య అని అంటాడు రాజీవ్. ఎవర్రా నీకు మావయ్య.. మావయ్య గారు అంటా.. అని కోపంతో రగిలిపోతూ వీడు నయ వంచకుడు సార్. వీడు చెప్పే మాటలు ఏవి నిజాలు కాదు సార్. వీడి మాటలు.. వీడి బతుకు అంతా పెద్ద అబద్ధం సార్. సార్.. వీడే నా భార్యను పొడిచింది అని ఆవేశంతో పోలీసులకు చెబుతాడు చక్రపాణి. దీంతో పోలీసులు షాక్ అవుతారు. సుమిత్ర మాత్రం సంతోషపడుతుంది. అప్పుడు అవును సార్.. వసుధారకు తెలియకుండా వీడే సార్ నన్ను పొడిచాడు. వీడు దుర్మార్గుడు సార్. మంచి వాడు కాదు అని సుమిత్ర అంటుంది. వీడు నా భార్యను పొడవడం నా కళ్లతో చూశాను సార్ అని చక్రపాణి అంటాడు. దీంతో అవును సార్.. నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. కిడ్నాప్ చేయడానికి చాలా ప్రయత్నించాడు అని వసుధార చెబుతుంది.

  రిషి సార్ కి ఎన్నిసార్లు చెప్పినా..

  రిషి సార్ కి ఎన్నిసార్లు చెప్పినా..

  ఇంకా రాజీవ్ చేసిన పనుల గురించి ఏవేవో పోలీసులకు చెబుతుంటాడు చక్రపాణి. దీంతో ఇక్కడ ఉంటే ప్రాబ్లమే.. వసుధార నీ సంగతి తర్వాత చెబుతాను అని అక్కడి నుంచి పారిపోతాడు రాజీవ్. పోలీసులు రాజీవ్ వెంటపడతారు. తర్వాత వసుధార తండ్రివైపు కృతజ్ఞతభావంతో చూస్తు తండ్రి నాన్నా అంటూ దగ్గరికి వస్తుంది. దీంతో ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుంటాడు చక్రపాణి. ఇది చూసి సుమిత్ర చాలా సంతోషిస్తుంది. మరోవైపు రిషి తన రూమ్ కి వచ్చేసరికి వసుధార సర్దుతూ కనిపిస్తుంది. ఈ రిషి సార్ కి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే.. రూమ్ ని అస్సలు పట్టించుకోరు అని అనుకుంటుంది. ఇంతలో అక్కడికి రిషి వచ్చి నువ్వేంటి ఇక్కడ అనగానే సార్ ఇది అంటూ.. అడుగు ముందుకేసిన వసుధార కార్పెట్ తాకి కింద జారిపడబోతుంది. ఇంతలో వసుధారను రిషి పట్టుకుంటాడు.

   దూరం చేసుకునేందుకు ఎన్నాళ్లు..

  దూరం చేసుకునేందుకు ఎన్నాళ్లు..

  నువ్వెందుకు వచ్చావ్.. నన్ను బాధపెట్టాడానికా.. ఒకసారి చెబితే అర్థం కాదా.. నిన్నే.. అనేసి.. మళ్లీ రియాల్టీలోకి వస్తాడు రిషి. నాకెందుకు ఈ బాధ. దీనికి అంతం లేదా. నన్ను ఎందుకు శిక్షిస్తున్నావ్. నేను ఏం తప్పు చేశాను అనుకుంటాడు రిషి. టేబుల్ పక్కనున్న నెమలీక చూసి గతంలో వసుధార అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. దీంతో కోపంగా నెమలీక విసిరేస్తాడు. అది మళ్లీ గాలికి ఎగిరివచ్చి రిషి గుండెపై వాలుతుంది. నన్ను నువ్వు దూరం చేసుకున్నావ్. కానీ, నీ జ్ఞాపకాలు దూరం చేసుకునేందుకు ఎన్నాళ్లు పడుతుందో. అందమైన జ్ఞాపకాలతో ఊపిరిపోశావ్. నువ్వు ఉసురు తీస్తున్నావ్ అని అనుకుంటాడు రిషి.

  ఎక్సలెంట్ ఐడియా..

  ఎక్సలెంట్ ఐడియా..


  కట్ చేస్తే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి జగతి మాట్లాడుతుంటుంది. ఆమె స్థానంలో వసుధార ఉన్నట్లు ఊహించుకుంటాడు రిషి. ఆగిపోయావేంటి వసుధార.. మాట్లాడు.. ఏంటీ వసుధార చెప్పడం ఆపేశావేంటి అంటాడు రిషి. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయి చూస్తుంటారు. ఫణీంద్ర మాట్లాడుతూ ఇక్కడ వసుధార లేదు కదా అనడంతో మళ్లీ రియాల్టీలోకి వస్తాడు రిషి. జగతి కంటిన్యూ చేస్తుంది. ఇబ్బందిగా కూర్చున్న రిషి.. మళ్లీ సూపర్ వసుధార.. ఎక్సలెంట్ ఐడియా అని చప్పట్లు కొడతాడు. ఈ మధ్య వసుధార జపం చేస్తున్నాడేంటీ.. రిషి సార్ కి ఏమైంది అని అంతా అనుకుంటారు. దీంతో వెంటనే సారీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. స్టాఫ్ మొత్త నవ్వుకుంటూ ఉంటే.. మహేంద్ర-ఫణీంద్ర బాధపడుతుంటారు.

  మగాడిని అన్న పురుష అహంకారం..

  మగాడిని అన్న పురుష అహంకారం..

  మరోవైపు ఆస్పత్రిలో తల్లిదండ్రులకు సేవ చేస్తుంటుంది వసుధార. చక్రపాణి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకు ఏడుస్తారు నాన్నా అని వసుధార అడగడంతో.. నా అహంకారం కరిగి నీళ్లలా నా నుంచి వేరయిపోతున్నాయి. ఇవి కన్నీళ్లు కాదు. పోనీయమ్మా.. మొత్తం పోనీ.. మగాడిని అన్న పురుష అహంకారం. ఇంటికి పెద్దవాడిని అన్న తలబిరుసుతనం. నాదే చెల్లాలన్న అహంభావం. నా మొరటుతనం, మొండితనం నరనరాల్లో ఇన్నాళ్లు నిండిపోయిందమ్మా. పోనీ అవన్నీ కన్నీళ్ల రూపంలో పోని అని వసుధారను అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు చక్రపాణి. నిన్ను ఎంత బాధపటెట్టానమ్మా, చిత్రహింస పెట్టాను, చిత్ర వధ చేశాను. పరువు అనుకుంటూ నా కళ్లకకు పొరలు కమ్మిపోయాయి అని బాధపడతాడు చక్రపాణి.

  రిషి సార్ కి ఫోన్ చేసి మాట్లాడమ్మా..

  రిషి సార్ కి ఫోన్ చేసి మాట్లాడమ్మా..


  ఆ రాజీవ్ నా కళ్ల ముందే ముసుగేసుకుని తిరుగుతుంటే నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు. రాజుని చూసి రాక్షసుడు అనుకున్నాను. రాక్షసుడిని చూసి రాజు అనుకున్నాను అమ్మా.. నన్ను క్షమించగలవా. ఎన్ని తప్పులు చేసిన బిడ్డల్ని తల్లి మాత్రమే క్షమించగలదు. నువ్వే నా అమ్మవి. నన్ను భరించావ్. సహించావ్. ఇది అమ్మకు మాత్రమే సాధ్యం తల్లీ. చదువులో నువ్వు గెలిచావ్. ఇక నీ ప్రేమను గెలిపించుకో. రిషి సార్ ను కలుసుకో. రిషి సార్ ఫోన్ వస్తుందని నీ ఫోన్ పగలగొట్టాను. ఇప్పుడు నేనే చెబుతున్నాను ఇదిగో నా ఫోన్. రిషి సార్ కి ఫోన్ చేసి మాట్లాడమ్మా అని ఫోన్ ఇస్తాడు చక్రపాణి. అనంతరం.. కలుస్తాను నాన్న అని చెప్పిన వసుధార.. రిషి ఫొటో చూస్తూ మాట్లాడుకుంటుంది. మరోవైపు వసుధారను గుర్తు చేసుకుంటాడు రిషి.

  English summary
  Guppedantha Manasu Serial January 13 2023 Today Full Episode 658
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X