twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఝలక్‌ దిక్‌లాజా 5' విన్నర్ టీవీ రాముడు

    By Srikanya
    |

    Gurmeet Choudhary wins Jhalak Dikhla Jaa 5
    డిల్లీ : ప్రముఖ టెలివిజన్‌ నటుడు గుర్‌మిత్‌ చౌదరి త్వరలో ప్రేక్షకులను అలరించటానికి స్టెప్స్ వేయనున్నాడు. ఈయన పనర్ వివాహం సీరియల్ ద్వారా తెలుగువారికీ సుపరిచితమే. హిందీ టీవీ ధారావాహిక 'రామాయణ్‌'లో రాముడిగా వేషంకట్టి అందరి చేత శహభాష్ అనిపించుకుని, 'గీత్‌ హుయి సబ్‌సే పరాయి' సీరియల్‌ ద్వారా ఆడపిల్లల మనస్సులను దోచుకున్నాడీయన. ప్రస్తుతం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న 'పునర్‌ వివాహ్‌' అనే సీరియల్‌లో నటిస్తున్నారు. అప్పుడే ఆయనకు ఒక ప్రముఖ హిందీ టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డాన్స్‌ రియాలిటీ షో 'ఝలక్‌ దిఖ్‌లాజా:సీజన్‌-5'లో అవకాశం వచ్చింది.

    పునర్‌ వివాహ్‌లో యశ్‌ సూరజ్‌ ప్రతాప్‌ పాత్ర పోషిస్తున్నారు గుర్‌మీత్‌. ఝలక్‌ దిక్‌లాజాలో అవకాశం వచ్చినప్పుడు తాను ఇందులో విజయం సాధిస్తానని అసలు అనుకోలేదంటాడు గుర్‌మీత్‌. బుల్లి తెరపై తన నటనకు మంచి మార్కులు పడినా తనకు డాన్స్‌ అంతగా రాదని, ఈ షోలో పాల్గొనడం ద్వారా దాన్ని నేర్చుకునే అవకాశం ఉండటంతో తాను దీనిలో పాలుపంచుకున్నానంటాడీ యువ కిశోరం. ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌, నృత్య దర్శకుడు రిమో డి సౌజా, దర్శకుడు కరన్‌ జోహర్లను మెప్పించడం తనకు అంత సులభం కాలేదని చెప్తాడు గుర్‌మీత్‌. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత తన నృత్య దర్శకురాలు(కొరియోగ్రాఫర్‌)షంపాకు, తనకు ఎంతో సహకారం అందించిన తన భార్య దేబినాకు, తన నృత్యాన్ని మెచ్చుకుని తనకు ఓటు వేసిన ప్రేక్షకులకు చెందుతుందని వినమ్రంగా చెప్తాడీయన.

    బీహార్‌కు చెందిన 28 సంవత్సరాల గుర్‌మిత్‌ చౌదరి తన నటనా జీవితాన్ని తమిళ టెలివిజన్‌ మొదటి త్రీడి టీవీ సీరియల్‌ 'మాయావి'లో నటించడం చెప్పుకోదగ్గ విషయం. 2008వ సంవత్సరంలో గుర్‌మీత్‌ రాముడిగా, దేబినా బెనర్జీ సీతగా రామాయణ్‌లో నటించారు. ఆ తరువాత నిజ జీవితంలోనూ వీరు భార్యాభర్తలు కావడం గమనించదగ్గ విషయం. త్రేతాయుగంలో కౌసల్యా తనయుడు ఇలాగే ఉండేవాడేమో అన్నంతగా ఒదిగిపోయి నటించి మెప్పించాడు గుర్‌మీత్‌. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ మాన్‌ సింగ్‌ ఖురానాగా 'గీత్‌ హుయి సబ్‌సే పరాయి' సీరియల్‌లో తన సెక్రటరీని మొదట ఎంతగానో ద్వేషించి తరువాత ప్రేమించే పాత్రలో మెప్పించాడు.

    తనకు అంతర్జాతీయ నృత్యాలైన బ్రేక్‌ డాన్స్‌, రుంబా, జాజ్‌ అంటే చాలా ఇష్టమని, కానీ వాటిలో తనకు ప్రవేశంలేదని, పలు రకాల నృత్యాలను నేర్చుకునే అవకాశం ఈ డాన్స్‌ షో ద్వారా రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు ఏ నృత్యం అంతగా రాదని గుర్‌మీత్‌ ఎంతో వినమ్రంగా చెప్పినా ఈ రియాలిటీ షోలో సంప్రదాయ, సమకాలీన, పాశ్చాత్య, సినీ శైలిలో ఈయన చేసిన అదిరిపోయే డాన్స్‌ స్టెప్పులు మాత్రం న్యాయనిర్ణేతలను ఎంతగానో మెప్పించాయి. ఒకసారి సూపర్‌ మ్యాన్‌గా, మరోమారు దేవదాస్‌గా, ఇంకోసారి రోబోట్‌గా ఈయన చేసిన నృత్యాలు, హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

    ఝలక్‌ దిఖ్‌లాజాను ఒక సవాల్‌గా తీసుకుని తాను శ్రమించానని, పునర్‌ వివాహ్‌ షూటింగ్‌లో రోజుకు 12-14 గంటలు పనిచేసి, మళ్లీ రెండు గంటలు ప్రయాణం చేసి డాన్స్‌ రిహార్సల్స్‌లో పాలుపంచుకోవడం తనకు ఒక్కోసారి చాలా కష్టమనిపించేదని, కానీ ఈ నృత్యం తనకు తెచ్చి పెట్టిన విజయం తన శ్రమను మరిపించిందని చౌదరి అంటున్నారు. తన శరీర భాషకు సరిపోయే విధంగా నృత్యాలను సమకూర్చి, తన డాన్సులోని లోపాలను కప్పిపుచ్చి తనకు ట్రోఫీ అందించిన షంపాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    ఇప్పటికే పలు ప్రదర్శనల్లో తమ నృత్యంతో అందరిని మెప్పించిన రష్మి దేశాయి, రిత్విక్‌ ధన్‌జానీలను దాటుకుని ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు గుర్‌మీత్‌. ఇప్పటివరకు తాను సినిమాల్లో నటించడానికి ఈ నృత్యమే పెద్ద అడ్డంకిగా ఉండేదని, ఇప్పుడు తానేంటో ఈ నృత్య ప్రదర్శన ద్వారా నిరూపించుకోవడంతో తనకు వెండితెరపై మెరిసే అవకాశం త్వరలో వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు గుర్‌మీత్‌ చౌదరి.

    English summary
    Television actor Gurmeet Choudhary has won the fifth season of dance reality show Jhalak Dikhla Ja after beating co-contestants Rashami Desai Sandhu and Rithvik Dhanjani.Having impressed the judges — Madhuri Dixit Nene, Karan Johar and Remo D'Souza — with his hard work and dedication, Gurmeet walked away with prize money of Rs40 lakh and the title of the winner of Jhalak Dikhhla Jaa. The grand finale was also graced by actress Sridevi, who had come to promote her comeback project English Vinglish
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X