‘ఎన్టీఆర్‌తో గొడవ.. ఇప్పటికీ మనసులో పెట్టుకొని.. ’

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం లేని పేరు హరితేజ (Hari Teja).సీరియల్స్, టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ నటి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్ తో పాన్ ఇండియా, భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేస్తోంది. అయితే.. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

సీరియల్స్ నుంచి సినిమాల వరకూ
హరితేజ తన కెరీర్‌ను టెలివిజన్ ద్వారా ప్రారంభించింది. మనసు మమత, రక్తసంబంధం, తాళికట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తరువాత సీరియల్స్ ఫేమ్ తో సినిమాల వైపుకి అడుగుపెట్టింది, తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన "అ ఆ" సినిమాలో సమంత పనిమనిషిగా చేసిన పాత్రతో ఆమెను ప్రేక్షకులు బాగా గుర్తించారు. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది హరి తేజ.

Hariteja Reveals Funny Clash with Jr NTR During Devara Shoot Says He Still Teases Her

బిగ్ బాస్‌లో హరికథల హరితేజ
2017లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో హరితేజ కంటెస్టెంట్‌గా పాల్గొంది. తన ఎంటర్టైనింగ్ నేచర్, పాజిటివ్ వైబ్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తరువాత మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా పాల్గొంది. మొదటి సీజన్ లో కంటే 8 సీజన్ లో దుమ్మురేపింది. బాస్ గేమ్ షోతో తన హరికథలతో మరోసారి తన ప్రత్యేకతను చాటారుహరితేజ. రెండు సీజన్లలోనూ ఆమె గేమ్ ప్లే, కామెడీ టైమింగ్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించారు.

ఇటీవల నటి హరితేజ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిసిక్ టాక్స్' కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. "టీవీని వదిలేసి సినిమాల వైపు పూర్తిగా వెళ్లిపోయారా?"యాంకర్ వర్ష ప్రశ్నించగా హరితేజ నవ్వుతూ, "కొంచెం గ్యాప్ ఇస్తున్నాను అంతే. సినిమాల వైపు ట్రై చేస్తున్నాను. అయినా మొన్ననే కదా.. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ 8లో కనిపించాను. దాదాపు తొమ్మిది వారాలు టీవీలో ఉన్నాను కదా!" అంటూ తన స్టైల్‌లో జవాబు ఇచ్చింది.

తర్వాత వర్ష మరో హాట్ ప్రశ్న వేసింది "ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్‌కి రావడమే తప్పు అనిపించిందా?"అని ప్రశ్నించగా.. దీనికి హరితేజ సమాధానం ఇస్తూ.. బిగ్ బాస్ సీజన్ 1 లో అస్సలు అలాంటి ఫీలింగ్ రాలేదు. కానీ సీజన్ 8లో మాత్రం ప్రతిరోజూ ఎందుకు వచ్చానని ఫీలయ్యాను" అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించగా.. "సీజన్ 1కి సీజన్ 8 మధ్య చాలా మార్పులు వచ్చాయి. నేను పాల్గొన్న సీజన్ 8 తర్వాత బిగ్ బాస్ చూడొద్దని ఫిక్స్ అయ్యాను. ఇక ఆ షో మీద ఆసక్తి పూర్తిగా పోయింది" అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. "మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి పిలిస్తే వెళ్తారా?" అని వర్ష ప్రశ్నించగా.. హరితేజ నవ్వుతూ "ఏదైనా పని నచ్చకపోతే అందరూ తూర్పు తిరిగి దండం పెడతారు కదా... నేను మాత్రం అన్ని దిక్కులా తిరిగి దండం పెడతా!" అంటూ సరదగా సమాధానం ఇచ్చింది. ఈ జవాబుకు వర్ష రియాక్షన్ అదుర్స్.

ఎన్టీఆర్ తో గొడవ
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించడంతో హరితేజ మూడ్‌ పూర్తిగా మారిపోయింది. "జూనియర్ ఎన్టీఆర్‌తో మీకు ఏదో చిటపటలు ఉన్నాయట?" అని వర్ష ప్రశ్నించగా.. దీనికి హరితేజ నవ్వుతూ "బిగ్ బాస్ లో జరిగిన ఆ విషయం తారక్ ఇప్పటికీ మర్చిపోలేదు! దేవర సినిమా షూటింగ్ సమయంలో కూడా నన్ను ఏడిపించేవాడు. కొరటాల గారిని పిలిచి 'ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు? అసలు యాక్టింగ్ రాదు.. ఊరికే అరుస్తూ ఉంటుంది' అంటూ ఫన్నీగా కంప్లైంట్ చేశాడు"అని చెప్పింది.

హరితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "బిగ్ బాస్ పై ఆసక్తి పోయింది" అన్న మాటతో షో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఆమె మాటల వెనుక ఏదైనా ప్రత్యేక ఆంతర్యం ఉందా? లేదా సింపుల్ ఫన్ కామెంట్సేనా? అనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss telugu jr ntr hari teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X