‘పవన్ కళ్యాణ్ కే ఆ తిప్పలు తప్పలేదు.. అలాంటిది మనమెంత?‘
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారం ప్రారంభమైన ఈ సీజన్‌లో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. తాజాగా మాస్క్ మాన్ హరీష్ బిగ్ బాస్ హౌస్‌కి గుడ్‌బై చెప్పాడు. తన ప్రత్యేక హావభావాలు, సూటి మాటలు, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఎలిమినేషన్ షాక్ తప్పలేదు. అయితే ఆయన భార్య హరిత ఈ విషయం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
హరీష్ ఎలిమినేషన్‌పై స్పందించిన హరిత మాట్లాడుతూ.. "నా భర్త బిగ్ బాస్ షోలో పాల్గొనడం నాకు ఎంతో గర్వకారణం. ఇంట్లో ఎలా ఉంటాడో, షో లో కూడా అలాగే ఉన్నాడు. తన అసలు స్వభావాన్ని అక్కడ కూడా మార్చుకోలేదు. ఇది నిజమైన వ్యక్తిత్వం. ఆయన ఎథిక్స్, మోరల్స్‌ను కాపాడుకుంటూ ఉన్నాడు. ఎవరైతే విలువలతో జీవిస్తారో.. వారిపై ఇలాగే ట్రోల్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్‌గారిలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అందులో మనమెంత? మనం మన విలువలతో నిలబడగలగడం చాలు" అని చెప్పింది.

అలాగే హరీష్ బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు చేసిన ప్లానింగ్ గురించి కూడా హరిత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. "వాస్తవానికి ఆయననే నన్ను మోటివేట్ చేసి షోలోకి వెళ్లమన్నాడు. హరీష్ చాలా క్లియర్‌గా ఆలోచించే వ్యక్తి. ప్రతి సీజన్‌ను ఆయన డీటైల్స్‌గా విశ్లేషించేవారు. ఏది రియాలిటీ షోలో సరైన దారిలో ఉంటుందో, దాన్ని జీవితానికి అన్వయించుకునేవారు. అందుకే ఈ సీజన్‌లో ఆయన పాల్గొనడం ఒక థాట్‌ఫుల్ నిర్ణయం. షోలో ఏదైనా నెగటివ్ రియాక్షన్ వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని కూడా చెప్పాడు" అని వివరించింది.
హరీష్‌లో నచ్చిన అంశాల గురించి మాట్లాడుతూ, "అతని స్పాంటేనిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి 'అగ్నిపరీక్ష' అనే షోలో ఆయన ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రకరకాల ప్రశ్నలు అడిగారు. చనిపోయిన వారిలో మీకు ఎవరు ఇష్టమని అడిగితే ఆయన 'సుభాష్ చంద్రబోస్' అన్నారు. బతికున్న వారిలో ఎవరు ఇష్టమని అడిగితే 'పవన్ కళ్యాణ్' అని చెప్పారు. ఆ సమాధానాలు ఎంత క్షణికంగా ఇచ్చారో కానీ ఎంత గంభీరతతో ఉన్నాయో నాకు అర్థమైంది. అవన్నీ ప్రిపేర్ కాకుండా, మనసు నుంచి వచ్చిన సమాధానాలు" అని చెప్పింది.
హరీష్ ఎమోషనల్, జాయ్‌ఫుల్, క్లియర్ మైండ్‌డ్ పర్సన్ అని చెబుతూ, "తనను తాను నిరూపించుకోవడంలోనే ఆయన సంతోషం పొందుతారు. ఆయన జీవితం ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది" అంటూ హరిత అన్నారు. యాంకర్ "హరీష్ అన్న ఫ్యాన్స్‌కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?" అని యాంకర్ అడిగగా.. హరిత ఎమోషనల్‌గా స్పందించింది. "ముందుగా హరీష్ అభిమానులందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పలేను. ఆయన జెర్నీని ప్రేమగా చూసిన వేలాది మంది ప్రేక్షకులు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో, పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌ల్లో ఆయనకు ఇచ్చిన రిస్పాన్స్ చూసి నేను నిజంగా ఎమోషనల్ అయ్యాను" అంటూ హరిత చెప్పింది.
"హరీష్‌కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ఎంతో కృతజ్ఞతాభివందనాలు చెబుతున్నారు. ఆయనతో కనెక్ట్ అయిన వారు, ఆయన సింపుల్ నేచర్‌ని ఇష్టపడ్డ వారు అందరికీ ధన్యవాదాలు. నిజానికి మీ ప్రేమే ఆయనకు నిజమైన గెలుపు. బిగ్ బాస్ హౌస్‌లో గెలుపు కన్నా, ప్రజల మనసు గెలుచుకోవడమే పెద్ద విజయమని ఆయన ఎప్పుడూ చెబుతారు" అని హరిత పేర్కొంది. చివరగా ఆమె "హరీష్‌కి మీ ప్రేమ, ఆప్యాయత, సపోర్ట్ ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన మళ్లీ కొత్త అవతారంలో మీ ముందుకు వస్తారు. అప్పటికీ మీ సపోర్ట్ అలాగే ఉండాలి" అని హరిత చెప్పింది.


Click it and Unblock the Notifications











