Just In
Don't Miss!
- News
ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటే
- Sports
India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!
- Finance
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అవినాష్‌కు సీనియర్ హీరో మద్దతు: అప్పుడు లైఫ్ ఇచ్చాడు.. ఇప్పుడు బిగ్ బాస్ కోసం!
తెలుగు బుల్లితెరపై దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తోంది ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చాలా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న అతడు.. ఈ మధ్య బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఫినాలేకు ఎవరు వెళ్తారన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అవినాష్‌కు ఓ సీనియర్ హీరో మద్దతు తెలిపాడు. ఇంతకీ ఎవరాయన? పూర్తి వివరాలు మీకోసం!

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్ వరకు
మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ఆరంభించాడు అవినాష్. ఈ క్రమంలోనే ఎన్నో షోలలో ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ టీమ్ లీడర్ల దృష్టిలో పడ్డాడు. వాళ్ల ద్వారా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చి కొందరు టీమ్‌లలో సభ్యుడిగా పని చేశాడు. ఆ తర్వాత అతడిలోని అద్భుతమైన టాలెంట్‌ను గుర్తించిన షో నిర్వహకులు.. అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ.. మంచి గుర్తింపు
జబర్ధస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో అవినాష్ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నాడు. మూడో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు.. తన మార్క్ చూపిస్తు మంచి కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

బెస్ట్ ఎంటర్‌టైనర్.. ఆ ట్రాక్‌తో హాట్ టాపిక్
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి అవినాష్ ఎంతో సరదాగా ఉంటున్నాడు. అతడి రాకతో షోకే కొత్త కళ వచ్చినట్లు అనిపించింది. సహచరులపై ఫన్నీ జోక్స్ వేయడం, కొందరిని ఇమిటేట్ చేయడం, టాస్కులను చక్కగా పూర్తి చేయడం వంటి వాటితో బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు. ఆరియానాతో ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింతగా హాట్ టాపిక్ అవుతున్నాడు.

ఫైనల్ ముంగిట సహనం కోల్పోతున్నాడు
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలేకు దగ్గర పడింది. ఇలాంటి సమయంలో అవినాష్ సహనం కోల్పోతున్నాడు. ప్రతి దానికీ అతిగా స్పందిస్తూ చెడ్డ పేరును మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటికే గత వీకెండ్‌లో ఎలిమినేట్ అయిన అతడు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయ్యాడు. అప్పటి నుంచి అతడితో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఓటింగ్‌లో వెనుకబడుతున్నాడు.

అవినాష్‌కు సీనియర్ హీరో నుంచి మద్దతు
ప్రస్తుతం జరుగుతోన్న సీజన్‌లో అందరూ అభిజీతే ఈ సారి గెలుస్తాడని అభిప్రాయపడుతున్నారు. అతడి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇక, అవినాష్‌కు సన్నిహితులైన మెగా బ్రదర్ నాగబాబుతో పాటు కొందరు జబర్ధస్త్ టీమ్ లీడర్లు కూడా అభికే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సీనియర్ హీరో అవినాష్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

అలా లైఫ్ ఇచ్చి.. ఇప్పుడు బిగ్ బాస్ కోసం
అద్భుతమైన యాక్టింగ్, గంభీరమైన గొంతుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్. తాజాగా ఈయన అవినాష్‌కు మద్దతు ప్రకటించాడు. అతడు తన కుటుంబ సభ్యుడు లాంటోడని, అందుకే అందరూ అవినాష్‌కు ఓట్లు వేయమని కోరాడు. గతంలో సాయి కుమార్‌ను ఇమిటేట్ చేయడం ద్వారానే జబర్ధస్త్ కమెడియన్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే.