»   » నదిలో మునిగిపోయి మృతి చెందిన టీవీ ఆర్టిస్టు

నదిలో మునిగిపోయి మృతి చెందిన టీవీ ఆర్టిస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ హిందీ టీవీ నటుడు మోహిన్ ఖాన్ నదిలో మునిగి చనిపోయారు. స్నానానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం సరిహద్దులోని తైఫీ వద్ద గల జియాభరాలి నదిలో అతడు మంగళవారం సాయంత్రం మునిగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

సరదాగా స్నానం చేయటానికంటూ నదిలోకి దిగిన మోహిన్ అది పూర్తయ్యాక ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు చేరాలని అనుకున్నాడు. అయితే ఊహించని విధంగా ... వేగంగా ఓ అలలాంటి ప్రవాహం రావడంతో నీటిలో మునిగి గల్లంతయ్యారని వివరించారు.

Hindi TV Actor Mohin Khan dies trying to swim in Kameng River

హిందీలోని పలు టీవీ కార్యక్రమాల్లో మోహిన్ నటించాడు. అంతేకాకుండా ఆయన స్వయంగా నిర్మాత కూడా. ఇతడికోసం తొలుత గజ ఈతగాళ్లు, అనంతరం ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి గాలింపులు చేపట్టినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.

Hindi TV Actor Mohin Khan dies trying to swim in Kameng River

ఓ నేషనల్ చానెల్ తరుపున డాక్యుమెంటరీ చిత్రం తీసేందుకు మొత్తం ఐదుగురు సభ్యుల బృందంతో ఈ ప్రాంతానికి మోహిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ వాతావరణ భద్రతకు సంబంధించినదని తెలుస్తోంది.

English summary
Renowned TV actor Mohin Khan died while drowning in river Kameng near Tippi in West Kameng district of Arunachal Pradesh.
Please Wait while comments are loading...