»   » హెచ్‌ఆర్సీ నోటీసులు: ఎంటర్టెన్మెంట్ ముసుగులో చండాలం ఇకనైనా ఆగుతుందా..?

హెచ్‌ఆర్సీ నోటీసులు: ఎంటర్టెన్మెంట్ ముసుగులో చండాలం ఇకనైనా ఆగుతుందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: ఒకప్పుడు ఆ కార్యక్రమాలను టీవీ కామెడీ షోలు అనే వారు. కానీ కామెడీ పండిచాలనే తాపత్రయంలో హద్దులు దాటుతూ రాను రాను అసహ్యంగా తయారయ్యాయని ఆ షోలపై విమర్శలు వెల్లువెత్తాయి.

  డబల్ మీనింగ్ డైలాగులు, పరమబూతు పదజాలం, నీచమైన పేరడీలతో ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి ఆ షోలు చూసే పరిస్థితి లేదని, ఇలాంటి కార్యక్రమాలు చిన్నారులు, ఎదుగుతున్న పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, అలాంటి షోలలో వాడే పదజాలం, డైలాగులు ఒంటపట్టించుకుని పిల్లలు, యువకులు కూడా చెడు సంస్కృతిలోకి వెళ్లి పోతున్నారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఉన్నాయి.

  అన్నీ అవే బాట

  అన్నీ అవే బాట

  కొన్ని రోజులు క్రితం పరిస్థితి చూస్తే..... ఏదో ఛానల్‌లో ఎప్పుడో ఒకప్పుడు అలాంటి షోలు వచ్చేవి. అయితే ఇలాంటి వాటికే టీఆర్పీ రేటింగులు ఎక్కువగా వస్తుండటంతో దాదాపు అన్ని ఛానల్స్ లో ఇలాంటి షోలు ప్రారంభం అయ్యాయి.

  పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే దిక్కు లేదు

  పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే దిక్కు లేదు

  బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్, పటాస్ లాంటి షోల్లో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్.దివాకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోక పోవడం ఆయన హెచ్ఆర్సీని సంప్రదించాడు.

  మీరైనా చర్య తీసుకోండి

  మీరైనా చర్య తీసుకోండి


  సదరు షోలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ ఆయా షోల నిర్మాతలు, డైరెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ, ఆగస్టు 10 లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

  ఇకనైనా ఈ చండాలం ఆగుతుందా?

  ఇకనైనా ఈ చండాలం ఆగుతుందా?

  ఆయా షోలలో అసభ్యత పెరగడంపై ఆగ్రహంగా ఉన్న కొందరు.... హెచ్ఆర్సీ నోటీసులతో ఇకనైనా ఈ చండాలం ఆగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

  టీవీ షోలకు సెన్సార్ ఉండాలి

  టీవీ షోలకు సెన్సార్ ఉండాలి

  ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారం అవతున్న కొన్ని కార్యక్రమాలను చూస్తుంటే వాటికి కూడా సెన్సార్ నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

  English summary
  Human Rights Commission issues notice to Jabardast and Pataas producers and directors. Jabardasth Comedy Show and Pataas have become widely watched programs on Telugu TV channels. The two shows have high TRP ratings and are most viewed. Audiences are addicted to these standup comedy shows that they have started viewing them on mobiles also. However, there is also criticism that vulgar and double-meaning dialogues are being used to evoke fun Jabardasth skits.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more