»   »  కార్టూన్‌ సినిమాగా మార్చేసి వదులుతున్నారు

కార్టూన్‌ సినిమాగా మార్చేసి వదులుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్రిష్‌ ఎంత పాపులరో తెలుసుగా... మన భారతీయ సూపర్‌ హీరో.. హృతిక్‌ రోషన్‌ నటించిన సినిమాలో పాత్ర.. ఇప్పుడు క్రిష్‌ యానిమేషన్‌ పాత్రగా రానున్నాడు.. ఇప్పుడు అంతా టీవీలో చూసేయొచ్చు.. అదే 'కిడ్‌క్రిష్‌'. సాహసాలు, మాయలు మంత్రాలు, అతీత శక్తులతో నడిచే కార్టూన్‌ సినిమాగా 'కిడ్‌క్రిష్‌' త్వరలో సందడి చేయనుంది. ప్రత్యేకంగా పిల్లలకోసమే తీస్తున్న ఈ సినిమాని చూడ్డానికి థియేటర్‌కి వెళ్లాల్సిన పనిలేదు.

టీవీలో కార్టూన్‌ నెట్‌వర్క్‌ ఛానెల్‌లో అక్టోబరు 2న చూడచ్చు. Toonz animation వాళ్లు దీన్ని రూపొందిస్తున్నారు. హృతిక్‌రోషన్‌ నటించిన 'కోయీ మిల్‌ గయా' సినిమా తెలుసుగా? వేరే గ్రహం నుంచి ఫ్లయింగ్‌ సాసర్‌ భూమి మీదకు రావడం, అందులోని ఒక గ్రహాంతర వాసి ఇక్కడ ఉండిపోవడం, దాంతో హీరో హృతిక్‌రోషన్‌ స్నేహం చేయడం.. ఆ కథంతా గుర్తుందిగా? తర్వాత ఆ సినిమాకు కొనసాగింపుగా 'క్రిష్‌' సినిమా వచ్చింది. ఇప్పుడు 'క్రిష్‌3'ని కూడా తీస్తున్నారు.

Hrithik Roshan's Krrish now an animated series on Cartoon

అయితే ఈలోగా ప్రత్యేకంగా పిల్లల కోసం క్రిష్‌ పాత్రని యానిమేషన్‌లో సృష్టించారు. దీన్ని త్రీడీ యానిమేషన్‌ పద్ధతిలో తీస్తున్నారు. అయితే హృతిక్‌ పాత్ర పెద్దవాడిగా కాకుండా చిన్నపిల్లాడి రూపంలో ఉంటుంది. యానిమేషన్‌ పాత్రగా రూపొందుతున్న తొలి బాలీవుడ్‌ పాత్ర ఇదే.

ఇందులో కథ కూడా కొంత సినిమానే పోలి ఉంటుంది. పదకొండేళ్ల క్రిష్‌ చాలా అల్లరి పిల్లాడు. ఈ అబ్బాయికి పుట్టుకతోనే బోలెడు శక్తులుంటాయి. కానీ ఈ విషయం అతనికి తెలియదు. గాల్లో పక్షిలా ఎగరగలడు. ఎంత దూరమైనా దూకేయగలడు. ఎంత పెద్ద పనైనా చిటికెలో చేయగలడు. ఓసారి ఓ దుష్టశాస్త్రవేత్త ఈ లోకాన్ని నాశనం చేయడానికి ప్రయోగాలు చేస్తున్నాడని క్రిష్‌కి తెలుస్తుంది.

వెంటనే మిత్రులతో కలిసి ఆ శాస్త్రవేత్త పనిపట్టడానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత బోలెడు సాహసాలు చేస్తాడు. కోయీ మిల్‌గయాలో కనిపించే గ్రహాంతర వాసి జాదూ ఇందులోనూ కనిపిస్తాడు. ఇలా ఇదొక్క సినిమానే కాదు. ఈ పేరుతో కార్టూన్‌ నెట్‌వర్క్‌ ఛానెల్‌లో మొత్తం నాలుగు సినిమాలు రాబోతున్నాయి. పిల్లల ఆసక్తినిబట్టి ధారావాహికగా కూడా తీస్తారు.

English summary
Hrithik Roshan, who will next be seen in the third installment of his superhero franchise Krrish, unveiled an animated version of the movie called Kid Krrish on Tuesday. The actor said that Kid Krrish was better than the movie itself. “The only difference between the two is Kid Krrish is better than Krrish,” Hrithik told reporters at the unveiling.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu