మిడ్‌నైట్ హైపర్ ఆదికి అదే పని... రష్మీ అయినా ఓకేనన్న జబర్దస్త్ కమెడియన్

Photo Courtesy: Etv Telugu India

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తన పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తూ ఉంటాడు. బజర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీతో పాటు ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో ఆది స్కిట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. జబర్దస్త్‌తో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా ఆది తన భుజాలపై నడిపిస్తున్నాడు. తాజాగా ఈ కార్యక్రమంలో ఆయన చేసిన స్కిట్ కడుపుబ్బా నవ్వించింది. ఈ వివరాల్లోకి వెళితే..

హైపర్ ఆది మిడ్‌నైట్ ఏం చేస్తాడు
శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్‌లో సింగిల్‌గా ఉన్న వాళ్ల గురించి డిస్కషన్ వచ్చింది. ఆది గారు మీరు సింగిల్ కాబట్టి.. ఒక సింగిల్ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు మిడ్‌‌నైట్ ఏం చేస్తుంటారు? అని రష్మి అడిగిన ప్రశ్నకు హైపర్ ఆదికి షాక్ తగిలింది. సింగిల్‌గా ఉంటే ఏం చేస్తామని ఆది నవ్వేస్తాడు. మీరు సింగిల్‌గా ఉన్నాను అన్నారు కదా.. మా సెట్‌లో సింగిల్ గర్ల్స్ కూడా ఉన్నారు.. సింగిల్ బాయ్స్, సింగిల్స్ గర్ల్స్ కలిసి మింగిలైతే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తుంది రష్మి. లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉందామని ఫిక్స్ అయిన తర్వాత మళ్లీ మింగిల్ ఎందుకు అని అంటుంది శ్రీసత్య.

Hyper Aadi and Potti Naresh funny Performance with Bigg Boss Sri Satya at Sridevi Drama Company

Photo Courtesy: Etv Telugu India

ఆదిని అన్నయ్య అనేసిన శ్రీసత్య
ఆవిడ మనసు ఆల్రెడీ విరిగిపోయిందని ఆది అనగా.. విరిగిన మనసుని మీరే మీ ప్రేమతో అతికించి పులకరిస్తారని రష్మి అంటుంది. అలా విరిగిన మనసుల్ని అతికించుకుంటూ వెళ్లాలంటే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేయాలని పంచ్ వేస్తాడు ఆది. దాంతో శ్రీసత్యకి ప్రపోజ్ చేసి ఆమె మనసుని అతికించమని ఆదిని పిలుస్తుంది రష్మి. ఆది తనదైన స్టైల్‌లో ప్రపోజ్ చేయగా.. బంగారు బొమ్మలా చూసుకోవాలంటే బాయ్‌‌ఫ్రెండే అవసరం లేదని, అన్నయ్య కూడా చూసుకోవచ్చని శ్రీసత్య అనడంతో ఆది షాక్ అవుతాడు. నీది చాలా పెద్ద మనసని, నాకు చిన్న మనసు కావాలని శ్రీసత్య అడగటంతో పొట్టి నరేష్‌ని పిలుస్తాడు ఆది.

గుండెల్లో పెట్టుకుంటాన్న మణికంఠ
పొట్టి నరేష్‌ కూడా తనదైన స్టైల్‌లో ప్రపోజ్ చేసినా శ్రీసత్య పట్టించుకోదు.. దాంతో నాగమణికంఠ వెళ్లి ఆమె మనసుని అతికిస్తాడని అంటాడు ఆది. అందరూ నా మనసుని అతికిస్తూనే ఉంటారా? అని శ్రీసత్య పంచ్ వేస్తుంది. మణికంఠ వెళ్లి ఇన్ని రోజ్ పెటల్స్ మధ్యలో నువ్వే ఓ రోజ్ పెటల్‌లా ఉన్నావని బిస్కెట్స్ వేస్తాడు. ఈ రోజ్‌కి ఎలా అయితే ముళ్లుంటాయో, నీ లైఫ్‌లో అలాంటి ముళ్లు రానీవ్వకుండా, ఎటువంటి కష్టం రానీవ్వకుండా, గుండెల్లో పెట్టుకుని మీ డాడీ ఎలా చూసుకున్నాడో అలా చూసుకుంటానని చెబుతాడు. దానికి అందరూ చప్పట్లు కొడతారు.

రష్మీ, శ్రీసత్య కావాలంటూ నరేష్ మారాం
అయితే మణికంఠ చెప్పిన విధానానికి శ్రీసత్య ఇంప్రెస్ అవుతుంది. ఇలా చెబితే ఎవరైనా పడతారని అంటుంది శ్రీసత్య. కానీ పొట్టి నరేషే కావాలని అనడంతో మనోడు సంతోషంగా వెళ్తాడు. నాకు ఎప్పటి నుంచో ఒక తమ్ముడు ఉండాలనే కోరిక ఉండేదని శ్రీసత్య అనడంతో స్టేజ్ మీదకి వచ్చిన నరేష్ నాకు సత్య కావాలని అంటాడు. శ్రీసత్య కాకపోయినా కనీసం రష్మీ అయినా ఓకే అనడంతో అంతా షాక్ అవుతారు. అయితే నీ లైఫ్ బాగుంటుందని ధైర్యంగా ఉండాలని రష్మీ అనగా... ఈవిడ ఆవిడని మోటివేట్ చేస్తోంది, ఆవిడనే నలుగురు మోటివేట్ చేయాలి రోజూ అని ఆది పంచ్ వేస్తాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ పర్ఫార్మెన్స్ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసి నవ్వుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X