For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కత్తి మహేష్ ‘అంగచూషణ’పై హైపర్ ఆది ఫైర్.. హీరోల ఫ్యాన్స్ కొట్టడం ఖాయం..

  By Rajababu
  |

  జబర్దస్త్ కామెడీ షోలో తన ఆకారంపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై కత్తి మహేష్ స్పందించడం వివాదంగా మారింది. బాడీ షేమింగ్ మంచి పద్దతి కాదు అని కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై ఆది మండిపడ్డారు. బిగ్‌బాస్ షోలో ఇతర పార్టిసిపెంట్లు బట్ట అని కామెంట్ చేసినప్పడు ఎందుకు ఊరుకొన్నారు అని ఆది ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా అతడిని ఎవరైనా అంటే సహించేది లేదు అని ఆది హెచ్చరించారు. ప్రముఖ టెలివిజన్ చానెల్ నిర్వహించిన డిబేట్‌లో ఆది, కత్తి మహేష్ మధ్య నడిచిన సంభాషణ ఇదే..

  మారండ్రా నాయనా ! వైరల్ అవుతున్న కత్తి మహేష్ పోస్ట్
  కత్తి మహేష్ క్యూట్ బాయ్

  కత్తి మహేష్ క్యూట్ బాయ్

  కత్తి మహేష్‌కు పొట్ట ఉందని, బట్టతల ఉంది అని నేను అనుకోవడం లేదు. కత్తి మహేష్ క్యూట్ బాయ్. సుత్తి రాజేష్ అనేవాడు మా ఊర్లో ఉండే స్నేహితుడిని ఉద్దేశించి చేసింది. నా ఫ్రెండ్‌కు పెసరట్టు వేయడం కూడా రాదు. దోశలు వేయడం రాదు. కత్తి మహేష్ మాదిరిగానే నా ఫ్రెండ్ సుత్తి రాజేష్ మాట్లాడుతుంటాడు. పవన్ కల్యాణ్‌ను వాడు కూడా విమర్శిస్తుంటాడు.

  బిగ్‌బాస్‌లో బట్ట అంటే

  బిగ్‌బాస్‌లో బట్ట అంటే

  బిగ్‌బాస్‌లో 11వ రోజు ఎపిసోడ్‌లో కత్తి మహేశ్‌ను శివబాలాజీ, హరితేజ బట్ట అని టీజింగ్ చేయగా ఆయన కూడా బట్ట ఎంజాయ్ చేశాడు. అప్పుడు బాడీ షేమింగ్‌పై కత్తి మహేష్ ఎందుకు అభ్యంతరం చేయలేదు. కత్తి మహేశ్ మంచి క్రిటిక్. ఆయన గురించి నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ కత్తి మహేశ్ మాదిరిగానే నా ఫ్రెండ్ సుత్తి రాజేష్ రివ్యూలు రాసి సినిమాలు చూడొద్దు అంటున్నాడు. వాడిపైనే నా స్కిట్ రాశాను.

  బాడీ షేమింగ్ అనేది

  బాడీ షేమింగ్ అనేది

  బాడీ షేమింగ్ అనేది సినిమాలో ఒక కీలక అంశం. జంధ్యాల నుంచి చాలా మంది సినీ దర్శకులు ఆర్టిస్టుల శరీర ఆకృతిపైనే సెటైర్లు వేశారు. డైలాగులు రాశారు. అలాంటి వారిలో బాబు మోహన్, బ్రహ్మనందం, గీతాసింగ్ లాంటి వారున్నారు.

  రివ్యూలో సినిమా బాగోలేదు..

  రివ్యూలో సినిమా బాగోలేదు..

  కొన్ని నెలలు ఓ రచయిత సినిమా కథ రాస్తాడు. దర్శకుడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తాడు. రెండు గంటలు సినిమా చూసి బాగాలేదని చెబితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా?

  బాగానే ఉంటాం.. ఫ్యాన్సే వెధవలు

  నాతో ఫోటో దిగి మేమంత బాగానే ఉంటాం. ఫ్యాన్సే వెధవలు అని పోస్ట్ చేయడంపై ఆది మండిపడ్డారు. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను. నీవు నన్ను ఉద్దేశించి వెధవ అని అంటావా? నాతో దిగిన ఫొటోను నీవు అలా వాడుకొంటావా అని నిలదీశాడు.

  అంగచూషణ అని కామెంట్

  అంగచూషణ అని కామెంట్

  ఫ్యాన్స్ అనే వాళ్లు లేకపోతే రివ్యూ అనే పదమే ఉండదు. కొంత మంది రాంగ్.. మరి కొంత మంది రైట్ అంటారు. అందులో భాగమే రివ్యూ.
  మీ దేవుడికి పొర్లు దండాలు పెట్టుకొంటారో.. అంగ ప్రదక్షిణ చేసుకోండి లేదా అంగచూషణ చేస్తారో మీ ఇష్టం అని కత్తి మహేశ్ పెట్టిన పోస్టుపై హైపర్ ఆది ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  మేము చేస్తే వ్యభిచారామా?

  మేము చేస్తే వ్యభిచారామా?

  మీరు ఎవరినైనా అంటారు.. కానీ మిమ్మల్ని వేరే వారు అనొద్దు అంటే కుదరదు. మీరు మాట్లాడితే వ్యాపారం. పవన్ ఫ్యాన్స్ మాట్లాడితే అది వ్యభిచారామా అని కత్తి మహేశ్ దుమ్ము దులిపాడు. మీరు ఫేస్‌బుక్ పెట్టిన పోస్టును మీరు చదువుకోగలవా?

  మీ పోస్ట్ చదివితే తంతారు..

  మీ పోస్ట్ చదివితే తంతారు..

  ఆ పోస్ట్ చదివితే పవన్ ఫ్యాన్స్ కాదు.. ప్రతీ హీరో ఫ్యాన్స్ కొడుతారు. పవన్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారు. ఆది నన్ను బెదిరిస్తున్నాడు. ఇతర హీరోల ఫ్యాన్స్ బెదిరిస్తున్నాడు అని చెప్పుకొంటు పబ్బం గడుపుకొంటున్నావు.

  పవన్ లేకపోతే కత్తి అనేవాడు..

  పవన్ లేకపోతే కత్తి అనేవాడు..

  పవన్ లేకపోతే కత్తి మహేశ్ అనేవాడి అడ్రస్ ఉండదు. నా అడ్రస్ ఏంటో తెలియాలంటే యూట్యూబ్‌లో వచ్చి చూడు. అక్కడే తేల్చుకొందాం. నా ఫాలోయింగ్ ఏమిటో అక్కడే తేల్చుకుందాం. నేను కత్తి మహేష్‌ను ఎటాక్ చేస్తే అతను వచ్చి నాతో ఫొటో దిగుతాడా? అతనే వచ్చి నాతో మాట్లాడి ఫొటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టావు.

  జబర్దస్త్ కామెడీ కంటే

  జబర్దస్త్ కామెడీ కంటే

  తెలుగు ఫిలిం జర్నలిజంలో టీవీలో రివ్యూ చెప్పేది నేను ఒక్కడినే అని కత్తి మహేశ్ చెప్పడం జబర్దస్త్ కామెడీ కంటే ఎక్కువగా ఉంది. నాకు జీవనాధారం రివ్యూలు రాయడం అనేది పెద్ద కామెడీ.

  నిన్ను ఎవరూ గౌరవించరు..

  నిన్ను ఎవరూ గౌరవించరు..

  అంగచూషణ అంటూ పెట్టిన పోస్ట్ చూస్తే ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. నీవు పెట్టిన పోస్టును ఎవరూ సమర్థించారు. పవన్ గురించి చెడుగా మాట్లాడటం ఆపితే మంచిగా ఉంటుంది.

  పవన్ కల్యాణ‌ను విమర్శిస్తే ఊరుకోం..

  పవన్ కల్యాణ‌ను విమర్శిస్తే ఊరుకోం..

  ఎన్నో మంచి పనులు చేస్తున్న పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిని ఎవరైనా విమర్శిస్తే నేను ఊరుకోను. మాపై అవాకులు చెవాకులు పేలితే ఎంతకైనా తెగిద్దాం అని ఆది అన్నారు.

  English summary
  Hyper Aadi fired on Kathi Mahesh on Facebook post. Aadi objected contraversial post in Facebook. He said Kathi Mahesh post on Pawan Kalyan fans is very objectionable.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X