అదైనా కోసుకొంటా కానీ.. నీ జోలికి రాను.. శ్రీప్రియతో హైపర్ ఆది
తెలుగునాట పాపులర్ రియాలిటీ షోగా కొనసాగుతోంది ఢీ. కొన్నాళ్లుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు ఎంతోమంది ప్రతిభావంతులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. పలువురు జడ్జిలు, యాంకర్లు, కంటెస్టెంట్స్ మారినా ఈ షోకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఢీ షో మాదిరిగా ఎన్నో షోలు వచ్చినప్పటికీ ఢీకి మాత్రం ఎదురులేకుండా సాగుతోంది. మధ్య జబర్దస్త్ నటులు హైపర్ ఆది తదితరులు ఢీ కార్యక్రమంలో అడుగుపెట్టడంతో దీనికి మరింత ఆదరణ దక్కుతోంది. తాజాగా ఢీ 20లో హైపర్ ఆది తాజాగా చేసిన వ్యాఖ్యలు కడుపుబ్బా నవ్వించాయి. ఈ వివరాల్లోకి వెళితే..
పంచ్‌లతో ఆది చెడుగుడు
హైపర్ ఆది పంచ్‌లు, ప్రాసలతో తను ఎక్కడుంటే అక్కడ జోష్ తీసుకొస్తారు. ఈటీవీకి ఆస్థాన కళాకారుడిగా మారిన ఆది.. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, ఇతర షోలలో సందడి చేస్తుంటారు. ఆది టాలెంట్‌ను గుర్తించిన యాజమాన్యం ఆదికి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఢీ ఎపిసోడ్‌ను పరిశీలిస్తే.. ఈరోజు మన భవిష్యవాణి ఏం చెప్పబోతుందో చూద్దామని ఆదితో నందూ అంటాడు. దాంతో భవిష్య వాణి బుక్ వచ్చి పడుతుంది. పేజి తిప్పి చూడగా.. ఆది ఢీ కంటెస్టెంట్స్ అంతా మనస్తాపానికి గురయ్యారు. వాళ్లకి ట్రీట్‌మెంట్ ఇచ్చి మళ్లీ మామూలు మనిషిగా మార్చడం నీ బాధ్యత అని వాయిస్ వినిపిస్తుంది. ఆ వెంటనే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినోడు కూడా బాగా మనస్తాపానికి గురయ్యాడని ఆది అనడంతో అంతా నవ్వేస్తారు.

డాక్టర్‌గా హైపర్ ఆది
నాకు ఒక పని ఇచ్చారని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తాడు ఆది. ఆ వెంటనే డాక్టర్ కోటు, స్టెతస్కోప్ తీసుకుని ఎంట్రీ ఇస్తాడు ఆది. మీరు సడెన్‌గా డాక్టర్‌గా మారిపోయారేంటీ? అని అడుగుతాడు నందు. సడెన్‌గా డాక్టర్ ఎలా అయ్యారని నందు అడగ్గా.. మొన్న ఒకడికి ఒళ్లు కాలుతుంటే జ్వరం వచ్చిందని చెప్పా, ఒకడికి తలనొప్పి అని చెప్పా దాంతో నేను డాక్టర్‌నని నమ్మకం వచ్చేసింది అని ఆది చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఏమైనా ఆపరేషన్ చేశారా అని నందు అడగ్గా.. రీసెంట్‌గా ఒక అమ్మాయి ఫేస్ బాగోపోతే గాడిద ఫేస్ పెట్టానని చెబుతాడు.
నిల్చొని ఎక్కువసేపు చేయలేకపోతున్నా
కంటెస్టెంట్స్ సరిగా పర్ఫార్మెన్స్ చేయడం లేదంటే వాళ్లని ఒకసారి చెక్ చేస్తానని చెబుతాడు ఆది. వాళ్లకంటే ముందు నాకు చెక్ చేయమని నందు అడగ్గా.. నీకు ఏమైంది? అని ఆది ప్రశ్నిస్తాడు. ఈ మధ్య నిల్చొని ఎక్కువసేపు చేయలేకపోతున్నానని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఆ వెంటనే లేడీ కంటెస్టెంట్ నాకు కంట్లో నలక పడిందని చెప్పడంతో ఆది చూస్తాడు. దానికి మేం చేయలేమా? అని నందు గొడవకు దిగుతాడు.
నాలుకైనా కోసుకుంటా
నేను డాక్టర్ని అయితే నువ్వు నలక తీయడం ఏంటీ? అని ఆది ప్రశ్నిస్తాడు. మీరు మీరు గొడవ పడటం ఆగితే నా నలక పోయిందని ఆ అమ్మాయి చెప్పడంతో ఇద్దరూ ఊసురుమంటారు. ఇంకో నలక ఉంటే వేస్తానని ఆది చెప్పడంతో ఆ కంటెస్టెంట్ నవ్వేస్తుంది. ఆ వెంటనే మరో కంటెస్టెంట్ శ్రీప్రియ ఇప్పుడు నా కంట్లో నలక పడిందని చెబుతుంది. దాంతో నా నాలుకైనా కోసుకుంటాను కానీ నీ జోలికి మాత్రం రానని ఆది చెప్పడంతో అందరూ నవ్వేస్తారు. అయితే ఆ నలక సంగతి తెలియదు కానీ జనరల్‌గా చూస్తానని అంటాడు. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని ఆ అమ్మాయి చెప్పగా.. ఆ సంగతి నేను తేలుస్తానని చెబుతాడు ఆది. ప్రస్తుతం ఆది పంచ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











