Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: ఎమ్మెల్యే రోజా కిడ్నాప్.. కుర్చీలో కూర్చోబెట్టి మరీ చేతులు కట్టేశారు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో రోజా పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించడంతో పాటు దాదాపు తెలుగులోని స్టార్ హీరోల అందరి సరసన నటించిందీ హీరోయిన్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచింది. అదే సమయంలో రాజకీయాల్లోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె అధికార పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రోజాను కొందరు కిడ్నాప్ చేశారు. ఇంతకీ ఎవరా కొందరు.? ఎందుకు కిడ్నాప్ చేశారు.?

సినిమాలు, రాజకీయాలే కాదు అక్కడ కూడా
రోజా పేరు చెప్పగానే చాలా సినిమాలు గుర్తుకు వస్తాయి. అదే సమయంలో రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్ అని అంటుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. బుల్లితెరపై జబర్ధస్త్ అనే షోలో జడ్జ్‌గా చేసి మెప్పించడం మరో ఎత్తు. ఆమె కొన్నేళ్లుగా ఈ కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. దీంతో ఆమెకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో పెరిగిపోతున్నారు.

రోజాపై షో ప్రభావం.. అందుకే ఎమ్మెల్యేగా గెలిచారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు రోజా. ఆమె ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం వెనుక జబర్ధస్త్ షో పాత్ర ఎంతో ఉందని గతంలో ఓ సందర్భంలో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. అంతలా ఆమెను తెలుగు వాళ్లకు దగ్గర చేసిందీ షో. అందుకే ఇప్పటికీ ఈ షోను విడిచి వెళ్లలేదామె.

ఆయన వదిలేశాడు.. ఒంటరిగా నడుపుతోంది
దాదాపు ఏడేళ్లుగా జబర్ధస్త్ షో ప్రసారం అవుతోంది. దీనికి మొదటి నుంచీ రోజాతో పాటు మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్‌గా వ్యవహరించాడు. అయితే, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయినప్పటికీ రోజా ఒంటరిగా ఈ కామెడీ షోను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఒక్కరు జబర్ధస్త్‌కు పర్మినెంట్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
రోజాకు భారీగా పెరిగిన ఆదాయం.. ఆయనే కారణం
జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో రోజాకు భారీగా ఆదాయం పెరిగిపోయిందని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్ వెళ్లిపోయినా.. ఈ షోలో కొనసాగుతున్న రోజాకు జబర్ధస్త్ నిర్వహకులు రెమ్యూనరేషన్ పెంచేశారట. మొన్నటి వరకు ఆమె నెలకు రూ. 20 లక్షలు అందుకోగా.. ఇప్పుడది రూ. 30 లక్షలు అయిందని సమాచారం.

ఎమ్మెల్యే రోజా కిడ్నాప్.. వీడియో వైరల్
ఒకవైపు జబర్ధస్త్‌లో జడ్జ్‌గా వ్యవహరిస్తూ.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న రోజా కిడ్నాప్‌కు గురయ్యారు. కాకపోతే.. ఇది కామెడీ షోలో స్కిట్‌లో భాగంగా జరిగింది. అవును.. ఇప్పటి వరకు జడ్జ్ చైర్‌లో కూర్చుని కనిపించిన రోజా.. ఈ సారి హైపర్ ఆది టీమ్ స్కిట్‌లో కనిపించారు. ఇందులో భాగంగానే ఆమెను ఆది అండ్ కో కిడ్నాప్ చేసింది.

చేతులు కట్టేసినా.. రెచ్చిపోయి పేల్చేసింది
ఈ స్కిట్‌లో రోజాను హైపర్ ఆది గ్యాంగ్ చైర్‌లో కూర్చోబెట్టి మరీ కట్టేసింది. అయినప్పటికీ ఆమె పంచ్ డైలాగులు పేల్చి రెచ్చిపోయారు. ‘నీకు బీపీ వస్తే ** భయపడతారేమో.. అదే నాకు బీపీ వస్తే ** వణికిపోద్దీ'.. ‘నువ్వు స్కిట్ చేయాలంటే స్క్రిప్ట్ రాయాలి.. రిహాల్సస్ చేయాలి.. అదే నేను చేయాలంటే హ్యాంగర్‌కు ఉన్న చీర కట్టుకుని వచ్చేస్తా' వంటి డైలాగులతో ఆకట్టుకున్నారు.