Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రోజాకి అతనంటేనే ఇష్టం.. సీక్రెట్ బయటపెట్టిన హైపర్ ఆది! ఓపెన్‌గా చెప్పేయడంతో..
వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి తన గ్లామర్‌తో అప్పటి కుర్రకారును బుట్టలో వేసుకున్న రోజా.. ఇప్పుడు జబర్దస్త్ అంటూ నవ్వులతో నేటి కుర్రకారును మాయ చేస్తోంది. జబర్దస్త్ తెరపై రోజా నవ్వులకు ఉండే డిమాండ్ వెలకట్టలేనిది. ఆ నవ్వులే ఈ జబర్దస్త్ షోకి బూస్టింగ్. జబర్దస్త్ జడ్జిగా ఓ రేంజ్ పాపులారిటీ కొట్టేసిన ఈమెకు నేటితరం హీరోల్లో ఒకరంటే చాలా ఇష్టమట. ఆ విషయం బయటపెట్టేశాడు హైపర్ ఆది. వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. పంచులే పంచులు
జబర్దస్త్ తెరపై వచ్చే కామెడియన్లలో హైపర్ ఆది స్టయిలే వేరు. మనోడు రంగంలోకి దిగాడంటే చాలు యాంకర్ అనసూయ మొదలుకొని జబర్దస్త్ జడ్జ్‌ల వరకూ అందరిపై పంచులమీద పంచులు విసురుతుంటాడు. హైపర్ ఆది దెబ్బకు పంచులు పడ్డా కూడా నవ్వలేక నవ్వేస్తుంటారు అనసూయ, రోజా.

మెల్లగా సీక్రెట్స్ బయటపెట్టేస్తున్న ఆది..
స్కిట్ లతోనే మ్యాజిక్ చేసే హైపర్ ఆది.. గత కొంతకాలంగా జబర్దస్త్ పార్టిసిపెంట్స్ సీక్రెట్స్ బయటపెడుతూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఓ స్కిట్‌లో భాగంగానే జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ రెమ్మ్యూనరేషన్ తాలూకు విషయాలపై ఓపెన్ అయిన హైపర్, ఇప్పుడు రోజా గురించిన ఓ విషయం బయటపెట్టి వార్తల్లో నిలిచాడు.

రోజాకి అతనే ఇష్టం.. సరికొత్త ఉత్సాహం
ఇదే జబర్దస్త్ వేదికగా నేటి హీరోల్లో రోజా ఫేవరేట్ హీరో ఎవరనే విషయం చెప్పేశాడు హైపర్ ఆది. స్కిట్ పూర్తయ్యాక హైర్ ఆది మాట్లాడుతూ.. ఈ జెనరేషన్ హీరోల్లో రోజా గారి ఫేవరెట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అని చెప్పి అందరిలో సరికొత్త ఉత్సాహం నింపాడు.

అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన
అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతో ఇష్టపడే రోజా, ఇప్పుడు కృష్ణ తనయుడు మహేశ్ బాబును కూడా ఇష్టపడుతుందనే విషయం తెలియడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. జబర్దస్త్ జడ్జ్‌కి జబర్దస్త్ హీరో అంటే ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నాగబాబు లేకున్నా రోజా.. ముక్కున వేలేసుకునే పరిస్థితి
ఇకపోతే జబర్దస్త్ జడ్జ్ స్థానం నుంచి నాగబాబు ఇటీవలే నిష్క్రమించినా తనదైన స్టైల్‌లో రోజా ఒక్కరే జబర్దస్త్ రేటింగ్స్ తీసుకొస్తుండటం గమనార్హం. నాగబాబు వెళితే రేటింగ్స్ పడిపోవచ్చని అంచానా వేసిన వారంతా ఇప్పుడు రోజా పట్టుకొస్తున్న రేటింగ్స్ చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.
Recommended Video


మహేష్ బాబు ఎంజాయ్.. సరిలేరు నీకెవ్వరు
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికొస్తే.. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు రూపంలో సంక్రాంతి సక్సెస్ సాధించి ప్రస్తుతం ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన వంశీ పైడిపెల్లితో గానీ, పరశురామ్ తో గానీ సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.