For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందరి ముందే స్టేజ్ మీద రెచ్చిపోయిన హైపర్ ఆది.. దీపికను హగ్ చేసుకుని వదలకుండా!

  |

  జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా మంది ఉంటారు కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. కానీ హైపర్ ఆదికి ఉండే క్రేజ్ వేరు. జబర్దస్త్ ద్వారా పరిచయం అయిన ఆయన ప్రస్తుతం తెలుగు టెలివిజన్ పై మంచి స్థాయి అందుకున్నాడు. బుల్లితెరపై హైపర్ ఆది ఎంతగా ఫేమస్ అయ్యాడో సోషల్ మీడియాలోనూ అంతే ఫేమస్. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో హైపర్ ఆది స్కిట్స్ మిలియన్ల కొద్ది వ్యూస్‌ను కొల్లగొడుతుంటాయి. అయితే మొదట్లో జబర్దస్త్ కే పరిమితం అయిన ఆయన ఇప్పుడు డీ షో లో కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన దీపికా పిల్లిని హగ్ చేసుకుని రచ్చ రేపాడు. ఆ వివరాల్లోకి వెళితే

  అలా జబర్దస్త్ లోకి

  అలా జబర్దస్త్ లోకి


  మామూలుగా హైపర్ ఆది వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వీకెండ్స్‌లో మాత్రం అలా సినిమా ఛాన్స్‌ల కోసం తిరిగేవాడట. అలా తిరుగుతూ తిరుగుతూ చివరకు జబర్దస్త్ సెట్‌లోకి వచ్చి పడ్డాడు. అంతకు ముందే రైటర్‌గానూ పని చేసిన ఈయన చేసిన ఒక షార్ట్ ఫిలిం అదిరే అభికి నచ్చడంతో అతని టీమ్ లో స్థానం సంపాదించాడు. ఇక అక్కడి నుంచి మంచి అవకాశాలు అందుకున్నాడు.

  ఢీ 13లో రచ్చ

  ఢీ 13లో రచ్చ


  ప్రస్తుతం టీమ్ లీడర్ పొజిషన్ దాకా ఎదిగిన ఆయన ప్రతి గురువారం ప్రసారం అయ్యే జబర్ధస్త్‌లో తన స్కిట్లే టాప్‌లో ఉండేలా చూసుకుంటాడు. ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలతో స్కిట్లు చేసే ఆది పంచుల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో మునిగేలా చేస్తుంటాడు. అందుకే అతడి టీమ్‌కు సంబంధించిన స్కిట్లకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. తన స్కిట్‌లో నటించే వారిపై పంచులు వేస్తూ ఆసక్తి రేపుతూ ఉంటాడు. ఈ మధ్య ఢీ 13లో కూడా మనోడు మెంటార్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  ఆ ఛాలెంజ్

  ఆ ఛాలెంజ్


  తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మీ, దీపికా పిల్లి హంగామా కనిపించింది. యాంకర్ ప్రదీప్ దర్శనం ఇచ్చిన ఈ ప్రోమోలో దీపిక కౌగిలిలో పరవశించిపోవడం హైలైట్ అయింది. రాబోతున్న ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుండగా వారిలో ఇద్దరు డాన్సర్లను ఎత్తుకోవాలని ఛాలెంజ్ చేస్తాడు ప్రదీప్. ముందు తడబడుతూ ఉంటే రష్మీ ఒక ఆఫర్ ఇస్తుంది. ఆ ఇద్దరినీ ఎత్తుకొని డాన్స్ చేస్తే దీపిక వచ్చి హగ్గిస్తుంది అని రష్మీ చెప్పడంతో హైపర్ ఆది వెంటనే సిద్ధం అయ్యాడు.

  Recommended Video

  Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu

  హగ్ చేసుకుని తన్మయత్వంతో


  అలా ఎత్తుకుని డ్యాన్స్ వేశాక సుడిగాలి సుధీర్ ఎంటరై హైపర్ ఆది ఛాలెంజ్ ఫినిష్ చేశాడు కాబట్టి దీపిక హగ్ ఇవ్వాల్సిందే లేదంటే నేను రష్మీకి హగ్ ఇస్తా అంటాడు. దీంతో రష్మీ షాకైంది. వెంటనే తాను ఇంప్రెస్ అయ్యానన్న దీపిక వెళ్లి హైపర్ ఆదికి హగ్ ఇవ్వడంతో మనోడు తన్మయత్వంతో వదలకుండా అలాగే ఉండిపోతాడు. ఇక రష్మీ ఇక చాలని అనడంతో అప్పుడు అందరూ సర్దుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  Read more about: deepika pilli ఢీ 13
  English summary
  The 13th season of the outstanding dance show Dhee has been entertaining the people. Kings Vs. Queens team members have taken the competition in a challenging manner. in the recent promo hyper aadi is seen hugging deepika pilli
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X