twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుల్వామా దాడిపై చంద్రబాబు: రాజకీయాల్లో లేను, వారికి వ్యతిరేకమన్న యాంకర్ రష్మి..

    |

    పుల్వామా దాడి ఘటనపై యాంకర్ రష్మి రియాక్ట్ అయిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది సంగతి తెలిసిందే. ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో... 'నీ పాకిస్థాన్‌ గొప్పతనం ఏంటిరా? సాలే మావాడివి అయిపోయావు కాబట్టి బతికి బయటపడ్డావు. మాతోనే మీ అస్థిత్వం. లేకపోతే నువు దానితో సమానం. మూసుకొని కూచో అంటూ రష్మీ ఫైర్ అయింది. దేశ విభజన సమయంలో అవతలి వైపు వెళ్లాల్సింది. కానీ మన దురదృష్టం కొద్ది ఈ దేశంలో ఉన్నాడు' అని మండిపడ్డారు.

    తాజాగా రష్మి తన ట్విట్టర్ పేజీలో... పుల్వామా దాడిలో చనిపోయిన మేజర్ దౌండియాల్‌కు అతడి భార్య నివాళులు అర్పిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసేలా ఉంది.

    భావోద్వేగానికి గురి చేస్తున్న వీడియో

    రష్మి షేర్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.

    చంద్రబాబు వీడియోపై రష్మి రియాక్షన్

    ‘‘ఎన్నికల ముందు కావాలనే పుల్వామా దాడి చేయించారనే ఆరోపణలను కొట్టిపారేయలేమని, నరేంద్ర మోడీ ఏమైనా చేయగలరని'' ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ నెటజన్ రష్మిని కోరారు. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ... ‘మన లీడర్లను మనమే ఎన్నుకుంటాం. మీ చాయిస్ మీద మీకు నమ్మకం ఉండాలి' అంటూ వ్యాఖ్యానించారు.

    నేను రాజకీయాల్లో లేను, వారికి మాత్రమే వ్యతిరేకం

    రాజకీయ నాయకులపై కామెంట్ చేయడానికి నేను రాజకీయాల్లో లేను. రాజకీయ నాయకులు ఎవరికి వారు సొంత ఎజెండా కలిగి ఉన్నారు. నేను కేవలం నా దేశం గురించి చెడుగా మాట్లాడే వారికి మాత్రమే వ్యతిరేకం.. అని రష్మి తెలిపారు.

    అదే నెగిటివిటీని దూరం చేస్తుంది

    పుల్వామా ఘటనపై స్పందించిన రష్మిపై పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. భారతీయుల్లో ప్రోయాక్టివిటీ ఉంటే అది దేశంలోని నెగిటివిటీని తగ్గిస్తుందని తెలిపారు.

    English summary
    "I’m not into politics to comment on any political leader they all have there own agenda. I’m only against people who talk negatively about my nation." Rashmi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X