అట్టర్ ప్లాప్ అసంతృప్తి: నిర్మాతలను కోర్టు కీడుస్తానన్న ఉపాసన
ముంబై: ఒకప్పుడు హిందీ టీవీ ఛానల్ 'కలర్స్'లో ప్రముఖ స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ కపిల్ శర్మతో సాగిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఈ కార్యక్రమం నుండి కపిల్ శర్మతో పాటు ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులంతా తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో కృష్ణ అభిషేక్ లీడ్ రోల్ లో 'కామెడీ నైట్స్ లైవ్' పేరుతో ఈ షో కంటిన్యూ చేస్తున్నారు.
అయితే కపిల్ శర్మ ఉన్నపుడు ఈ షోలో పింక్ బువా పాత్రలో చేసిన ఉపాసన సింగ్ మాత్రం కలర్స్ ఛానల్ లోనే ఉండిపోయింది. కపిల్ శర్మ ఇతర క్యారెక్టర్ ఆర్టిసులు ఈ షో నుండి తప్పుకున్న తర్వాత 'కామెడీ నైట్స్'షో కు ఆదరణ తగ్గడం ప్రారంభం అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాసన సింగ్ తాజాగా ఈ షో నిర్వహణ, నిర్మాతల తీరుపై అసంతృప్తి వెల్లగక్కింది. ఈ షో నుండి తాను కూడా తప్పుకున్నట్లు ప్రకటించింది.

కపిల్ శర్మ షో నుండి వెళ్లి పోయిన తర్వాత ఎపిసోడ్లు చాలా చప్పగా సాగుతున్నాయని, స్క్రీప్టు చాలా చెత్తగా ఉంటోందని, అందుకే ఇపుడు జరుగుతున్న షోలన్నీ ఏడ్చినట్లు ఉంటున్నాయని తెలిపింది. ప్రొడ్యూసర్లు తనకు నాలుగు నెలల పనికి సంబంధించిన పారితోషికం ఇవ్వలేదని ఆరోపించింది. తనకు ఇచ్చే పారితోషికం విషయంలో నిర్మాతలను కోర్టుకీడుస్తానని తెలిపింది. 'కామెడీ నైట్స్ లైవ్' అట్టర్ ప్లాప్ కావడంతో నిర్మాతలు, ఆర్టిస్టుల మధ్య విబేధాలు వచ్చాయని ఉపాసన సింగ్ వ్యవహారంతో తేలిపోయింది.
కాగా.... కపిల్ శర్మ ఇపుడు సోనీటీవీతో టై అప్ అయి 'కపిల్ శర్మ షో' పేరుతో షో నిర్వహిస్తున్నారు. ఇపుడు ఈ షో కలర్స్ చానల్ లో ప్రసారం అవుతున్న కామెడీ నైట్స్ కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగులతో దూసుకెలుతోంది. త్వరలోనే ఉపాసన సింగ్ కూడా ఈ షోలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











