»   » యోగా గురువు రాందేవ్‌ బాబా బయోపిక్‌లో నటిస్తానంటున్న స్టార్ హీరో

యోగా గురువు రాందేవ్‌ బాబా బయోపిక్‌లో నటిస్తానంటున్న స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ఇప్పుడు ఎటు చూసినా బయోపిక్ ల రాజ్యం నడుస్తోంది. యోగా గురువు రాందేవ్‌ బాబా జీవితం ఆధారంగా సినిమా తీస్తారా..తీస్తే...ఎవరు హీరోగా చేస్తారు... అనే సందేహం వస్తుంది కదా. కానీ రణ్ వీర్ సింగ్ మాత్రం తను చేస్తానంటున్నారు. అయితే జోక్ గానే సుమా.

I would like to play Baba Ramdev in biopic: jokes Ranveer

పూర్తి వివరాల్లోకి వెళితే... బాలీవుడ్‌ 'ఖిల్జి' రణ్‌వీర్‌ సింగ్‌.. రీల్‌ లైఫ్‌ యోగా గురువు రాందేవ్‌ బాబాగా నటిస్తానంటున్నాడు. ఎజెండా ఆజ్‌ తక్‌ కార్యక్రమంలో రణ్‌వీర్‌, రాందేవ్‌ బాబాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌వీర్‌.. రాందేవ్‌ బాబాను డ్యాన్స్‌ వేయమన్నాడు. ఆయనడ్యాన్స్‌ చేయలేనంటూ పలు యోగాసనాలు వేసి చూపించారు. అది చూసి రణ్‌వీర్‌.. యోగాసనాలతో బాజీరావ్‌ మస్తానీలోని మల్హరీ పాటకు డ్యాన్స్‌వేశాడు.

ఈ సందర్భంగా రణ్‌వీర్‌ మాట్లాడుతూ.. రాందేవ్‌ బాబా జీవితాధారంగా బయోపిక్‌ తీస్తే అందులో తప్పకుండా తాను నటిస్తానని చెప్పాడు. ఆ తర్వాత సరదాగా సూపర్‌స్టార్స్‌ షారుక్‌, సల్మాన్‌, ఆమిర్‌, అమ్రీష్‌పురి, సంజయ్‌దత్‌ల గొంతుల్ని మిమిక్రీ చేస్తూ అందరినీ నవ్వించాడు రణ్‌వీర్‌. రణ్‌వీర్‌ బేఫిక్రే ప్రచారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

I would like to play Baba Ramdev in biopic: jokes Ranveer

బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, వాణి కపూర్లు జంటగా నటించిన చిత్రం 'బేఫిక్రే'. ఈ సినిమా మొత్తం పారిస్‌లోని ప్రముఖ కట్టడాలు, చారిత్రక వంతెనల వద్ద చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో పారిస్‌లోని గ్రెవిన్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో రణ్‌వీర్‌ మైనపు విగ్రహం ఏర్పాటుచేయనున్నారు.

ఇందుకోసం మ్యూజియం అధికారులు రణ్‌వీర్‌ ఫొటోలు, కొలతలు తీసుకుంటుండగా తీసిన ఫొటోలు రణ్‌వీర్‌ అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 2017లో రణ్‌వీర్‌ మైనపు విగ్రహం సిద్ధం కాబోతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన బేఫిక్రే చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది.

English summary
Ranveer Singh has played Peshwa Bajirao and will soon be seen as Alauddin Khilji in "Padmavati," but the actor has expressed his desire to essay the role of Baba Ramdev if a biopic is ever made on the yoga guru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu