twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు న్యూస్ ఛానెల్ లో టీవీ సీరియల్

    By Srikanya
    |

    Indraneel's CID Vishwanath - New Detective Serial
    హైదరాబాద్ : ఇన్నాళ్లు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లోనే వచ్చిన టీవి సీరియల్స్ ఇప్పుడు న్యూస్ ఛానెల్స్ ప్రేక్షకులను అలరించటానికి రెడీ అవుతున్నాయి. విసు 24 ఫ్రేమ్స్ సమర్పణలో జైనిత్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత, నటుడు విసు తన్నీరు నిర్మిస్తున్న సి.ఐ.డి. విశ్వనాథ్ టీవీ సిరియల్ టీవీ-5లో ప్రతి ఆదివారం రాత్రి 7-30 గం.లకు ప్రసారం అవుతోంది.

    బుల్లి తెర హీరో ఇంద్రనీల్ నటిస్తున్న 'సి.ఐ.డి విశ్వనాథ్' టీవీ సీరియల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జైనీత్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రవణ్‌కుమార్ వీర్లపాటి దర్శకత్వంలో విసు తన్నీరు నిర్మిస్తున్నారు. నిర్మాత విసు తన్నీరు మాట్లాడుతూ ' శ్రీవారు, ఎవరు అనే రెండు సీరియల్స్‌ను నిర్మించిన మా సంస్థ నుంచి వస్తున్న మూడో ప్రయత్నమిది. దర్శకుడు శ్రవణ్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సీరియల్‌ను నిర్మిస్తున్నాం.

    విసు 24 ఫ్రేమ్స్ సమర్పణలో జైనీత్ ప్రొడక్షన్స్ పతాకంపై నటుడు, నిర్మాత విసు తన్నీరు నిర్మిస్తున్న ధారావాహిక 'సి.ఐ.డి. విశ్వనాథ్'. ఈ నెల 11 నుంచి టి.వి 5లో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ అడ్వెంచరస్ ధారావాహిక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ ధారావాహిక ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఇంద్రనీల్ ప్రధాన పాత్ర పోషించారు' అని తెలిపారు. విసు తన్నీరు. ముఖేష్, తిలక్, మహేశ్వరి, గిరీష్, మక్కెన, నామాల రవీంవూదసూరి, దివ్య, శ్రవణ్ తదితరులు నటిస్తున్నారు.

    ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌లో సీరియల్స్ ప్రసారమవ్వడం మనకు తెలిసిందే. కానీ న్యూస్ చానల్‌లో సీరియల్ ప్రసారమైతే..? అవును తెలుగులో న్యూస్‌చానల్‌గా అందరికీ సుపరిచితమైన టీవీ5 ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నటుడు, నిర్మాత అయిన విసు తన్నీరు ఈ కొత్త ఒరవడికి తెరలేపాడు. 'సి.ఐ.డి. విశ్వనాథ్' పేరుతో నిర్మించిన ఈ సీరియల్ ప్రతి ఆదివారం ప్రసారమవుతోంది. న్యూస్‌చానల్‌లో ప్రసారమవుతున్న తొలి సీరియల్ కూడా ఇదే కావడం విశేషం. పూర్తి అడ్వెంచర్‌తో రూపొందిన ఈ సీరియల్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు చెపుతున్నారు. ఇంద్రనీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సీరియల్ అద్యంతం సస్పెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందట. వీరి ప్రయోగం సక్సెస్ అయితే మిగతా న్యూస్‌చానల్స్ కూడా ఇదే దారిలో నడుస్తాయో లేదో వేచిచూద్దాం.

    నిర్మాత విసు తన్నీరు మాట్లాడుతూ భారీ బడ్జెట్‌తో రూపొందించిన అడ్వెంచరస్ సీరియల్ ఇదేనని, న్యూస్ ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న తొలి సీరియల్ కూడా ఇదే కావడం విశేషమని తెలిపారు. సాధారణంగా అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌కోసం సీరియల్స్ తీస్తుంటే వాటికి భిన్నంగా తాము న్యూస్ ఛానెల్స్‌కోసం ఈ సీరియల్ నిర్మించామని, ప్రతి ఒక్కరినీ ఈ సీరియల్ ఆకట్టుకుంటుందని తెలిపారు.

    ఇప్పుడు వస్తున్న సీరియల్స్‌కి భిన్నంగా ఆద్యంతం సస్పెన్స్‌తో ప్రేక్షకులకు మంచి ఫీల్‌ను అందిస్తుందని దర్శకుడు శ్రవణ్‌కుమార్ వీర్లపాటి తెలిపారు. ఇంద్రనీల్, ముఖేష్, తిలక్, మహేశ్వరి, గిరీష్, మక్కెన, నామాల రవీంద్రసూరి, దివ్య, శ్రవణ్, ప్రవీణ్ నటిస్తున్న ఈ సీరియల్‌కు కథ: నామాల రవీంద్రసూరి, మాటలు: శివానంద్, కెమెరా: మురళీ, ఎపిసోడ్ డైరెక్టర్: శివానంద్, కోడైరెక్టర్: మహేష్, నిర్మాత: విసు తన్నీర్, దర్శకత్వం: శ్రవణ్‌కుమార్ వీర్లపాటి.

    English summary
    Long legged handsome TV artist Indraneel thought something in different. Yes, Visu Tanneru is producing a TV serial named ‘cid vishwanath’ in the direction of Sravan Kumar. Filmy sources say that, 15 years old Hindi TV serial ‘CID’ still running successfully on Sony TV (dubbed into Telugu by MAA TV) is the real inspiration behind ‘cid vishwanath’ and most of the episodes in shooting stages now are observed to have a typical flavor one would find in ‘CID.’ Set of Telugu audience who love to enjoy suspense thrillers with adventurous aspect added might enjoy this ‘Cid Vishwanath ’ Looks like, there is even a change in trend for small screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X