For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 2nd Episode: నందూ విషయంలో తులసి యూటర్న్.. ఇంటికి తీసుకొచ్చేందుకు ప్లాన్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఫ్యాక్టరీని తీసుకునేందుకు మాధవి, మోహన్‌ను తులసి డబ్బు అడుగుతుంది. అప్పుడు వాళ్లు లేవని చెప్పడంతో నిరాశగా వెనుదిరగగా నగలు ఇస్తారు. కానీ వాటిని ఆమె తీసుకోదు. ఆ తర్వాత తాగి పడిపోయిన నందూను లాస్య ఇంటికి తీసుకెళ్లగా ఇద్దరికీ వాగ్వాదం జరుగుతుంది. తర్వాత ప్రేమ్‌ మనసు మార్చేందుకు అభి ఎంతగానో ప్రయత్నిస్తాడు.

  Evaru Meelo Koteeswarulu నుంచి ఊహించని ప్రకటన: తారక్ డైలాగ్స్ కేక.. ప్రోమోనే ఇలా ఉంటే షో ఎలా!

  అభికి దివ్య సూటి ప్రశ్న... కొత్త ప్లాన్

  అభికి దివ్య సూటి ప్రశ్న... కొత్త ప్లాన్

  తండ్రిని ఇంటికి తీసుకు రావాలని అభి.. ప్రేమ్, దివ్యతో మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. దివ్య కూడా తండ్రిని తీసుకు రావాలని అంటుంది. కాకపోతే లాస్యను వద్దంటుంది. దీంతో ప్రేమ్ అన్న మీద ఫైర్ అవుతాడు. అప్పుడు అభి కొత్త ప్లాన్ చెబుతూ ‘డాడ్‌ను కావాలనుకుంటే లాస్యను కూడా ఒప్పుకోవాలి' అంటాడు. దీనికి మాత్రం దివ్య, ప్రేమ్ అడ్డు పడతారు.

  శృతిని టార్గెట్ చేసిన అంకిత... ప్రేమ్

  శృతిని టార్గెట్ చేసిన అంకిత... ప్రేమ్

  అభి, ప్రేమ్, దివ్యల మధ్య చర్చ జరుగుతుండగా.. అంకిత ఏడ్చుకుంటూ వస్తుంది. రావడం రావడమే ‘శృతి నన్ను అవమానించింది. బయటి వాళ్లకు మన ఫ్యామిలీ మేటర్స్ ఎందుకు' అని అంటుంది. అంతలో ప్రేమ్ కలుగజేసుకుని ‘అయినా ఆమె అన్నది నిజమే కదా. అందులో తప్పేముంది? నువ్వే కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావ్' అని ఓ రేంజ్‌లో కోప్పడతాడు.

   తులసి ఎంట్రీ... శృతిపై అభి ఆగ్రహం

  తులసి ఎంట్రీ... శృతిపై అభి ఆగ్రహం

  వదినపై ప్రేమ్ గొడవ పడుతుండగా తులసి వచ్చి ఆపుతుంది. అప్పుడు వాళ్లకు సర్ధి చెప్పుతుంది. ఆ తర్వాత అభి ‘అయినా శృతి.. అంకితను అనడం ఏంటి మామ్. పరాయి వాళ్లకు మన గురించి ఎందుకు' అని అంటాడు. దీనికి తులసి ‘శృతిని పరాయి మనిషి అనొద్దు. తన మన కుటుంబ సభ్యురాలు' అంటుంది. ఆ తర్వాత శృతి వచ్చి తులసి దగ్గర బాధ పడగా.. ధైర్యం చెబుతుందామె.

  లాస్యకు అంకిత ఫోన్.. ప్రేమ్ క్షమాపణ

  లాస్యకు అంకిత ఫోన్.. ప్రేమ్ క్షమాపణ

  ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్పేందుకు లాస్యకు అంకిత ఫోన్ చేస్తుంది. ‘మీరు ఇంటికి రావడానికి అభి ఓకే చెప్పాడు. కానీ, దివ్య, ప్రేమ్ మాత్రం అడ్డు చెబుతున్నారు. మీరు అమ్మమ్మతో మాట్లాడండి' అని అంటుంది. అంతలో ప్రేమ్ అక్కడకు వచ్చి అంకితకు సారీ చెబుతాడు. అలాగే, శృతిని అర్థం చేసుకోమంటాడు. దీనికి అంకిత కూడా యాక్టింగ్ చేస్తూ ఓకే అంటుంది.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

   మామగారిని ఆలోచించమన్న తులసి

  మామగారిని ఆలోచించమన్న తులసి

  ఇంట్లోకి నందూను తీసుకు రావాలని అంతా చర్చించుకుంటుండగా.. తులసి తన మామగారితో ఈ విషయం గురించి మాట్లాడుతుంది. ఆయనను వెనక్కి తీసుకొచ్చే విషయంపై పునరాలోచించుకోవాలని అంటుంది. కానీ, దీనికి మాత్రం పరందామయ్య ఒప్పుకోడు. అయినప్పటికీ తులసి మరింతగా బలవంతపెడుతుంది. అయినా ఆయన మారడు. దీంతో ఆమె వెళ్లిపోతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  లాస్య ప్లాన్.. నందూ ఇంటికి అనసూయ

  లాస్య ప్లాన్.. నందూ ఇంటికి అనసూయ

  అంకిత చెప్పన దాని ప్రకారం అనసూయతో లాస్య మాట్లాడుతుంది. నందూ పరిస్థితి బాగోలేదని అంటుంది. దీంతో ఆమె తన కొడుకు దగ్గరకు వెళ్తుంది. అంతలో నందూ బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు అతడికి ధైర్యం చెబుతుంది. ‘నాన్నకు అలా జరిగింది తులసి వల్లే. నీ వల్ల కాదు' అంటుంది. అయినా ‘నాన్న మాట్లాడకపోతే ఎలాగో ఉందమ్మ' అంటూ నందూ దీనికి ఒప్పుకోడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 387: Ankitha Targeted Shruthi. Then She Blames her. After That Prem Said Apology to Ankitha. Tulasi Talk to Parandamayya to Take back his Decision on Nandu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X