For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 5th Episode: తులసికి ఊహించని ప్రమాదం..నందూ మనసు విరిచేసేలా లాస్య ప్లాన్

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. భర్తతో పెద్ద గొడవ జరిగినా తులసి మాత్రం ఏమీ పట్టనట్టు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అలాగే, మామగారు ఆమెను అభినందిస్తాడు. అంతలో అత్తగారు వచ్చి తన కొడుక్కి విడాకులివ్వమని అడుగుతుంది. దీంతో తులసి ఆమెను ఛాలెంజ్ చేస్తుంది. ఇక, నందూ ఆ ఘటనను తలుచుకుంటూ తెగ బాధ పడతాడు.

  తులసి కొత్త స్కూటీ.. వాళ్ల కోరికతో

  తులసి కొత్త స్కూటీ.. వాళ్ల కోరికతో

  స్కూటీ కొనాలని తులసి.. శృతి మధ్య జరుగుతున్న చర్చతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. కొత్తది కొనడానికి మాత్రం ఒప్పుకోని తులసి.. ఎట్టకేలకు సెకెండ్ హ్యాండ్ స్కూటీ కొనాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు అభి తన ఫ్రెండ్‌ స్కూటీని కొనడానికి మాట్లాడతాడు. అందుకు అనుగుణంగానే 18 వేలకు స్కూటిని కొనుగోలు చేస్తారు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు.

  నందూపై లాస్యను రెచ్చిగొట్టిన భాగ్య

  నందూపై లాస్యను రెచ్చిగొట్టిన భాగ్య

  ఫంక్షన్‌లో జరిగిన దానిపై నందూ ఇంకా బాధ పడుతూనే ఉంటాడు. దీనిపై లాస్య, భాగ్య మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు భాగ్య ‘నువ్వు బావగారిని అలా వదిలేస్తే.. ఆయన మళ్లీ తులసక్క దగ్గరకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే గొడవలా బెదిరించడం కాకుండా.. ప్రేమగా చెప్పి ఆయన మనసును మార్చుకో. లేకపోతే నష్టం జరిగిపోతుంది' అంటూ ఆమెను రెచ్చగొడుతుంది.

  డ్రైవింగ్‌లో ప్రమాదం.. తులసి గాయం

  డ్రైవింగ్‌లో ప్రమాదం.. తులసి గాయం

  స్కూటి వచ్చిన తర్వాత తులసి ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉంటారు. అప్పుడు తులసి తనకు స్కూటీ నడపడం రాదని చెబుతుంది. దీంతో అందరూ ధైర్యం చెప్పడంతో ఆమె చక్కగా డ్రైవింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక్కదాన్నే వెళ్లొస్తా అని బయటకు వెళ్తుంది. ఆ సమయంలో ఎదురుగా కారు వస్తుండడంతో భయపడి స్కూటీతో సహా కింద పడిపోతుంది. దీంతో చేతికి గాయం అవుతుంది.

  లాస్యకు సరైన రిప్లై ఇచ్చిన తులసి

  లాస్యకు సరైన రిప్లై ఇచ్చిన తులసి

  తులసి పడిపోడానికి కారణం అయిన కారు మరెవరిదో కాదు.. లాస్యది. అందులో నుంచి బయటకు వచ్చిన ఆమె ‘నా వల్ల ఇప్పటికీ పడిపోతూనే ఉన్నావు తులసి పాపం' అంటూ జాలి పడుతుంది. అప్పుడు తులసి ‘నేను కింద పడిందే చూస్తున్నావు.. తిరిగి లేచింది మాత్రం చూడడం లేదు' అంటుంది. అప్పుడు లాస్య కూడా ఆమెను ఇబ్బంది పెట్టేలా మాటల దాడి చేస్తుంది.

  ఆ పరిస్థితి వస్తుందని హెచ్చరించింది

  ఆ పరిస్థితి వస్తుందని హెచ్చరించింది

  తన వల్ల భవిష్యత్‌లో కూడా కష్టాలు ఉంటాయని లాస్య.. తులసితో అంటుంది. అప్పుడు తులసి ‘నువ్వు నన్ను చూసి భయపడే సమయం వస్తుంది. నన్ను చూసి దూరంగా పారిపోయే టైమ్ వస్తుంది. అప్పుడు దూరంగా పారిపోలేక.. ఎటు వెళ్లాలే తెలీక ఇబ్బంది పడ్డావే అనుకో. వచ్చి నన్ను అడుగు నీకు దారి చూపిస్తా' అంటూ హెచ్చరిస్తుంది. దీంతో లాస్య చూద్దాం అంటూ వెళ్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  నందూను రెచ్చగొట్టే ప్లాన్ వేసిన లాస్య

  నందూను రెచ్చగొట్టే ప్లాన్ వేసిన లాస్య

  తులసి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ మందు తాగుతుంటాడు నందూ. ఆ సమయంలో లాస్య అతడి దగ్గరకు వచ్చి ‘ఎందుకు నందూ ఇలా తయారయ్యావు? నువ్వేమో ఇలా బాధ పడుతున్నావు. తులసి మాత్రం బిజినెస్ చేసుకుంటోంది. స్కూటీ కొనుక్కుని దాని మీద చక్కర్లు కొడుతుంది' అంటూ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 363: Tulasi Bought a Second Hand Scooty. After That She Went to Practice Drive. Then She Met an Accident and Injured. Thereafter Tulasi Lasya Fighted with Words.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X