For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 9th Episode: నందూకు మొదలైన శిక్ష.. సంతోషంలో మునిగిన లాస్య.. ఆమె ఎంట్రీతో!

  |

  ఎన్నో సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టుకు వచ్చిన తర్వాత తులసితో లాస్య గొడవకు దిగుతుంది. దీంతో ఆమెకు మోహన్, ప్రేమ్ సరైన సమాధానం ఇచ్చి బుద్ది చెబుతారు. ఇక, విచారణ సమయంలో తులసి తన బాధనంతా వెల్లగక్కుతుంది. అప్పుడు నందూ క్షణికావేశంలో ఆమెపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే జడ్జ్ వాళ్లిద్దరికీ విడాకులు మంజూరు చేస్తారు.

  నందూను కొట్టేందుకు యత్నించిన దీపక్

  నందూను కొట్టేందుకు యత్నించిన దీపక్

  విడాకులు తీసుకుని బయటకు వస్తున్న నందూను కొట్టేందుకు తులసి తమ్ముడు దీపక్ వెళతాడు. ‘ఇన్ని రోజులు మా అక్క కోసం నిన్ను ఏమీ చేయలేదురా. ఇప్పుడు తనకు నీకు ఏ సంబంధం లేదు. నిన్ను వదిలి పెట్టనురా. నీ అంతు తేలుస్తా' అంటూ కాలర్ పట్టుకుంటాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. చివరకు నందూ లాస్యతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  దీపక్‌తో తన ఇంటికి వెళ్లిపోయిన తులసి

  దీపక్‌తో తన ఇంటికి వెళ్లిపోయిన తులసి

  నందూను కొట్టేందుకు దీపక్ ప్రయత్నించిన తర్వాత తులసి అతడిని వారిస్తుంది. ‘ఆయనను ఏదైనా చేస్తే ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి?. నువ్వు జైలులో ఉంటే అమ్మను ఎలా చూస్తావ్' అంటూ అడగడంతో దీపిక్ నెమ్మదిస్తాడు. అప్పుడు ప్రేమ్ కూడా తన మామకు సపోర్ట్ చేసినా.. తులసి అందరినీ ఆపేస్తుంది. గొడవ పూర్తైన తర్వాత దీపక్ తన అక్కను ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు.

  శృతి, రాములమ్మ ఆందోళన.. మంచిగానే

  శృతి, రాములమ్మ ఆందోళన.. మంచిగానే

  కోర్టులో ఏ తీర్పు వచ్చిందో తెలియక ఇంటి దగ్గర ఉన్న శృతి, పని మనిషి రాములమ్మ తెగ హైరానా పడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రేమ్‌కు ఆమె పలుమార్లు ఫోన్ చేస్తుంది. కానీ, ఫలితం ఉండదు. ఆ తర్వాత అతడే కాల్‌ బ్యాక్ చేసి అక్కడ జరిగిన విషయాలను వివరిస్తాడు. అప్పుడు రాములమ్మ ‘తులసమ్మకి ఇదే సరైన మందు. విడాకులతో ఆమె బాధంతా తీరిపోతుంది' అని అంటుంది.

  నందూకు మొదలైన శిక్ష.. ఆమె వల్లేనని

  నందూకు మొదలైన శిక్ష.. ఆమె వల్లేనని

  ఆ తర్వాత రాములమ్మ మాట్లాడుతూ.. ‘తులసమ్మ లాంటి మంచి వాళ్లకు అన్యాయం చేస్తే కచ్చితంగా దేవుడి శిక్ష పడుతుందమ్మ. నందూ బాబుకు ఇప్పటికే ఆ శిక్ష మొదలై ఉంటుందని నా అభిప్రాయం. లాస్య రూపంలోనే ఆయనకు అపాయం ఉంది. అది ఎప్పటికైనా ఆయనకు శిక్షగా మారుతుంది' అని అంటుంది. ఆమె మాటలకు శృతి కూడా ఏకీభవిస్తూ మాట్లాడుతుంది.

  తులసి తల్లి ఆవేదన.. ధైర్యం చెప్పుకుంది

  తులసి తల్లి ఆవేదన.. ధైర్యం చెప్పుకుంది

  ఇంటికి చేరుకున్న తులసిని చూసి ఆమె తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. ‘30 ఏళ్ల క్రితం నందూను తీసుకొచ్చి.. అతడినే చేసుకుంటా అన్నావ్. అప్పుడు నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు. చివరకు నీకు అన్యాయం జరిగింది' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీంతో తులసి తన తల్లికి ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత దీపక్ కూడా ఆందోళన చెందొద్దని తల్లిని ఓదార్చుతాడు.

  Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
  లాస్య, నందూ సంతోషం... భాగ్య ఎంట్రీతో

  లాస్య, నందూ సంతోషం... భాగ్య ఎంట్రీతో

  విడాకులు వచ్చినందుకు అందరూ బాధ పడుతుంటే.. మరోపక్క నందూ, లాస్య మాత్రం సంబరాలు చేసుకుంటారు. ఒకరిని ఒకరు తిప్పుకుంటూ రొమాన్స్ చేస్తుంటారు. అంతలో భాగ్య కూడా అక్కడకు వస్తుంది. వీళ్ల సంతోషంలో భాగం అవుతుంది. అంతేకాదు, తులసి చేతకానిదని, విడాకులు తీసుకుని మంచి పని చేశారని నందూతో అంటుంది. దీంతో ముగ్గురూ ఆనంద పడుతుంటారు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 367: After Court Granted Divorce to Nandu and Tulasi.. Deepak Fired on his Brother In Law. He started Fight with Nandu in Front of his Sister.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X