For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 29th Episode: లాస్యపై తులసి ఉగ్రరూపం.. అందరి ముందే ఆమెకు షాకిచ్చిన నందూ

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి, ప్రేమ్‌ను విడగొట్టాలని అంకిత ప్లాన్ వేస్తుంది. అందుకు తగ్గట్లుగానే వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగేలా మాట్లాడుతుంది. ఇక, లాస్య తులసి తల్లిని టార్గెట్ చేసి ఫంక్షన్‌లో గొడవ చేయాలని చూస్తుంది. ఆ తర్వాత అందరూ రిసార్టుకు వెళ్తారు. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ నందూని తిడుతుంటారు. ఈ ఫంక్షన్ బాధ్యతను తులసి తీసుకుంటుంది.

   రిసార్టులో శృతి ప్రేమ్ మధ్య గిల్లికజ్జాలు

  రిసార్టులో శృతి ప్రేమ్ మధ్య గిల్లికజ్జాలు

  రిసార్టులో శృతి ప్రేమ్ మధ్య సరదా సంభాషణతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఇద్దరూ చాలా సేపు కొంటెగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కాసేపు గిల్లికజ్జాలు ఆడుకుంటారు. అంతలో ప్రేమ్ వెళ్లిపోతూ ‘దొంగ మొహందానా' అని అంటాడు. అప్పుడు శృతి అతడి మీదకు వస్తుంది. దీంతో కాసేపు రొమాంటిక్ ఫీల్ కలిగిస్తారు. ఆ తర్వాత ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు.

  తులసి మదర్‌ను అవమానించిన లాస్య

  తులసి మదర్‌ను అవమానించిన లాస్య

  రిసార్టులో భాగ్య కోసం వేచి చూస్తుంటుంది లాస్య. అంతలోనే ఆమె అక్కడకు చేరుకుంటుంది. అప్పుడు ఇద్దరూ కలిసి గొడవ ఎలా పెట్టాలని ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే తులసి తల్లి కారు దిగుతుంది. అప్పుడు ఇద్దరూ కలిసి ఆమెను సూటిపోటి మాటలు అంటూ అవమానిస్తారు. ‘పూజకు పనికిరాని పుష్పం' అని దారుణమైన మాటలు అని పెద్దావిడను బాధ పెడతారు.

  లాస్యపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన తులసి

  లాస్యపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన తులసి

  లాస్య అన్న మాటలన్నీ విన్న తులసి అక్కడకు ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే ఆమెపై ఒంటి కాలిపై లేస్తుంది. ‘మొగుడిని వదిలేసిన నువ్వు.. కొడుకును దూరం పెట్టిన నువ్వు మా అమ్మను అంటున్నావా. మాటలు జాగ్రత్తగా రానివ్వు. లేకపోతే పళ్లు రాలగొడతాను' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. అంతేకాదు, భాగ్యను కూడా తిడుతుంది. ఆ తర్వాత తల్లిని తీసుకుని వెళ్తుంది.

   నందూ ముందే లాస్య వంకర మాటలు

  నందూ ముందే లాస్య వంకర మాటలు

  అత్తగారిని చూసిన నందూ నవ్వుకుంటూ ఎదురొచ్చి స్వాగతం పలకగా ఆమె దెప్పిపొడుస్తుంది. తర్వాత లాస్యను పిలిచి రూమ్ ఇమ్మనగా.. ‘ఈవిడ వస్తారని తెలీదు కదా. రూమ్ తీసుకోలేదు. మన రూమ్ ఇద్దామంటే అందులో విలువైన వస్తువులు ఉన్నాయి. అంటే ఇవి ఆమె దొంగిలిస్తారని కాదు' అంటూ వంకర మాటలు మాట్లాడింది. దీంతో లాస్యను వెళ్లిపో అంటూ షాకిస్తాడు నందూ.

  అంకితపై అభి ఫైర్.. సారీ చెప్పి కవరింగ్

  అంకితపై అభి ఫైర్.. సారీ చెప్పి కవరింగ్

  బయట నిల్చుని ఉన్న అభి దగ్గరకు కోపంగా వచ్చిన అంకిత.. ‘తులసి ఆంటీ వాళ్ల అమ్మగారు ఇక్కడకు ఎందుకు వచ్చారు? అసలు మన ఫంక్షన్‌కు ఆమె ఎందుకు రావాలి' అని ప్రశ్నిస్తుంది. దీనికి అభి కోప్పడతాడు. ‘మన ఇంట్లో ఫంక్షన్‌కు మా అమ్మమ్మ రావడం తప్పంటావేంటి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆమె మాట మార్చేస్తుంది. దీంతో అభి అంకితకు సారీ చెబుతాడు.

   అన్నయ్యకు బట్టలు తెచ్చిన తులిసి తల్లి

  అన్నయ్యకు బట్టలు తెచ్చిన తులిసి తల్లి

  పెళ్లిరోజు ఫంక్షన్‌కు వచ్చిన తులసి తల్లి.. పుట్టింటి తరపు నుంచి పట్టుబట్టలు తీసుకుని వస్తుంది. కానీ, అవి ఇస్తే తీసుకుంటారో లేదో అని ఆలోచిస్తుంది. అప్పుడు తులసి బట్టలను అమ్మను తీసుకుని అత్తామామ దగ్గరకు వెళ్తుంది. వాటిని తీసుకోడానికి తులసి మామగారు ఒప్పుకున్నా.. అనసూయ మాత్రం అంగీకరించదు. దీంతో ఆమె బాధ పడిపోతుంది. ఇక, ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 358: Lasya and Bhagya Criticised Tulasi's Mother. Then Tulasi Came and Fire On Lasya and Bhagya. After That Anasuya Did Not to Take Tulasi Mother Cloths.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X