Intinti Gruhalakshmi May 26th Episode: తులసి సంచలన నిర్ణయం.. ఊహించని పని చేసి షాకిచ్చిన నందూ
తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నంచి ఊహించని రీతిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
స్పైసీ అందాలతో కవ్విస్తున్న అనిషా విక్టర్

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో అభి తన భార్య అంకితతో గొడవ పడతాడు. ఈ క్రమంలోనే అత్తింట్లో అవమానం తర్వాత తన పట్ల తల్లి తులసి చూపించిన ప్రేమను గుర్తు చేసుకుని బాధ పడుతుంటాడు. మరోవైపు, లాస్య, నందూ కలిసి తులసిపై కారాలు మిరియాలు నూరుతుంటారు. అప్పుడే ఆమె ముందే ఇల్లు అద్దెకు తీసుకుని ఉందామని లాస్య.. నందూకి సలహా ఇస్తుంది.

తులసిపై అత్తగారిని రెచ్చగొట్టిన భాగ్య
మంగళవారం ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగింది. ఇక, బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ఆరంభంలో అభి బాధ పడడాన్ని చూపించారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నందూ వెళ్లిపోయిన విషయంపై భాగ్య.. అత్తగారు అనసూయ మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడు తులసిపై వీళ్లిద్దరూ కారాలు మిరియాలు నూరుతారు. అదే సమయంలో భాగ్య.. అత్తగారిని బాగా రెచ్చగొడుతుంది.

భాగ్యకు తులిసి అదిరిపోయే వార్నింగ్
అత్తగారితో సంభాషణలు పూర్తయిన వెంటనే భాగ్య.. తులిసి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆమెను మనోవేదనకు గురి చేసేలా గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది. అప్పుడు తులిసి స్పందిస్తూ.. 'భాగ్య.. నా కాపురం గురించి నువ్వు బాధ పడాల్సిన పనిలేదు. ముందు నీకూ ఓ కుటుంబం ఉంది. దాన్ని చక్కగా చూసుకో. ఎదుటి వాళ్ల విషయాల్లో తలదూర్చితే బాగోదు' అని వార్నింగ్ ఇచ్చింది.

తులసి సంచలన నిర్ణయం.. పర్మీషన్
ఇంట్లో గొడవలు జరగుతుండడం.. భర్త బయటకు వెళ్లిపోవడం వంటి వాటితో తులసి బాగా డిస్టర్బ్ అయింది. ఈ నేపథ్యంలో తన పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరోసారి ఉద్యోగంలో చేరాలని సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయాన్ని మామగారికి చెప్పడంతో.. ఆయన కూడా సంతోష పడతాడు. అదే సమయంలో నీకు నా సపోర్ట్ ఉంటుందంటూ పర్మీషన్ ఇస్తాడు.

ఎంటర్ అయిన శృతి.. తులసికి అండ
అత్తగారి ఆరోగ్యం బాగోకపోవడంతో ఇంటికి వెళ్లిపోయిన శృతి.. మరోసారి తులసి దగ్గరకు వస్తుంది. ఈ క్రమంలోనే ఇల్లు అంతా బోసిపోయిందని.. ఇలా ఎప్పుడూ లేదని అంటుంది. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి జరిగిన గొడవల గురించి తెలుసుకున్నానని చెబుతుంది. ఆ సమయంలో శృతి.. తులిసికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇద్దరూ కాసేపు మంచి చెడు మాట్లాడతారు.

తులసిలో మార్పును చూసి శృతి షాక్
శృతి ఇంట్లోకి వచ్చి తులసితో మాట్లాడుతున్న సమయంలోనే అనసూయ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు వాళ్లిద్దరిపై సూటిపోటి మాటలు అంటుంది. సరిగ్గా అప్పుడే తులసి ఆమెపై తీవ్ర స్థాయిలో మండి పడుతుంది. 'శృతి నా మనిషి.. ఆమెను ఏమైనా అంటే అస్సలు బాగోదు' అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత తులసిలో వచ్చిన మార్పుల గురించి పని మనిషి రాములమ్మతో శృతి చర్చిస్తుంది.
Recommended Video

అన్నంత పని చేసేసిన నందూ.. లాస్య
గత ఎపిసోడ్‌లో తులసి ఇంటి ముందే అద్దెకు దిగాలని లాస్య.. నందూ అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో అన్నంత పని చేసేశారు. వాళ్లు కారు నుంచి లగేజ్ దించుతున్న విషయాన్ని పని మనిషి రాములమ్మ చూసి.. తులిసికి చెబుతుంది. అప్పుడామె ఇంటి ముందుకు వచ్చి.. వాళ్లిద్దరిని చూస్తుంది. దీంతో బుధవారం ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











