For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 1st Episode: తులసి వల్లే నందూ కంపెనీ దివాళా.. నిజం చెప్పిన అక్షర

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతిని ప్రేమ్ ప్రేమిస్తున్న విషయాన్ని తెలుసుకున్న తులసి, మాధవి, మోహన్‌లు ఆమెకు ప్రపోజ్ చేయమని పంపుతారు. ఆ విషయాన్ని అంకిత.. లాస్యకు చెప్పగా.. ఆమె వాళ్లను విడగొట్టేందుకు ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత కంపెనీలోని ఉద్యోగులను నందూ తిడతాడు. దీంతో వాళ్లంతా జీతాలు ఇవ్వకపోగా తిడతారా అంటూ ఎదురు తిరుగుతారు. అప్పుడు లాస్య వాళ్లను వెళ్లిపోమని అనగా.. ఉద్యోగులంతా వెళ్లిపోతారు. దీంతో లాస్య, నందూ మధ్య వార్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రేమ్‌ను ప్రేమిస్తున్నానంటూ ఓ అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది.

  Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!

   ప్రేమ్‌ను అక్షర ప్రేమించింది అక్కడేనంట

  ప్రేమ్‌ను అక్షర ప్రేమించింది అక్కడేనంట

  ప్రేమ్‌ను ప్రేమిస్తున్నానంటూ ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్ అక్షర మాటలతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అతడి రూపాన్ని గీస్తూ.. ఫ్రెండ్ బర్త్ డే ఈవెంట్‌లో పాట పాడిన నిన్ను తొలి చూపులోనే ప్రేమించా. అప్పటి నుంచి నీ ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నా. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటా నా మెడలో మూడు ముళ్లు వేయించుకుంటా. వీడ్ని ఒక్కసారి చూస్తేనే ప్రేమలో పడిపోయా.. జీవితాంతం నాతో ఉంటే లైఫ్ ఎంత బావుంటుందో అనుకుంటూ.. నా బర్త్ డే గిఫ్ట్‌గా మా ఫాదర్‌ని ప్రేమ్ కావాలని అడుగుతా' అని అనుకుంటుంది అక్షర.

  ప్రేమ్, శృతి విషయంలో తులసి ఆరాటం

  ప్రేమ్, శృతి విషయంలో తులసి ఆరాటం

  చాలా రోజుల తర్వాత శృతి ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడామెను చూసిన తులసి ప్రేమ్ ప్రపోజ్ చేసేసే ఉంటాడని అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే ఆమెను ‘ప్రేమ్ ఏమైనా చెప్పాడా' అని అడుగుతుంది. అప్పుడు శృతి ‘ఏ విషయం గురించి ఆంటీ? నాకు ఏం చెప్పలేదు' అని బదులిస్తుంది. ఇంతలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రేమ్.. వెనుక నుంచి ఏమీ చెప్పలేదని తన తల్లికి సైగల ద్వారా చేస్తాడు. అప్పుడు శృతి ‘అంత ముఖ్యమైన విషయం ఏంటో మీరైనా చెప్పండి ఆంటీ' అని అడుగుతుంది. దీనికి తులసి అది ప్రేమ్ చెప్తేనే బావుంటుందని అంటుంది.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!

  ప్రేమ్‌కు ప్రేమపై సలహా ఇచ్చిన తులసి

  ప్రేమ్‌కు ప్రేమపై సలహా ఇచ్చిన తులసి

  తులసి.. శృతిని అడగడం చూసిన ప్రేమ్.. తనకు ఇంకా ప్రేమను వ్యక్త పరచలేదని చెబుతాడు. అప్పుడు తులసి ‘ఆలస్యం చేయకురా.. ఏ విషయంలోనైనా ఆలస్యం చేయొచ్చు కానీ.. ఈ విషయం మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు. సమయం తీసుకునే కొద్దీ సమస్యగా మారొచ్చు. నీ ప్రేమ నిజం అయినప్పుడు అది ఎప్పుడూ దూరం అవ్వదు. అయినా నీకు నో చెప్తుందని ఎందుకు అనుకుంటున్నావ్? అవునని అంటుందేమో ఎవరికి తెలుసు. నువ్ ప్రేమిస్తున్నావని చెప్తావని శ్రుతి ఎదురుచూస్తుందేమో ఎవరికి తెలుసు.. అందుకే వెళ్లి ధైర్యంగా చెప్పు' అని సలహా ఇస్తుంది.

  శపించడం వల్లే నాశనం అయిందంటూ

  శపించడం వల్లే నాశనం అయిందంటూ

  ఆఫీస్‌లో పరిస్థితులు చేయి దాటి పోతుండడంతో నందూ కోపంగా ఇంటికి వస్తాడు. ఆ సమయంలో నాన్న నాన్న అని అరుస్తూ తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తాడు. అప్పుడు ‘నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎందుకూ పనికి రాని చిత్తు కాగితం అయిపోయింది. ఆఫీస్ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. తులసిని వదిలేస్తే నాశనం అయిపోతా అని కన్న తండ్రే నన్ను శపించాడు కదా. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచంలో ఏ తండ్రీ కోరుకోని గొప్ప కోరిక కోరుకున్నారు. ఆ దేవుడు కూడా తదాస్తు అనేశారు. ఎదగాలనుకుంటే రోడ్డు మీదికి వచ్చేశా' అంటూ ఫైర్ అవుతాడు.

  తెలుగు నటి హరి తేజ పర్సనల్ ఫొటోలు: తల్లైనా తర్వాత బోల్డుగా కనిపించిన భామ

  అమ్మకు సలహా ఇచ్చారు.. ఏమైంది?

  అమ్మకు సలహా ఇచ్చారు.. ఏమైంది?

  పరందామయ్యను నందూ అలా అంటుండగా ప్రేమ్ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అంతేకాదు, ‘ఇందులో తాతయ్య చేసిన తప్పు ఏంటి నాన్న? కంపెనీని నడపడం మాటలు కాదని అమ్మకి సలహాలు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది? అమ్మని మీరు ఎన్ని మాటలు అన్నారు? ఎంత చులకనగా చూశారు? చదువుకున్న వీళ్లకే కంపెనీలు నడపడం వచ్చట. ఇప్పుడేమైంది? మీకే కంపెనీని నడపడం చేతకాలేదని ఒప్పుకోండి. ఇప్పటికైనా అర్థమైందా? ఈ లాస్యను నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో' అంటూ తండ్రిపై ఫైర్ అవుతాడు. దీంతో నందూ కేకులు కట్ చేసుకోండంటూ వెళ్లిపోతాడు.

  నందూకు కొండంత కష్టం.. గొడవలు

  నందూకు కొండంత కష్టం.. గొడవలు

  అసలు కంపెనీలో ఏం జరిగిందని అనసూయ లాస్యను అడుగుతుంది. అప్పుడామె ‘ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయని కారణంగా క్లయింట్‌కు పెనాల్టీ కట్టాలి. మీకు ఉన్న ఆస్తులన్నీ అమ్మినా ఆ పెనాల్టీ కట్టలేం. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిలైతే చేసిన అప్పుల్ని కూడా తీర్చలేం. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోయాం' అని చెప్తుంది. దీంతో ప్రేమ్ ‘అమ్మా మహాతల్లీ.. నువ్వు మా నాన్నను రోడ్డు మీదికి లాగేశావ్ అన్నమాట. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత. ఫలితం అనుభవించండి. మా అమ్మకి సలహాలు ఇవ్వడం కాదు.. ముందు మీ పని చేసుకోండి' అని కౌంటర్ ఇస్తాడు.

  గృహలక్ష్మి హీరోయిన్ కస్తూరి పర్సనల్ ఫొటోలు: సీరియల్‌లో అలా.. రియల్‌గా ఇలా.. లేటు వయసులో ఘాటు ఫోజులు

  ప్రేమ్‌పై వాళ్లంతా ఫైర్... ఆన్సర్ లేదు

  ప్రేమ్‌పై వాళ్లంతా ఫైర్... ఆన్సర్ లేదు

  నందూ ఎదుర్కొంటోన్న పరిస్థితిని దెప్పిపొడుస్తూ ప్రేమ్ మాట్లాడుతుంటాడు. అంతలో అక్కడే ఉన్న అనసూయ, అభి, అంకితలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వాళ్లు బాధలో ఉంటే ఇంకా ఇలా మాట్లాడి బాధ పెట్టొచ్చా అంటూ వాళ్లు ప్రేమ్‌ను అడుగుతారు. అప్పుడు అతడు ‘ఆరోజు అమ్మని అన్ని మాటలు అంటే మీ నోళ్లు తెరవలేదు. ఇప్పుడు న్యాయం, పాపం అంటున్నారు. వాళ్లు మా అమ్మకి చెప్తే నీతులు.. అవే మాటలను తిరిగి వీళ్లకి చెప్తే నిష్ఠూరాలా? ఏది ఏమైనా నాన్న కంపెనీ ఈరోజు దివాళా తీయడానికి కారణం మాత్రం లాస్యనే' అని బదులిస్తాడు.

  ఆమె ముందు ప్రేమను తెలిపిన శృతి

  ఆమె ముందు ప్రేమను తెలిపిన శృతి

  ఇంట్లో గొడవ తర్వాత శృతి కోసం ఆమె స్నేహితురాలు వందన తులసి ఇంటికి వస్తుంది. వచ్చీ రావడమే ఆమె ‘నీకు ఇక్కడ ఎలా ఉంది.. కంఫర్ట్‌గానే ఉంది కదా' అని అడుగుతుంది. అంతేకాదు, ఇంతకీ నీ ప్రేమ విషయం ప్రేమ్‌కి చెప్పావా లేదా? అని ప్రశ్నిస్తుంది. దీనికి శృతి ‘నేను ఇక్కడికి దిక్కులేని అనాధలా వచ్చాను. ఈ టైంలో ప్రేమ్‌కి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలి? పైగా అంకుల్‌కి కూడా నేనంటే ఇష్టం లేదు. ఇలాంటి టైంలో ప్రేమ్‌లో ప్రేమ, పెళ్లి అంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో. అయినా ప్రేమ్ నన్ను ప్రేమిస్తే ఇంతవరకూ చెప్పకుండా ఎందుకుంటాడు' అని అంటుంది.

  తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన సినిమాలు ఇవే: మహేశ్, బన్నీ రికార్డు.. పవన్‌కు దక్కని చోటు

  Real Secret Behind Sudheer Babu Six Pack
  నందూకు తులసి విలువైన సలహాలు

  నందూకు తులసి విలువైన సలహాలు

  కంపెనీలో ఎదురైన సమస్యలతో బాధలో ఉన్న నందు దగ్గరకు వచ్చిన తులసి అతడితో మాట్లాడాలనుకుంటుంది. అప్పుడు ‘ఏం మాట్లాడాలి? అంతా మీరు కోరుకున్నట్టే జరిగింది కదా.. నా దుస్థితిని చూసి హేళన చేయడానికి వచ్చావా? ప్రేమ్ నన్ను చేతగాని వాడిలా చూస్తున్నాడు చూశావా' అని అడుగుతాడు నందు. అప్పుడు తులసి ‘ఆఫీస్‌లో టెన్షన్స్‌ ఇంట్లో చూపించకండి. దీంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అలాగే దివ్య చదువు డిస్టర్బ్ అవుతుంది. మిగిలిన వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు' అని సలహా ఇస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 413: Akshara Plan to Marry Prem. Then Tulasi Motivate Prem for Express his Love. After That Nandhu Blames His Father on Company Situation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X