Siri Hanmanth బాయ్‌ఫ్రెండ్ బిగ్‌బాస్ ఓటీటీలోకి.. బ్రేకప్ తర్వాత బంపర్ ఆఫర్!
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ముగిసిన నేపథ్యంలో అభిమానుల కోసం ఓటీటీ (ఓవర్ ది టాప్)లో రియాలిటీ షోను నిర్వాహకులు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి ఓటీటీలో బిగ్‌బాస్ షోను ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కోసం కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. ఈ క్రమంలో వివాదాస్పద వ్యక్తులు, వార్తల్లోకి దూసుకొచ్చిన ప్రముఖులు, సాధారణ వ్యక్తులను ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఎవరీ శ్రీహాన్? బిగ్‌బాస్ నిర్వాహకులు ఆయన పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకొన్నారనే విషయాల్లోకి వెళితే..

బిగ్‌బాస్లో సిరి హన్మంతు రచ్చ
బిగ్‌బాస్ తెలుగు 5లో టాప్ ఐదుగురు కంటెస్టెంట్లలో ఒకరైన సిరి హన్మంతు చేసిన రచ్చ, రొమాన్స్ గురించి బిగ్‌బాస్ అభిమానులకు తెలియజెప్పనక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లిన తర్వాత సిరి హన్మంతు వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి. అప్పటికే శ్రీహాన్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్న సిరి లైఫ్ అనేక ఆటుపోట్లకు గురైంది.

షన్ను, సిరి కెమిస్ట్రీ
బిగ్‌బాస్ తెలుగు 5 షోలోకి వెళ్లిన తర్వాత తనతో కలిసి నటించిన షణ్ముఖ్ జస్వంత్ అనే యూట్యూబర్‌కు క్లోజ్ అయింది. వారిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ అంతకంటే ఎక్కువ అనే విధంగా ప్రొజెక్ట్ అయింది. రోజులు గడిచిన కొద్ది షన్ను, సిరి మధ్య రిలేషన్‌షిప్ బలంగా మారిపోయింది. వారిద్దరూ ఒకే బెడ్‌పై పడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ప్రేక్షకులకే కాదు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా మారింది.

షన్నుతో రిలేషన్‌పై సిరి తల్లి
బిగ్‌బాస్ ఇంటిలోకి కుటుంబ సభ్యులు వెళ్లిన క్రమంలో సిరి చేస్తున్న వ్యవహారంపై ఆమె తల్లి ఘాటుగానే స్పందించింది. ముద్దులు పెట్టుకోవడం ఏమిటి? అంటూ షణ్ముక్‌ను నిలదీసింది. అప్పటి నుంచి ఏదో అభ్యంతరకరంగా తమ రిలేషన్ మారిందనే విషయం వారికి అర్ధమైంది. కానీ ముద్దులు గోల మాత్రం ఆపడం వారికి సాధ్య పడలేదు. ఆ క్రమంలో బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన తన ప్రియుడు శ్రీహాన్‌కు సిరి ముఖం చూపించుకోలేకపోయింది.

పీకల్లోతు రొమాన్స్‌లో సిరి, షన్ను
బిగ్‌బాస్ ఇంటిలో షణ్ముక్‌తో పీకల్లోతు రిలేషన్‌షిప్‌లో మునిగిపోయిన సిరి హన్మంతు తన ప్రియుడి శ్రీహాన్‌కు బ్రేకప్ చెప్పింది. అలాగే షణ్ముక్‌కు కూడా తన ప్రియురాలు దీప్తి సునైనా తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇలాంటి సమయంలోనే సిరి హన్మంతు మాజీ ప్రియుడు శ్రీహాన్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలోకి శ్రీహాన్
ప్రస్తుతం శ్రీహాన్ నుంచి బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే సంప్రదింపులు జరిపిన బిగ్‌బాస్ టీమ్ త్వరలోనే శ్రీహన్‌ను బెంచ్‌పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. శ్రీహన్ తెలుగు బిగ్‌బాస్ ఓటీటీలోకి వస్తే.. షోకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలోకి శ్రీహన్ వస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











