బిగ్ బాస్ సీక్రెట్ ప్లాన్ రివీల్: కుట్ర అప్పుడే జరిగిందా.. ఆ ప్రాసెసే దివి కొంప ముంచింది.!

By Manoj

తెలుగులో బిగ్ బాస్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆ షో అందుకున్న మైలురాళ్లు, క్రియేట్ చేసిన రికార్డులే దీనికి నిదర్శనం. ఇక్కడి వాళ్లకు కొత్తదే అయినా ఈ షోను ఇంతగా ఆదరించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటినే ప్రధానంగా చేసుకుని షోను రన్ చేస్తున్నారు నిర్వహకులు. అయితే, ఎలిమినేషన్ విషయంలో మాత్రం షోపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రేటింగ్ కోసం ప్రేక్షకుల ఓటింగ్‌ను పక్కనపెడుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దివి ఎలిమినేషన్ వెనుక భారీ కుట్ర ఉన్నట్లు ఓ న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

షాకింగ్‌గా ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్

షాకింగ్‌గా ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్

బిగ్ బాస్ షో ప్రకారం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కంటెస్టెంట్లు విజేతలుగా నిలుస్తారు. అంతకంటే ముందు వాళ్ల ఓట్ల ద్వారానే హౌస్‌లో కొనసాగుతూ ఉంటారు. అయితే, ఊహించని విధంగా మూడో వారంలో దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయింది. సరిగ్గా గత వారం కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న దివి షో నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు.

ఆ వెబ్‌సైట్లలో ఆమె పేరే చూపించింది

ఆ వెబ్‌సైట్లలో ఆమె పేరే చూపించింది

మిగిలిన కంటెస్టెంట్ల సంగతి పక్కనపెడితే... గత వారం నామినేషన్ ప్రక్రియలో ఆరియానా, అభిజీత్, మోనాల్ గజ్జర్, అవినాష్, నోయల్, దివి ఎలిమినేషన్‌ జోన్‌లోకి వచ్చారు. వీరిలో మోనాల్ మినహా మిగిలిన కంటెస్టెంట్లు అందరిపై ప్రేక్షకుల్లో ప్రేమ కనిపించింది. ఇదే ఓటింగ్‌ శైలిలోనూ స్పష్టమైంది. ప్రైవేటు వెబ్‌సైట్లు నిర్వహించే పోల్స్‌లో మోనాల్‌కే తక్కువ ఓట్లు వచ్చాయి.

బిగ్ బాస్ షో అంతా ప్లాన్ ప్రకారమేనా

బిగ్ బాస్ షో అంతా ప్లాన్ ప్రకారమేనా

దివి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ షో ప్లాన్ ప్రకారమే జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. మోనాల్ ఉంటే లవ్ ట్రాకులు చూపించి రేటింగ్ పెంచుకోవచ్చని షో నిర్వహకులు భావిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఆమెను హౌస్‌లో కొనసాగిస్తున్నారని కూడా అంటున్నారు. ఇదే విషయాన్ని మాజీ కంటెస్టెంట్లు సైతం పేర్కొన్న విషయం తెలిసిందే.

దివి విషయంలో కుట్ర అప్పుడే జరిగింది

దివి విషయంలో కుట్ర అప్పుడే జరిగింది

చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది దివి. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఇలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దివి ఎలిమినేషన్ వెనుక బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఉందని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఆ ప్రాసెసే దివి కొంప ముంచిందట..!

ఆ ప్రాసెసే దివి కొంప ముంచిందట..!

వాస్తవానికి ఎలిమినేషన్ ప్రాసెస్‌లోనే దివిని ప్లాన్ ప్రకారం నామినేట్ చేయించినట్లు ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అందులో జంటలుగా వచ్చిన కంటెస్టెంట్లు ఒకరిని నామినేట్ చేసి మరొకరు సేవ్ అయ్యారు. దీంతో సేవ్ అయిన కంటెస్టెంట్ ఫ్యాన్స్ నామినేట్ అయిన వాళ్లకు ఓట్లు వేశారు. దివిని మాత్రం ప్రత్యర్థిలా ఉన్న లాస్యతో కలపడంతో ఆమె ఫ్యాన్స్ ఓట్లు వేయలేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X