Don't Miss!
- News
ఎంపీ రఘురామ మిడిల్ డ్రాప్ - భీమవరం టూర్ : రైలెక్కారు - మధ్యలోనే..ఏం జరిగింది..!!
- Lifestyle
Today Rasi Phalalu : ఈరోజు ఏఏ రాశుల వారి జీవితాల్లో గ్రహాల శుభ స్థానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Jabardasth: జోర్డార్ సుజాతతో ప్రేమ.. మొత్తానికి తేల్చి చెప్పిన రాకింగ్ రాకేష్
బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. కొన్నేళ్ళ వరకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నాలు జరిపిన రాకేష్ మిమిక్రి ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. అలాగే ఈవెంట్స్ లో కూడా అతను కామెడీ స్కిట్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు. ఇక ఫైనల్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం అతని జీవితం మారిపోయింది. ఇక రీసెంట్ గా రాకేష్ బోర్డర్ సుజాతతో ఉన్న అనుబంధం గురించి కూడా ఎవరు ఊహించని విధంగా స్పందించడం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ టీమ్ నుంచి..
రాకింగ్ రాకేష్ అనగానే ఎక్కువగా చిన్న పిల్లలతో కలిసి విభిన్నమైన స్కిట్స్ తో ఆకట్టుకుంటాడు అని బలమైన ముద్ర ఏర్పడింది. అయితే అంతకుముందు అతను నటరాజ్ టీమ్ లో ఉండేవాడు. ఆయన వెళ్లిపోయిన అనంతరం ఇతర టీమ్ సభ్యులతో కలిసి స్కిట్స్ చేసుకుంటూ వచ్చాడు. కామెడీ చేయడమే కాకుండా అతని పంచ్ లు కూడా మంచి గుర్తింపు వచ్చేలా చేశాయి.

అనుభవం లేని కారణంగా
మొదట్లో రాకేష్ కు టీమ్ లీడర్ గా బాద్యతలు ఇవ్వడానికి జబర్దస్త్ మేనేజ్మెంట్ సందేహించింది. అతనికి ఎక్కువగా అనుభవం లేని కారణంగా హ్యాండిల్ చేయలేడు అని ఎవరు కూడా అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాకేష్ మాత్రం వారికి నమ్మకం కలిగే విధంగా చేసుకుంటూ వచ్చాడు. రెగ్యులర్ గా వెళ్ళకుండా ఎక్కువగా చిన్న పిల్లలతో హెల్తీ కామెడీతో సక్సెస్ అయ్యేలా చేసుకున్నాడు.

జబర్దస్త్ ద్వారా సొంత ఇల్లు
ఇక జబర్దస్త్ లో రాకేష్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాడు. దాదాపు లక్షకు పైగానే జబర్దస్త్ ద్వారా రెమ్యునరేషన్ అందుకుంటూ సొంతంగా ఇల్లు కట్టుకునే వరకు వచ్చాడు. అలాగే కొత్త వారికి కూడా అతను అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు అనే గుర్తింపు కూడా అందుకున్నాడు.

జోర్డార్ సుజాత ఎమోషనల్
అయితే ఎప్పుడైతే రాకేష్ టీమ్ లోకి జోర్డార్ సుజాత వచ్చిందో అప్పటి నుంచి వీరి కాంబినేషన్ కూడా సుధీర్, రష్మి తరహాలో బాగా వైరల్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో నదిస్తోంది అనేంతగా స్కిట్స్ కూడా కొనసాగాయి. ఆ మధ్య ఫాదర్స్ డే సందర్భంగా చేసిన స్పెషల్ ఈవెంట్ లో సుజాత ఏకంగా నరేష్ తో పెళ్లి చేయండి నాన్న అంటూ ఎమోషనల్ అవ్వడం ఆ షోలో హైలెట్ గా నిలిచింది.

సుజాతపై రాకేష్ అభిప్రాయం
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకింగ్ రాకేష్ వారి మధ్యలో ఉన్న అనుబంధం గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను ఎప్పుడు బాగుండాలని కోరుకునే వారిలో చాలా ముఖ్యమైన పర్సన్ సుజాత. ఆమె ఎప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ లో అలాగే ప్రొఫెషినల్ లైఫ్ లో కూడా సలహాలు ఇస్తుంటుందని రాకేష్ అన్నాడు.

నిజంగానే ప్రేమలో..
ఇక సుజాత తో నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్నకు రాకేష్ దాదాపుగా నిజమే అన్నట్లుగా సమాధానం ఇవ్వడం వైరల్ గా మారింది. ఒకరిని మనల్ని ఎన్నో రకాలుగా ఇష్టపడతారు. ఇక సుజాత నేను ఎప్పుడు బావుండాలని కోరుకునే వ్యక్తి.. ఇక ఆ బంధం అంతకంటే ముందు వరకు వెళ్లినా సంతోషమే అన్నట్లు రాకేష్ చెప్పడంతో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ విషయంలో జోర్డార్ సుజాత ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.