Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Jabardasth కమెడియన్ ధీన పరిస్థితి.. షో ద్వారా సంపాదించుకున్న డబ్బు పోయిందంటూ..
కామెడీ షో జబర్దస్త్ ద్వారా గుర్తింపును అందుకొని ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు అలాగే సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే జబర్దస్త్ లో కొంతమంది లేడీ గెటప్స్ ద్వారా కూడా మంచిగా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో వినోద్ కూడా ఉన్నాడు. వినోద్ చాలా కాలం పాటు జబర్దస్త్ లో కొనసాగుతూ వచ్చాడు. అయితే ఇటీవల అతను కొంత అనారోగ్యానికి గురి కావడంతో పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. అంతేకాకుండా కొంత ఆర్థికంగా కూడా మోసలు జరిగాయి అని కొంత డబ్బు కూడా పోగొట్టుకున్నారు అని వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అలా జబర్దస్త్ ప్రయాణం
మొదట జబర్దస్త్ లో ప్రతి గ్రూపులో కూడా చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన వినోద్ ఆ తర్వాత చమ్మక్ చంద్ర టీమ్ లో చేరి స్థిర పడిపోయాడు. వినోథ్ లేడి క్యారెక్టర్స్ చేసుకుంటూ చాలా కాలం పాటు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాలు అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ తన కెరీర్ ను కొనసాగించాడు.

లంగ్స్ ఇన్ఫెక్షన్
అయితే జబర్దస్త్ వినోద్ గత కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడడంతో అతను చాలా రోజులపాటు ట్రీట్మెంట్ కోసం తిరగాల్సి వచ్చింది. సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం అలాగే ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవడం వలన ఆరోగ్యం దెబ్బతింది అని అన్నాడు. అలాగే మరి లావుగా కాకూడదు అని సన్నగా ఉండాలి అని ఆలోచనతో కొంత ఫుడ్ కూడా తగ్గించడం ఎఫెక్ట్ చూపించింది.. అని చెప్పాడు.

20 లక్షల వరకు..
అయితే వినోద్ ప్రస్తుతం మాత్రం మెల్లగా కొలుకుంటు వస్తున్నాడు. ఇక రీసెంట్ గా తన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి కూడా వివరణ ఇచ్చాడు దాదాపు 20 లక్షల వరకు ఈ మధ్యకాలంలోనే పోగొట్టుకున్నాను అంటూ జబర్దస్త్ లో వచ్చిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వచ్చింది అని తన దీన పరిస్థితి గురించి తెలియజేశాడు.

ఇంటిని కొనుగోలు చేయాలని..
వినోద్ మాట్లాడుతూ.. ఎలాగైనా ఒక ఇంటిని కొనుగోలు చేయాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేశాను. ఇక ఫైనల్ గా ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకొని పది లక్షల వరకు ఇచ్చాను. అయితే లిఖితపూర్వకంగా 10 లక్షలు ఇవ్వగా నోటి మాట ద్వారా మూడు లక్షలు ఇచ్చాను. అయితే ఒక విషయంలో విభేదాలు రావడంతో అతను ఎంతగానో వేధించాడు.. అని వినోద్ చెప్పాడు.

మరొక వ్యక్తిని నమ్మి..
వెంటనే ఆ ఇంటి యజమాని నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేశాను. కానీ అతను డబ్బులు మాత్రం వెనక్కి ఇవ్వలేదు. పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు డబ్బులు అయితే ఇంకా రాలేదు. అలాగే ఒక వ్యక్తిని నమ్మి దాదాపు 3 లక్షల కోల్పోవాల్సి వచ్చింది. అతను మరొకరి దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మధ్యవర్తిగా ఉంచడంతో ఆ సమస్య వచ్చింది. అతను డబ్బులు ఇవ్వకపోవడం వలన నేను డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అని వినోద్ అన్నాడు.

చేతబడి చేసి ఉంటారేమో..
ఇక నా ఆరోగ్యం కూడా క్షిణించడంతో దానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం మరొక మూడు లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాగే ఎవరైనా చేతబడి చేసి ఉంటారేమో అని ఆలోచన కూడా వచ్చింది. దానివల్ల పూజలు హోమాలు అంటూ మరొక మూడు లక్షల వరకు ఆ విధంగా ఖర్చు చేశాను. ఈ విధంగా దాదాపు 20 లక్ష వరకు ఈ మధ్యకాలంలో కోల్పోయినట్లుగా తెలియజేశారు.