ఇంట్లో గొడవలు.. విడాకులు కావాలంటూ జబర్దస్త్ వేదికపై రాకింగ్ రాకేష్ - సుజాత

జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా, హీరోలుగా, స్టార్ కమెడియన్లుగా, స్టార్ యాంకర్లుగా సెటిల్ అయ్యారు. ఇప్పటి వరకు కామెడీ షోల్లో అత్యధిక కాలంగా కొనసాగుతున్న కామెడీ షో కేవలం జబర్దస్త్ మాత్రమే కావడం విశేషం. 12 ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కామెడీ కంటెంట్ ను అందిస్తూనే వస్తోంది.

ఇక ప్రతి వారం శుక్ర, శని వారాల్లో జబర్దస్త్ కామెడీ షో స్కిట్స్ ఈటీవీ చానెల్ లో ప్రసారం అవుతుండటం విశేషం. ప్రేక్షకుల ఈ కామెడీ షోను ఇప్పటికీ ఎంతగానో ఆదరిస్తున్నారు. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ షో నేటికీ కడుపుబ్బా నవ్విస్తోంది. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించిన తాజా ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో జబర్దస్త్ ఆర్టిస్ట్ లు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత చేసిన స్కిట్ ఆసక్తికరంగా మారింది. వారి నిజజీవితాన్ని స్కిట్ గా మార్చినట్టుగా కనిపించింది.

Jabardasth Comedy Show Latest Episode Promo

ప్రోమో ప్రకారం.. జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ స్టేజీ మీదకు హుషారుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకరితో ఒకరు చక్కగా నవ్వుతూ కలిసి మెలిసి ఉన్నట్టుగా కనిపించారు. ఆ తమ పెళ్లి రోజు ఏదైనా స్పెషల్ గా ఉండాలని అనుకుంటారు. ఈ సందర్భంగా ఒక సారి తమ వెడ్డింగ్ మెమోరీస్ ను నెమరు వేసుకుందామని సుజాత అంటుంది. అందుకు రాకేష్ సరేని అంటాడు. వెంటనే వారి రియల్ లైఫ్ లో జరిగిన పెళ్లి క్యాసెట్ ను ప్రదర్శిస్తారు. అందులో మాంగళ్యధారణ, అక్షింతలు, బిందెలో ఉంగరం వేసి వెతికే ఆటలు ఆడుతూ కనిపిస్తారు. అయితే ఆ వీడియో చూసిన తర్వాత సుజాత షాకింగ్ గా మాట్లాడుతుంది.

మీరు నా మెడలో తాళి కడుతూ ఉంటే నా మెడ బోసి పోయిందని మీ అమ్మ మెడలో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి నా మెడలో వేసిందని సుజాత అంటుంది. దాంతో రాకింగ్ రాకేష్ అందులో తప్పేమీ ఉందని అడుగుతాడు. అంటే మీ అమ్మ నాకు పైసల్ లేవ్, నేను ఎప్పుడూ బంగారం చూడలేదని అందరికీ చెప్పకనే చెప్పిందంటూ గొడవ పెట్టుకుంటుంది. ఇన్ని మాటలు అన్నాక నీతో నేను ఎందుకు సంసారం చేస్తానే అని రాకేష్ ఫైర్ అవుతాడు.

నాకు విడాకులు కావాలని రాకేష్ అంటాడు. నాకు కూడా విడాకులే కావాలని సుజాత కూడా అంటుంది. ఇద్దరు అస్సలు తగ్గరు. ఆ తర్వాత సింగర్ మనో జ్యోక్యం చేసుకొని వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 12న వచ్చే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక జబర్దస్త్ కామెడీ షోకు ప్రస్తుతం సింగర్ మనో, సీనియర్ నటి ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్లుగా రష్మీ గౌతమ్, మానస్ ఉన్నారు. రామ్ ప్రసాద్, రాఘవా, తదితరులు తమ స్కిట్లతో ఆకట్టుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X