For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: షోలోకి జబర్ధస్త్ లేడీ.. కమెడియన్‌తో లవ్ స్టోరీ.. ఆమెకు షాకింగ్ రెమ్యూనరేషన్!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సరికొత్త కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు మజాను అందిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్పందనను అందించారు. దీంతో దేశంలో ఏ షోకూ రానంత టీఆర్పీ రేటింగ్ దీనికి సొంతం అయింది. ఫలితంగా నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వచ్చారు.

  ఈ క్రమంలోనే తాజాగా (సెప్టెంబర్ 4వ తేదీ) బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మొదలెట్టారు. అంగరంగ వైభవంగా సాగుతోన్న ప్రీమియర్ ఎపిసోడ్‌లో జబర్ధస్త్ ఫేం ఫైమా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం పదండి!

  గతంలో వాటికి మించేలా ఆరో సీజన్

  గతంలో వాటికి మించేలా ఆరో సీజన్


  తెలుగులో ఇప్పటి వరకూ ఐదు సీజన్లు సూపర్ సక్సెస్‌గా రన్ అయ్యాయి. వాటిలో దేనికదే అన్నట్లుగా ప్రేక్షకాదరణను అందుకుని రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా తాజాగా మొదలైంది. గతంలో వాటికి మించేలా ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్, డ్రామా, ఎనర్జీతో పాటు ఎంతో కలర్‌ఫుల్‌ కంటెంట్‌ను చూపించబోతున్నారు.

  యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షో

  ఫుల్ జోష్‌తో మొదలైన బిగ్ బాస్ షో

  ఫుల్ జోష్‌తో మొదలైన బిగ్ బాస్ షో


  బిగ్ బాస్ ప్రియులు చాలా రోజులుగా వేచి చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్‌ను ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టేశారు కూడా.

  కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త వ్యూహం

  కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త వ్యూహం


  మిగిలిన భాషల కంటే తెలుగులోనే బిగ్ బాస్ షో భారీ సక్సెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా లేడీస్‌ను ఎక్కువగా తీసుకున్నారు.

  వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

  షోలో అడుగు పెట్టిన జబర్ధస్త్ భామ

  షోలో అడుగు పెట్టిన జబర్ధస్త్ భామ


  చాలా కాలంగా జబర్ధస్త్‌లో సందడి చేస్తూ ఎంతగానో గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి ఫైమా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ప్రీమియర్ ఎపిసోడ్‌లో తనదైన శైలిలో సందడి చేస్తూ స్టేజ్ మీద రచ్చ చేసేసింది. ఈ లేడీ కమెడియన్ రాకతో బిగ్ బాస్ ప్రియులు ఖుషీగా ఉన్నారు. అలాగే, ఈమెపై భారీ అంచనాలే ఉన్నాయి.

  ప్రవీణ్ లెటర్.. ఫైమా ఎమోషనల్

  ప్రవీణ్ లెటర్.. ఫైమా ఎమోషనల్


  ఫైమా స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే నాగార్జున ఆమె లవ్ స్టోరీ గురించి అడిగాడు. దీంతో ఆమె జబర్ధస్త్ కమెడియన్ ప్రవీణ్ తన బాయ్‌ఫ్రెండ్ అని చెప్పింది. ఆ తర్వాత అతడు పంపిన లెటర్‌ను ఫైమా చదివింది. అందులో మొదట కామెడీగా.. ఆ తర్వాత ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయింది. దీంతో నాగార్జున ఆమెను ఓదార్చాడు.

  Bigg Boss Telugu 6: హౌస్‌లోకి టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరీ అర్జున్? అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!

  ఫైమాకు భారీ రెమ్యూనరేషన్ అని

  ఫైమాకు భారీ రెమ్యూనరేషన్ అని


  'పటాస్' అనే షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతోన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ ఫైమాకు భారీ మొత్తం రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలిసింది. అందుకే జబర్ధస్త్‌ను వదిలేసి మరీ ఈమె ఇందులోకి ఎంట్రీ ఇచ్చిందని టాక్.

  English summary
  Bigg Boss Telugu 6th Season Premiere Episode Started Today. Now Famous Comedian Jabardasth Faima Entered into Bigg Boss House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X