Don't Miss!
- News
Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Bigg Boss Telugu 6: ఫైమాకు జాక్ పాట్ లాంటి రెమ్యునరేషన్.. మొత్తం ఎంత ఇచ్చారంటే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ గా మొదలైనప్పటికి కూడా షో కొనసాగుతున్న కొద్దీ కాస్త బోరింగ్ గా అనిపించింది. ముఖ్యంగా చివర దశలో ఊహించని టాస్క్ లతో ఆట మరింత నీరసంగా సాగుతోంది. ఇక 13వ వారంలో ఎవరు ఏలిమినెట్ అవుతారు అనే విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగింది. ఇక చివరికి ఫైమా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆమె 13 వారాలకు గాను ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ఆమె సేఫ్ కావడంతో..
బిగ్ బాస్ రేటింగ్స్ గత రెండు వారాలు నుంచి కూడా మళ్ళీ డౌన్ అయినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కోసారి ఒక్కో విధమైమ బెహేవియర్ తో గేమ్ ఆడుతున్నారు. ఇక గత రెండు వారాల పెర్ఫెమెన్స్ చూస్తే ఈ వారం కీర్తి ఏలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఊహించని విధంగా సేఫ్ అవుతోంది. కీర్తి సేఫ్ కావడంతో ఇప్పుడు ఫైమా ఎలిమినేట్ అవుతోంది.

ఫైమా చేసిన పొరపాట్లు
ఫైమా చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఆమెపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వారం ఆమె రోహిత్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెపై నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేసాయి. ఎందుకంటే రోహిత్ చేసిన పొరపాట్లు విషయంలో ఎందుకు ప్రశ్నించారు అని చాలా గట్టిగానే అందరిని అడిగింది. ఒక విధంగా ఆమె మాట్లాడింది కొన్ని విషయాల్లో కరెక్ట్ అయినప్పటికీ కూడా మరికొన్ని విషయాల్లో తొందరపడినట్లు కూడా అనిపించింది. ఏదేమైనా కూడా ఈ వారం రోహిత్ ను తిట్టడం వలన ఫైమా ఓ వర్గం జనాల నుంచి ఓట్లు మాత్రం దక్కలేదు అని చెప్పవచ్చు.

ఆ విషయంలో న్యాయం చేసిన ఫైమా
అసలు బిగ్ బాస్ లో ఫైమా ఇన్ని వారాలు కొనసాగుతుంది అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆమె ఐదు వారాలకే వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఫైమా చాలా వరకు టాస్క్ లో బలంగా పోరాడింది. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా తనవైపు నుంచి ఆమె న్యాయం చేసింది. ముఖ్యంగా హౌస్ లో ఉన్న అబ్బాయిలందరితోను ఆమె చాలా సరదాగా ఉంటూ కామెడీ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేసింది.

ఒక్క వారానికి ఎంతంటే..
ఇక ఫైమాకు బిగ్ బాస్ ద్వారా మంచి ఆదాయం అందింది అని చెప్పవచ్చు. ఆమె గత సీజన్లోనే బిగ్ బాస్ అవకాశం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. ఇక ఈసారి ఆమెకు అవకాశం రావడంతో 13 వారాల వరకు కొనసాగింది. ఇక ఇన్ని రోజులు ఉన్నందుకు ఆమెకు రెమ్యునరేషన్ కూడా బాగానే అందినట్లు తెలుస్తోంది. వారానికి ఫైమా కు బిగ్ బాస్ నుంచి 25వేల రూపాయలు అందుతున్నట్లు సమాచారం.

మొత్తం రెమ్యునరేషన్
ఇక మొత్తంగా 13 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది కాబట్టి మొత్తంగా ఇప్పటివరకు ఆమెకు 3 లక్షల 25 వేల రూపాయలు దక్కినట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా ఇది ఆమెకు మంచి రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రియాలిటీ షోలు చేసినప్పుడు ఆమెకు ఎప్పుడు కూడా ఈ రేంజ్ లో అయితే రెమ్యూనరేషన్ వచ్చింది లేదు. ఇక ఇప్పుడు కెరీర్ మొత్తంలో ఆమెకు ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఫైమా తదుపరి కెరీర్ ను ఎలా సెట్ చేసుకుంటుందో చూడాలి.