Don't Miss!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- News
జోగినిపల్లి సంతోష్ సహకారంతో ‘కిలిమంజారో’ను అధిరోహించిన బానోతు వెన్నెల
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Lifestyle
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ను బకరా చేసిన జోర్దార్ సుజాత.. ఇంటికి పిలిచి అలాంటి షాక్
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన జోర్దార్ సుజాత జీవితం బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో తర్వాత అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా సుజాతకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అయితే బిగ్‌బాస్ తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ విషయాన్ని ప్రేక్షకులకు చూపించడానికి జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే..

సూపర్ సుజాత పేరుతో
బిగ్‌బాస్ తెలుగు 4 తర్వాత జోర్దార్ సుజాత్ కెరీర్ మరింత మెరుగ్గా ఉంది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్‌తో ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు. అంతేకాకుండా ఇటీవల Super Sujatha అనే య్యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించారు.

చంటబ్బాయ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్
ఇక తన మిత్రుడు రాకింగ్ రాకేష్ కూడా ఇటీవల చంటబ్బాయ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. తన ఛానెల్ కోసం జోర్దార్ సుజాత ఇంటిని కవర్ చేయడానికి అనుమతి తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. తన ఇంటిలోకి వచ్చిన రాకేష్‌ను సాదరంగా ఆహ్వానించారు.

జోర్దార్ సుజాత హోం టూర్
అయితే విలాసవంతమైన ఇంటిలోకి రాకింగ్ రాకేష్‌ను ఇంటిలోకి పిలిచి ఒక్కో గదిని పరిచయం చేస్తూ లోనికి తీసుకెళ్లారు. ప్రతీ గదిలో పూలతో అలంకరించిన గది గురించిన ప్రత్యేకతను తెలియజేస్తూ ఇంటిలోకి వెళ్లారు. తనకు బిగ్‌బాస్‌లో వచ్చిన బహుమతులను, అలాగే బిగ్‌బాస్ ఉత్సవం గురించిన ట్రోఫిలను చూపించింది.

వరంగల్ జిల్లా వాసులు కావడంతో
ఇక ఇద్దరు కూడా వరంగల్ జిల్లాకు చెందిన వారు కావడంతో తమ ఊర్ల గురించి కులాసాగా కబుర్లు చెప్పుకొన్నారు. అలాగే జోర్దార్ సుజాత ఇంటి వాళ్ల గురించి రాకేష్ తన అభిప్రాయాలను, అలాగే సుజాత తల్లి గురించి రాకేష్ తనలో ఉండే ఎమోషన్స్ బయటపెట్టారు.

ప్రాంక్‌తో ఆటపట్టించిన సుజాత
ఇదిలా ఉండగా, హోం టూర్ మొత్తం పూర్తయిన తర్వాత రాకింంగ్ రాకేష్‌ను బకరా చేసింది. ఇక ఫోటోలు, ప్రైజెస్ అన్ని పట్టుకొని బయటకు వెళ్దామని అనగానే రాకేష్ కంగు తిన్నాడు. ఏమిటీ ఇది నీ ఇల్లు కాదా? అంటూ షాక్ అయ్యాడు. అవును..ఇది నాకు తెలిసిన వారి ఇల్లు.. ప్రతీసారి హోమ్ టూర్ అంటూ అడుగుతుంటే నేను పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను అంటూ జోర్దార్ సుజాత అసలు విషయం చెప్పారు.