‘జబర్దస్త్ నిజ స్వరూపం ఇదే.. రోజాపై ఇప్పటికీ అదే అభిప్రాయం’
బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు హైపర్ ఆది. ఆయన జబర్దస్త్ కామెడీ షో ద్వారా టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన టాలెంట్ కు తోడు సరైన అవకాశం దక్కడంతో రాకెట్ వేగంతో ఇండస్ట్రీలో దుమ్ములేపాడు. ప్రస్తుతం వెండితెరపై, బుల్లితెరపై సినిమాలు, టీవీ సోలతో అలరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల తనకు లైఫ్ ను ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోలో స్పెషల్ ఎపిసోడ్ ను చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్ షో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ కామెడీ షో ఇప్పటి వరకు 12 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. దశాబ్దానికి పైగా టీవీ ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించిన ఈ షో ఇప్పటికీ నిర్విరామంగా ప్రేక్షకులకు ఫన్ ను అందిస్తోంది. నిర్విరామంగా కామెడీని పంచుతూనే ఉంది. ఈ క్రమంలో జబర్దస్త్ లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు ఉత్సవాలను నిర్వహించారు. ఈ క్రమంలో జబర్దస్త్ కామెడీ షోను ప్రారంభించిన సమయంలో టీమ్ లీడర్లుగా ఉన్న కమెడియన్స్ ను రీయూనైట్ చేశారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల వేడుకలకు వారందరూ హాజరయ్యారు.

సెలబ్రేషన్స్ కు చమ్మక్ చంద్ర, రాఘవ, వేణు ఎల్దండి, అదిరే అభి, ధన్ రాజ్, చలాకీ చంటి వంటి కమెడియన్స్ ను మళ్లీ రీయూనియన్ చేశారు. ఈ సందర్భంగా 12 ఏళ్లుగా తమకు జబర్దస్త్ కామెడీ షోతో తమకు ఉన్న ఫీలింగ్ ను, మెమోరీస్ ను గుర్తుకు చేసుకున్నారు. తమ టీమ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇదే సమయంలో హైపర్ ఆది నాగబాబు జబర్దస్త్ రీఎంట్రీ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. నాగబాబు రీఎంట్రీ ఇచ్చిన సమయంలో టీమ్ లీడర్లు అందరూ వణికిపోయారని చెప్పారు.
అయితే, నాగబాబు వస్తున్నారనగానే టీమ్ లీడర్లు అందరూ తమ టీమ్ సభ్యులతో సీరియస్ గా స్కిట్స్ రాస్తూ కనిపించారని, మరోవైపు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ వహించి కనిపించారని హైపర్ ఆది చెప్పారు. అసలు 12 ఏళ్ల కింద మేం చూసింది ఇప్పుడు మళ్లీ కనిపించిందని, అసలు జబర్దస్త్ స్వరూపం ఇదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మీ రీఎంట్రీ వరకు ఉన్న సంగతి వేరు, ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిలా మారిపోందని చెప్పడం చర్చగా మారింది.
అలాగే హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షోకు ఫీమేల్ జడ్జీగా వ్యవహరించిన రోజా పైనా కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. రోజాపై మాకు ఎప్పటికీ ఒకేలాంటి అభిమానం, ప్రేమ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏదో ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె మాటలకూ పెద్దగా హార్ట్ అవ్వలేదని చెప్పారు. ఎప్పటికీ తమ అభిమానం నాగబాబు, రోజాపై ఉంటుందని హైపర్ ఆది చెప్పడం విశేషం. ఇక ఈ షోకు ప్రస్తుతం జడ్జీలుగా ఇంద్రజ, ఖుష్బూ, నాగబాబులు వ్యవహరిస్తున్నారు. రష్మీ గౌతమ్, మానస్ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











