Don't Miss!
- News
ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు - ఈ సారి నేరుగా...!?
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Finance
Google: ఉద్యోగుల తొలగింపు తర్వాత గూగుల్ మరో అడుగు.. ఏంటిది సుందర్ పిచాయ్..!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
జబర్దస్త్ వదిలేసి.. హోటల్‌లో వంటవాడిగా మారిన కిర్రాక్ ఆర్పీ.. ఎంత సంపాదిస్తున్నాడంటే..
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపుని అందుకొని ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్న కమెడియన్స్ లలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. అతను కేవలం కమెడియన్ గానే కాకుండా ఇండస్ట్రీలో దర్శకుడిగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ రూట్లో మాత్రం అతనికి సరైన సక్సెస్ రాలేదు. ఇక తర్వాత కొన్ని ఇంటర్వ్యూ లలో అతను జబర్దస్త్ పై విమర్శలు చేయడంతో కొన్ని రోజులు మీడియాలో హాట్ టాపిక్ అని నిలిచాడు. అయితే ఇప్పుడు అతను ఏకంగా ఒక హోటల్లో పనివాడిగా కనిపిస్తూ బిజినెస్ కూడా మొదలు పెట్టడం మరింత వైరల్ అవుతుంది. ఇక అతని సంపాదన గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాలలో లోకి వెళితే..

జబర్దస్త్ లో మొదట..
జబర్దస్త్ లో మొదట ఒక చిన్న రైటర్ గా వర్క్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ కమెడియన్ గా మారిపోయి అనంతరం మళ్ళీ గ్రూప్ లీడర్ గా కూడా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. కిరాక్ ఆర్పి చాలా కాలం పాటు జబర్దస్త్ లో నిలదొక్కుకుంటూ ఆర్థికంగా కూడా స్థిరపడ్డాడు. అంతేకాకుండా సొంతంగా ఫ్లాట్ కూడా తీసుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య కూడా ఈవెంట్స్ నిర్వహిస్తూ మంచి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.

జబర్దస్త్ పై విమర్శలు
అయితే కిరాక్ ఆర్పీ ఆ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కొంత మందిని వాడుకొని వదిలేస్తోంది అని అక్కడ ఏ మాత్రం న్యాయం జరగడం లేదు అని ఊహించని విధంగా విమర్శలు చేశాడు. అయితే అతని మాటలకు కూడా మరి కొంతమంది కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ వారికి కౌంటర్ గా కూడా ఆర్పి కామెంట్ చేసి వార్తల్లో నిలిచాడు.

హోటల్ లో పని చేస్తూ..
ఇక గొడవ ముగిసిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయిన ఆర్పీ ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. ఏదో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ముందుకు కొనసాగిపోతూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో అతను ఊహించిన విధంగా ఒక హోటల్లో పనిచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అతను ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అనే తరహాలో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.

సొంతంగా వ్యాపారం
నిజానికి కిర్రాక్ ఆర్పీ హోటల్ లో పనిచేయడం లేదు. అతనే సొంతంగా ఒక కిచెన్ పెట్టుకుని బిజినెస్ కొనసాగిస్తున్నాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కిచెన్ హైదరాబాదులో స్థాపించాడు. ఇంకా చేపల పులుసు వంటకాలతో ప్రత్యేకంగా అతను ఈ బిజినెస్ కొనసాగిస్తున్నాడు. వాటిని ఒక కిచెన్ లో రెడీ చేసి హైదరాబాదులోనే ఒక కర్రీస్ పాయింట్ లో వాటిని అమ్ముతూ మంచి బిజినెస్ చేస్తున్నాడు

50 లక్షల పెట్టుబడితో
ఇక వ్యాపారం గురించి చెప్పిన కిర్రాక్ ఆర్పీ నేను అలాగే ఒక స్నేహితుడు కలిసి 50 లక్షలు పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టామని చేపల పులుసు అంటే అందరికీ నెల్లూరు గుర్తుకు వస్తుంది అని అదే టేస్ట్ ఇక్కడ అందరికీ దొరికే విధంగా ప్రయత్నం చేస్తున్నాము అని అన్నాడు. అంతేకాకుండా హైదరాబాదులో 15 కు పైగా బ్రాంచ్ లు కూడా పెట్టాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నామని నెలకు లక్షల్లో టర్నోవర్ కూడా ఉందని కిరాక్ ఆర్పీ చెప్పడం విశేషం.