Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏపీ సీఎం డైలాగ్‌తో రచ్చ చేసిన జబర్ధస్త్ కమెడియన్.. మీదికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన రోజా.!
తెలుగు బుల్లితెర హిస్టరీలో 'జబర్ధస్త్' అనే కామెడీ షోకు ఉన్న పాపులారిటీ మరే దానికి లేదని చెప్పవచ్చు. ఈ షో ప్రారంభమై ఏడేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గానే సాగుతుందంటే అదే కారణం. మొదట్లో వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. ఆ తర్వాత రెండు రోజులకు చేరుకుంది. అప్పటి నుంచి ఈ షో క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. వారంతా ఇప్పుడు స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో నరేష్ ఒకడు. తాజాగా అతడు ఏపీ సీఎంను అనుకరించి రచ్చ రచ్చ చేశాడు.

మూడడుగులే.. కానీ టాలెంట్ మాత్రం
జబర్ధస్త్ నరేష్ మూడు అడుగులు మాత్రమే ఉంటాడు. కానీ, అతడిలోని టాలెంట్ మాత్రం లెక్కించలేరు. చిన్న ఆర్టిస్టుగా పరిచయం అయిన నరేష్.. తక్కువ కాలంలోనే జబర్ధస్త్‌లో టీమ్ లీడర్ అయ్యాడు. ఇక, ఈ మధ్య కొందరి టీమ్‌లలో చేస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. సీనియర్లపై గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ పొట్టివాడైనా గట్టొడు అనిపించుకుంటున్నాడు.

నరేష్‌కు బాగా డిమాండ్ ఉంది
జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నరేష్‌కు ప్రస్తుతం బుల్లితెరపై బాగా డిమాండ్ ఉంది. అతడు ప్రస్తుతం ‘పటాస్', ‘గ్యాంగ్ లీడర్' సహా పలు ప్రొగ్రామ్‌లలో చేస్తున్నాడు. వీటితో పాటు మరికొన్ని ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. అలాగే, నరేష్ పలు సినిమాల్లోనూ నటించాడు. దీంతో ఈ యంగ్ కమెడియన్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

ఈ సారి సంక్రాంతి స్పెషల్ ఇదే
‘జబర్ధస్త్' షోను నిర్మిస్తున్న సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్లెమాల అనే పేరుతో ఉన్న సంస్థ ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. జబర్ధస్త్‌తో పాటు మరికొన్ని షోలను నిర్మిస్తోంది. అలాగే, ప్రతి పండుగకు సరికొత్త ప్రోగ్రామ్‌లతో ముందుకు వస్తోంది. ఇక, రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని ‘అమ్మా నాన్న ఓ సంక్రాంతి' అనే స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నారు.

పిల్లలకు పెద్దలకు మధ్య పోటీ
ఇప్పటి వరకు జరిగిన స్పెషల్ ఎపిసోడ్స్‌లో సెలెబ్రిటీలను రెండు టీమ్‌లుగా విభజించి ఫన్ చేయించారు. ఇప్పుడు మల్లెమాల షోలలో చేస్తున్న ఆర్టిస్టులకు, వాళ్ల పిల్లలకు మధ్య పోటీని ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దల మధ్య వచ్చే పోటాపోటీ ప్రదర్శనలతో ఈ ఈవెంట్ జరగనుంది. ఇందులో రోజా సహా జబర్ధస్త్ ఆర్టిస్టులు, యాంకర్లు, సింగర్లు పాల్గొన్నారు.
ఏపీ సీఎం డైలాగ్‌తో నరేష్ రచ్చ
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా యాంకర్ ప్రదీప్ పిల్లలకు, పెద్దలకు మధ్య సమావేశాలు నిర్వహించాడు. ఇందులో నరేష్ తన తండ్రిపై కంప్లైంట్ చేశాడు. ఆ సమయంలో తన తండ్రిని ఉద్దేశించి ‘కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరిక్కడ' అంటూ డైలాగ్ చెప్పి రచ్చ చేశాడు. కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇలాంటి డైలాగే చెప్పిన విషయం తెలిసిందే.

మీదికొచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన రోజా.!
ఇదే డైలాగును నరేష్ రెండు మూడు సార్లు చెప్పడంతో అక్కడే ఉన్న రోజా నవ్వుకుంటూ అతడి మీదికి దూసుకొచ్చారు. అప్పుడు నరేష్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె నరేష్‌కు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు కళ్లు పెద్దవి చేసి చూశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.