For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్వరలో భీమవరం అల్లుడు కాబోతున్ననరేష్.. రెండో పెళ్ళా, అసలు విషయం లీక్ చేసిన శాంతి స్వరూప్!

  |

  బుల్లితెరలో జబర్దస్త్ కి వచ్చినంత పేరు మరో ప్రోగ్రాంకి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రోగ్రాం అనేక వందల మందికి ప్రత్యక్షంగా ఆదాయం కల్పిస్తోంది. కొన్ని కోట్ల మందిని ప్రత్యక్షంగా నవ్విస్తోంది. ఈ జబర్దస్త్ వల్ల చాలా మంది పేరుతెచ్చుకున్నారు. అందులో పొట్టి నరేష్ కూడా ఒకరు. ఉండడానికి మూడు అడుగులు ఉంటాడు కానీ అతను వేసిన పంచులు వింటే మాత్రం పొట్ట చెక్కలు కావాల్సిందే. జనం అందరూ పొట్టి నరేష్ గా పిలుచుకునే నరేష్ కి వాళ్ళ టీం లీడర్లు పెట్టిన పేరు నాటీ నరేష్. ఎప్పటికప్పుడు నరేష్ వయసు గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా శాంతి స్వరూప్ చేసిన ఒక సరదా పని వల్ల నరేష్ పెళ్లి గురించి వార్తలు మొదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

  షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ లో

  షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ లో

  అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం చాలామంది కమెడియన్స్ అలాగే నటీనటులు కూడా తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అలరిస్తున్నారు.. అందులో భాగంగానే జబర్దస్త్ లో ఎక్కువగా లేడీ గెటప్ లు వేసే శాంతి స్వరూప్ కూడా షైనింగ్ శాంతి అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ లో జబర్దస్త్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే తాను బయటకు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు వీడియోలు కూడా చేసి పెడుతూ ఉంటాడు శాంతి స్వరూప్. అలా ఆయన పెట్టిన ఒక తాజా వీడియోలో నరేష్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  జబర్దస్త్ నరేష్ కి గతంలో వివాహం

  జబర్దస్త్ నరేష్ కి గతంలో వివాహం

  జబర్దస్త్ నరేష్ కి గతంలో వివాహం అయిందని త్రిపురాంబిక అనే మహిళతో వివాహం జరుగగా ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. నిజానికి త్రిపురాంబిక అనే మహిళ చనిపోవడం నిజమే కానీ ఆమె నరేష్ భార్య కాదు. చూడడానికి అచ్చం నరేష్ పోలికలతోనే ఉండే మరో పొట్టి నటుడు రమేష్ భార్య. నరేష్ వయసు ఇప్పటిదాకా పెళ్లీడు వచ్చింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ రమేష్ నరేష్ ఇద్దరు పోలికలో దగ్గరగా ఉండటంతో ఇద్దరూ ఒకటే అని చాలామంది పొరబడ్డారు.

  నరేష్ వయసు 20 ఏళ్ళట

  నరేష్ వయసు 20 ఏళ్ళట

  ఆ మధ్య వెల్లడైన విషయం ప్రకారం నరేష్ వయసు 20 ఏళ్ళట 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్ ముందుగా ఢీ జూనియర్స్ షోకు వచ్చాడు. నటన మీద ఆసక్తితో ఎప్పటికప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బయట తిరుగుతూ ఉండే నరేష్ ను చూసి సునామీ సుధాకర్ చంటి టీం లో అవకాశం వచ్చేలా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేరిన తర్వాత నరేష్ జాతకం మారిపోయి స్టార్ గా అయిపోయాడు. మొత్తం మీద నరేష్ పెళ్లి వ్యవహారం మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అని చెప్పక తప్పదు.

  అమ్మాయిది భీమవరం

  అమ్మాయిది భీమవరం

  తాజాగా శాంతి స్వరూప్, బుల్లెట్ భాస్కర్, నాటీ నరేష్, ఫైమా కలిసి రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ చేశారు.. ఈవెంట్ కి వెళుతూ ఉండగా కార్లో శాంతి స్వరూప్ మాట్లాడుతూ ఈ మధ్యనే నరేష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అనే వారు తమకు తెలిసిందని అన్నాడు. బుల్లెట్ భాస్కర్ కల్పించుకుని ఈ మధ్యనే పెళ్లి చూపులు జరిగాయని అంతా ఓకే అని పెళ్ళి కూడా త్వరలోనే ఉండబోతోందని చెప్పాడు. ఆ అమ్మాయిది భీమవరం అని పేర్కొన్న బుల్లెట్ భాస్కర్ అమ్మాయి డిగ్రీ దాకా చదువుకున్నదని 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు వుందని ఆమె పేరు శకుంతల అని చెప్పుకొచ్చాడు.

  నరేష్ నాయుడు

  నరేష్ నాయుడు


  అయితే ఇదంతా వీళ్ళు మాట్లాడుతున్న సమయంలో నరేష్ ఇదంతా నిజం కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక పక్క శాంతి స్వరూప్ మరో పక్క బుల్లెట్ భాస్కర్ కూడా నరేష్ పెళ్లి వార్తలు నిజం అనిపించేలా గా మాట్లాడారు. ఇక నరేష్ కాపు కులానికి చెందిన వ్యక్తి అని అతని పేరు నరేష్ నాయుడు కాగా నాయుడు తీసి పక్కన పెట్టి జబర్దస్త్ కోసం కేవలం నరేష్ గా చలామణి అవుతున్నాడు అని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. గోదావరి వాళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసు కదా ఇక నరేష్ పెళ్లి రచ్చ మామూలుగా ఉండదని శాంతి స్వరూప్, బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

  Hero Vishwaksen Suden Surprise To Fans In Thirupathi Theater ​| Filmibeat Telugu
  రామోజీ ఫిలిం సిటీ లో

  రామోజీ ఫిలిం సిటీ లో

  ఇక అలాగే రామోజీ ఫిలిం సిటీ లో కొద్ది రోజుల క్రితం భీమిరెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఈవెంట్ చేశామని ఆయన కూతురి పెళ్ళి దాదాపు ఐదు రోజుల పాటు నిర్వహించారని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాము ఈవెంట్లో పాల్గొన్నామని ఈరోజు వారి కుమారుడి ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతోందని చెప్పుకొచ్చారు. సాధారణంగా పెళ్లి అంటే ఉదయం వచ్చి పెళ్లి అవ్వగానే వెళ్ళిపోదామని అందరూ చూస్తూ ఉంటారు అని కానీ భీమిరెడ్డి వారి వివాహం మాత్రం పొద్దున్నుంచి రాత్రి వరకు జరుగుతూనే ఉంటుందని. వారం, పది రోజుల పాటు వాళ్ళందరూ రామోజీ ఫిలిం సిటీ లోనే ఉండి పెళ్లి బాహుబలి సెట్స్ లో చేసేలా గా ప్లాన్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక కుమార్తె వివాహం ఐదు రోజులు చేయగా కుమారుడి వివాహం దాదాపు పది రోజుల పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు వెల్లడించారు.

  English summary
  Jabardasth Naresh to marry a bhimavaram girl soon
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X