For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫైమాకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన లవర్.. అందరి ముందే అలా పెట్టేసి.. ఆమె తల్లి రియాక్షన్ చూస్తే!

  |

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే తమదైన టాలెంట్లను చూపించి స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ఫైమా ఒకరు. చాలా తక్కువ సమయంలోనే జబర్ధస్త్ షోలో టాప్ కమెడియన్‌గా ఎదిగిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయినా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫైమాకు బాయ్‌ఫ్రెండ్ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  అలా ఎంట్రీ.. జబర్ధస్త్‌గా కెరీర్

  అలా ఎంట్రీ.. జబర్ధస్త్‌గా కెరీర్

  'పటాస్' అనే షో ద్వారా ఫైమా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగం అయింది. తద్వారా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తోంది.

  ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  బిగ్ బాస్ ఛాన్స్.. స్పెషల్‌గానే

  బిగ్ బాస్ ఛాన్స్.. స్పెషల్‌గానే

  గత సీజన్ల కంటే ఆరో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా సెలెక్ట్ చేశారు. ఇలా మొత్తంగా ఈ సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో జబర్ధస్త్ ఫైమా లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే యమ ఫోకస్ అయింది.

  ఆటే కాదు వినోదాన్ని పంచి

  ఆటే కాదు వినోదాన్ని పంచి

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్న ఫైమా అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు క్రేజ్ కూడా దక్కింది. అలాగే, ఇటీవలే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తూ విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుని సత్తా చాటింది.

  Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!

  వెటకారం వల్ల ట్రోల్స్ కూడా

  వెటకారం వల్ల ట్రోల్స్ కూడా

  ఆరో సీజన్‌లోకి ఎంటరైన తక్కువ రోజుల్లోనే అటు ప్రేక్షకుల, ఇటు హోస్ట్ మన్ననలు అందుకున్న ఫైమా.. అప్పుడప్పుడూ అడల్ట్ జోక్‌లు, చెత్త ప్రవర్తనతో విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా, అతి వెటకారంతో మాట్లాడుతూ చెడ్డపేరును మూటగట్టుకుంటోంది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున కూడా ఆమెతో చెప్పాడు. దీంతో చివర్లో ఆమె కాస్త మారినట్లు కనిపించింది.

  షో నుంచి ఔట్.. నాగ్ ముద్దు

  షో నుంచి ఔట్.. నాగ్ ముద్దు

  బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరు, వినోదంతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్న జబర్ధస్త్ ఫైమా.. కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడప్పుడూ గొడవలు పడుతూ విమర్శలను ఎదుర్కొంది. అదే ఆమెకు మైనస్‌గా మారింది. దీంతో ఈ చిన్నది 13వ వారంలో ఎలిమినేట్ అయింది. ఇక, స్టేజ్ మీద నాగార్జున ఆమెకు ముద్దిచ్చి షాకిచ్చాడు.

  బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

  ఫైమా కోసం ప్రవీణ్ గిఫ్టులు

  ఫైమా కోసం ప్రవీణ్ గిఫ్టులు

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫైమా తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత చేసిన సంబరాలను చూపించారు. ఇక, ఇందులో ఫైమా లవర్ ప్రవీణ్ కడప దర్గా నుంచి తీసుకు వచ్చిన ఓ వాటర్ బాటిల్‌ను ఆమెకు ఇచ్చాడు.

  చైన్ తీసుకుని.. తల్లి అలా

  చైన్ తీసుకుని.. తల్లి అలా

  ఫైమాకు ప్రవీణ్ వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత అతడి మెడలో ఉన్న చైన్‌ను ఇవ్వమని అడిగింది. దీంతో వెంటనే అది తీసి ఆమె మెడలో వేసేశాడు. అప్పుడు ఫైమా మదర్ 'మళ్లీ ఆ చైన్ అడగకూడదు' అని అన్నారు. ఆ సమయంలో అంతా నవ్వుకున్నారు. అనంతరం ఆమె ప్రవీణ్ ముఖంపై ఉన్న కేక్ క్రీమ్‌ను తుడిచారు. కానీ, ఫైమా మాత్రం అతడితో సరదా పనులు చేసింది.

  English summary
  Jabardasth Faima Recently Eliminated From Bigg Boss Telugu 6th Season. Now Jabardasth Praveen Gives Special Gift to her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X