For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: మూడేళ్లుగా నాన్నను అలా మోసం చేశా.. చిన్నప్పటి నుంచే అలాంటి కష్టాలు.. ప్రియాంక సింగ్ కంటతడి

  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 5వ సీజన్‌లో తొలి రోజు ఇంటి సభ్యులు మధ్య పరిచయాలు, వారి గురించి విషయాలను తెలుసుకొనే పనిలో పడ్డారు. అలాగే చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ తమ మధ్య సన్నిహిత్యాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు. అలాగే తొలి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ గురించి యాక్టర్ విశ్వ, షణ్ముఖ్, యాక్టర్ మానస్ మాట్లాడుకొంటూ కనిపించారు. ఇంకా తొలి రోజు ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందంటే..

  Photo Courtesy: Disney+hotstar and Star Maa

  షణ్ముఖ్ ఎమోషనల్‌గా

  షణ్ముఖ్ ఎమోషనల్‌గా

  షణ్ముఖ్ ఎవరిని కలువకుండా ఒంటరిగా ఫీలవ్వడంపై ఇంటి సభ్యులు చర్చించుకొన్నారు. దాని గురించి షణ్ముఖ్ చెబుతూ ఫస్ట్ టైమ్ నేను ఇంత మందితో ఉండటం. అందరితో కలవడం కాస్త టైమ్ పడుతుంది. యాంకర్ రవి వచ్చి వన్ టైమ్ ఛాయిస్.. బాగా యూజ్ చేసుకో అంటూ చెబుతున్నారు. అందరూ వచ్చి నాకు ఏదో సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎవడి గేమ్ వాడితే ఇక్కడ. అవసరమైతే నేను ఇంటికి వెళ్లి సినిమాలు చేసుకొంటాను అంటూ షణ్ముఖ్ అనడం కనిపించింది.

  నేను ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయం

  నేను ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయం

  ఇక ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్ ముచ్చట్లో పడిపోయారు. మీరు ఇంటిలో కంఫర్ట్‌గానే ఉన్నారు కదా. . అంటే అవును. నాకు ఎలాంటి సమస్యలు లేవు. నేను ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయాన్ని వేదిక మీద నుంచి నేను నిన్ననే మా నాన్నకు చెప్పాను. డాడీ మీరు నా నిర్ణయాన్ని అంగీకరిస్తారనే విషయం తెలుసు. లవ్ యూ అంటూ జబర్దస్త్ ప్రియాంక ముద్దు పెట్టింది.

  గడ్డాలు మీసాలు ఏవీ అని నాన్న అంటే.

  గడ్డాలు మీసాలు ఏవీ అని నాన్న అంటే.

  నేను ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయం మా నాన్నకు తెలియదు. నిన్న ధైర్యంగా చెప్పాను. మూడేళ్లుగా ఈ విషయం చెప్పకుండా నేను మా నాన్న మోసం చేస్తున్నాను. మా నాన్న నన్ను టచ్ చేసి మూడున్నర ఏళ్లు అవుతున్నది. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత నన్ను టచ్ చేయలేదు. ఒకే ఒక్కసారి నా చెంపలు పట్టుకొన్నారు. అప్పుడు నాన్న ఏంటి.. గడ్డాలు మీసాలు లేవు ఏంటీ అని అడిగితే.. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను అమ్మాయి వేషాలు వేస్తాను కదా.. అందుకే నేను నీట్ షేవ్ చేసుకొన్నానని అబద్ధం చెప్పాను. దాంతో నాన్న సరేలే అన్నారు అని కాజల్‌తో ప్రియాంక సింగ్ చెబుతూ కనిపించింది.

  చాలా కష్టాలు పడ్డాను అంటూ ప్రియాంక

  చాలా కష్టాలు పడ్డాను అంటూ ప్రియాంక

  నాన్నతో నేను అమ్మాయిగా సర్జరీ చేయించుకొన్న విషయాన్ని చెప్పలేక బాధపడ్డాను. కానీ ఇప్పుడు లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టాలు పడ్డాను. ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు నేను కష్టాలను అనుభవించాను అంటూ తన జీవితంలో ఎదురైన సమస్యలను కాజల్‌తో పంచుకొన్నారు.

  ధైర్యం చెప్పిన ఆర్జే కాజల్

  ధైర్యం చెప్పిన ఆర్జే కాజల్

  జబర్దస్త్ ప్రియాంక జీవితంలోని సమస్యలను విన్న ఆర్జే కాజల్ కొంత మేరకు షాక్ అయింది. ప్రియాంక చెప్పే విషయాలు తట్టుకోలేక వెంటనే దగ్గరకు వెళ్లి అప్యాయంగా పట్టుకొన్నది. కంటతడి పెట్టిన ప్రియాంక సింగ్‌ను కౌగిలించుకొని ఓదార్చింది. తలపై ముద్దుపెట్టి.. ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలని ధైర్యం చెప్పింది. అలా ప్రియాంక సింగ్, కాజల్ మధ్య సంభాషణ ఎమోషనల్‌గా సాగింది.

  Legendary Director Raghavendra Rao Releases Pellikuturu Party Trailer
   మొదటివారం ఎలిమినేషన్‌కు ఆరుగురు నామినేట్

  మొదటివారం ఎలిమినేషన్‌కు ఆరుగురు నామినేట్

  ఇక సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ ఘాటుగా జరిగింది. ఇంటి సభ్యుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌లో ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. యాంకర్ రవి, మానస్, కాజల్, ఫమీదా, మోడల్ జస్వంత్, 7 ఆర్ట్స్ సరయు ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో వేచి చూడాల్సిందే.

  English summary
  Jabardasth Priyanka Singh gets emotional over Gender change and about his father DB Singh. She rendered apology to her father DB Singh over Gender change Surgery.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X