For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్దస్త్ ప్రియాంక‌కు సైట్ కొట్టిన లోబో.. ఈల వేసి అదో రకంగా పైకెత్తి.. బిగ్‌బాస్‌లో చిలిపిగా లవ్ ట్రాక్

  |

  బిగ్‌బాస్ రియాలిటీ షోలో కమెడియన్ లోబో హాస్యం ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకులకు, హోస్ట్‌ నాగార్జునకు మంచి వినోదాన్ని పంచుతున్నది. ఫన్ క్రియేట్ చేయడానికి ఇంటి సభ్యులు ప్రియ, ఉమ, ప్రియాంక సింగ్, శ్వేతా శర్మతో లోబో వేస్తున్న లవ్ ట్రాక్స్ ఆకట్టుకొంటున్నాయి. బిగ్‌బాస్‌లో లోబో చేస్తున్న విన్యాసాలు, అలాగే బాడీ లాంగ్వేజ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 14వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్‌తో లోబో చేసిన చిట్ చాట్ ఆసక్తికరంగా హ్యుమర్‌ను పండించింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే..

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   లోబో తీరుపై యాంకర్ రవి

  లోబో తీరుపై యాంకర్ రవి

  బిగ్‌బాస్ ఇంటిలో రెండోవారం నామినేషన్ సందర్భంగా లోబో చేసిన వ్యాఖ్యలు కొందరికి ఆశ్చర్యం కలిగించాయి. లోబో అంటే పేరు కాదు.. బ్రాండ్. పెద్ద హీరోలను గుర్తుపట్టని వాళ్లు కూడా నన్ను గుర్తు పడుతారు. నేనేంటో మీకు తెలియదు అంటూ నామినేషన్ సమయంలో అనడంపై యాంకర్ రవి, సిరి హన్మంతు చర్చించుకొన్నారు. నామినేషన్ చేయనని చెప్పి నన్ను నామినేట్ చేశాడు. అతడి ప్రవర్తన నాకు అర్ధం కావడం లేదు అంటూ యాంకర్ రవి అన్నారు.

  ప్రియ, శ్వేతావర్మ, ఉమతో లవ్ ట్రాక్

  ప్రియ, శ్వేతావర్మ, ఉమతో లవ్ ట్రాక్

  ఇక ఇదిలా ఉంటే, తన సహజ స్వభావానికి తగినట్టుగా మాట్లాడుతూ.. ప్రియ, ఉమ, ప్రియాంకకు ప్రపోజ్ చేస్తూ కామెడీ పండిస్తున్నాడు. అయితే శ్వేతా వర్మతో లవ్ ట్రాక్ నడపడానికి ప్రయత్నించగా యాంకర్ రవి అడ్డుపడ్డాడు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో లోబో హ్యుమర్ పండిస్తున్నాడు. చాలా క్యాజువల్‌గా కనిపిస్తూ సమయం దొరికితే కామెడీ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నాడు. నామినేషన్ ప్రక్రియ తర్వాత కిచెన్ వద్ద లోబోకు ప్రియాంక సింగ్ మధ్య ఫన్నీ సీన్ కనిపించింది.

   ప్రియాంక సింగ్‌కు ఈల కొట్టి సైగ చేసి..

  ప్రియాంక సింగ్‌కు ఈల కొట్టి సైగ చేసి..

  ప్రియాంక సింగ్ కిచెన్‌లో ఏదో తినడానికి వస్తే.. లోబో సన్నగా ఈల వేసి సైగ చేశాడు. ప్రియాంక వెళ్తుంటే.. హేయ్ యూ అంటూ కామెంట్ చేస్తే.. అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఇలానే చేస్తారా అంటూ ప్రియాంక బదులిచ్చింది. దాంతో మళ్లీ మళ్లీ ఈలలు వేస్తారా? అందంగా కనిపిస్తే అలా ట్రీట్ చేస్తారా? మినిమమ్ కామన్ సెన్స్ ఉందా అంటూ ప్రియాంక కౌంటర్ ఇచ్చింది. ఏంటి మీరు.. మా ఊరికి కొత్తగా వచ్చావు అని లోబో అన్నారు.

   నిన్ను చూసి మా పోరగాళ్లు అంటూ లోబో

  నిన్ను చూసి మా పోరగాళ్లు అంటూ లోబో

  లోబోతో మాటలు కొనసాగిస్తూ.. మీ ఊరికి రావడమే కాదు.. నీకు తెలియకుండానే మీ ఊరు మొత్తం తిరిగి వచ్చాను.. కాదు కాదు.. తిరిగి వచ్చాను కాదు.. చూసోచ్చాను అని ప్రియాంక అంటే.. మీ భాషలో చూసోచ్చా.. గల్లీలలన్నీ తిరిగి వచ్చాను అని అంటారు. మళ్లీ ఏదో ఎక్స్‌క్యూజ్‌ మీ అంటావు. నిన్ను చూసి మా పోరగాళ్లు దడుసుకొన్నారు. ఒకరు హాస్పిటల్‌లో చేరాడు. మరోకడు దెబ్బలు తగిలించుకొన్నాడు అని లోబో మరో కౌంట్ ఇచ్చారు.

   లోబో తన షర్ట్‌ను పైకెత్తి చూపిస్తూ

  లోబో తన షర్ట్‌ను పైకెత్తి చూపిస్తూ

  లోబో కామెంట్లను భరించలేకపోయిన ప్రియాంక చిలిపిగా షటప్ అంటూ గట్టిగా అరిచింది. షట్ అప్ అని అంటే... లోబో తన షర్ట్ పైకి ఎత్తి తన బొర్రను చూపించాడు. దాంతో పక్కనే ఉన్న కాజల్ వామ్మో అంటూ అరిచింది. నీ వ్యవహారం చూసి కాజల్ బెదిరిపోయింది అని ప్రియాంక అంటే.. షట్ ఆప్ అన్నావు.. అందుకే షర్ట్ లేపాను అని లోబో అన్నాడు. లోబో చిలిపితనం చూసి నవ్వుల్లో మునిగిపోయింది. నిన్ను చూసి కాజల్ భయపడి పోయింది. దెబ్బ జ్వరం రావడం ఖాయం అని ప్రియాంక చెప్పింది.

  Love Story రొమాంటిక్ మూవీ కాదు.. Naga Chaitanya, Sai Pallavi ల గీతాంజలి || Filmibeat Telugu
   లోబోతో ప్రియాంక చిలిపిగా

  లోబోతో ప్రియాంక చిలిపిగా

  లోబోతో జరిగిన చిలిపి సంభాషణ అనంతరం సన్నగా లోబో బుగ్గ గిల్లింది. దాంతో లోబో సిగ్గుపడిపోయాడు. వెంటనే ప్రియాంక చేతిని సుతారంగా తాకడానికి ప్రయత్నిస్తే. వెంటనే ఆమె తన చేయిని స్పీడ్‌గా వెనుకకు లాగేసుకొన్నది. ఆ తర్వాత తమ సంభాషణ చూసుకొని ఇద్దరు చేతులు పైకెత్తి హై ఫై కొట్టుకొన్నారు. ఇలా లోబో, ప్రియాంక మరోసారి మంచి వినోదాన్ని, కంటెంట్‌ను క్రియేట్ చేశారు. లోబో కామెడీతో షో సరదాగా సాగిపోతున్నది.

  English summary
  Comedian Lobo is creating much humour in bigg boss Show. In this occassion, Jabardasth Priyanka Singh love track and Funny chit chat with Lobo in Bigg Boss Telugu 5
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X