For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్‌‌లోకి స్పెషల్ కంటెస్టెంట్: ఐదో సీజన్‌లోకి జబర్ధస్త్ లేడీ.. షో చరిత్రలోనే ఇది రెండోసారి!

  |

  కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ పోతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటు దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సాధిస్తోంది. ఫలితంగా సీజన్ సీజన్‌కు ఆదరణను పెంచుకుంటూనే వెళ్తోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల్లో మరో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పటికే దాదాపు అందరి పేర్లు లీక్ అయ్యాయి. ఇక, ఇప్పుడు ఐదో సీజన్‌లో పాల్గొనబోయే స్పెషల్ కంటెస్టెంట్ పేరు రివీల్ అయింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? పూర్తి వివరాలు మీకోసం!

  అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్

  అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా మొదలైందే బిగ్ బాస్. హిందీలో ఇది పదిహేనేళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, తెలుగులోకి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. మన భాషలోకి వచ్చిన సమయంలో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. పైగా ఇలాంటి షోను తెలుగు వాళ్లు ఆదరిస్తారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది.

  ‘సర్కారు వారి పాట' టీజర్ హైలైట్స్ లీక్: మహేశ్ నుంచి ఇది ఊహించరు.. ఆ ఒక్క దానితో పూనకాలు ఖాయం!

   ఐదో సీజన్‌పై క్లారిటీ... ఫ్యాన్స్ హ్యాపీ

  ఐదో సీజన్‌పై క్లారిటీ... ఫ్యాన్స్ హ్యాపీ

  మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌ షోకు మాత్రమే మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది నేషనల్ లెవెల్‌లోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటోంది. అదే సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఇటీవలే లోగో ప్రోమో కూడా విడుదలైంది. తద్వారా త్వరలోనే కొత్త సీజన్ రాబోతుందని ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ప్రియులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

  ఈ సారి అంత మంది... ప్రాసెస్ పూర్తి

  ఈ సారి అంత మంది... ప్రాసెస్ పూర్తి

  గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కోవిడ్ ప్రభావంతో అభ్యర్థులను ఎంపిక చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇలాంటి తరుణంలో ఐదో సీజన్‌కు సంబంధించి నిర్వహకులు దాదాపు 50 మందితో ఆన్‌లైన్ ద్వారానే సంప్రదింపులు జరిపారట. అందులో షార్ట్ లిస్టును కూడా తయారు చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలోని సభ్యులతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. అందులో ఈ సీజన్ కోసం 18 మందిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇంత పెద్ద జాబితా గతంలో కనిపించలేదు.

  ఐదో సీజన్ కంటెస్టెంట్ల పేర్లు ఇవేనని

  ఐదో సీజన్ కంటెస్టెంట్ల పేర్లు ఇవేనని

  బిగ్ బాస్ షోకు సంబంధించినంత వరకూ ప్రతి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడానికే వాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక గురించి పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ మధ్య అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. ఇక, ఇప్పటికి అందిన సమచారం ప్రకారం.. ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  భర్తతో ప్రియాంక రొమాంటిక్ పిక్: ఇది అతడి సొంతమైన పార్ట్ అంటూ.. అక్కడ హత్తుకున్న హీరోయిన్

   బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం

  బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం

  బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, పలు రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఫేమస్ అయిన కంటెస్టెంట్లతో పాటు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వాళ్లను ఎంపిక చేస్తున్నారు. అలాగే, కొంత మంది స్పెషల్ పర్సన్లను కూడా షోలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఐదో సీజన్‌ కోసం బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  స్పెషల్ కంటెస్టెంట్‌గా జబర్ధస్త్ బ్యూటీ

  స్పెషల్ కంటెస్టెంట్‌గా జబర్ధస్త్ బ్యూటీ

  ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కంటెస్టెంట్ వివరాలు లీక్ అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే సీజన్‌లో టాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ జబర్ధస్త్ సాయితేజ ఎంట్రీ ఇస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌పై తను సంతకం కూడా పెట్టేసిందని తెలుస్తోంది. ఆమె రాకతో బిగ్ బాస్ దృష్టిలో అందరూ సమానమే అని నిర్వహకులు మరోసారి మెసేజ్ ఇవ్వబోతున్నారు.

  మంచు లక్ష్మీ ఘాటు ఫోజులు: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. షాకిస్తోన్న ఆమె పర్సనల్ ఫొటోలు

  బిగ్ బాస్ చరిత్రలో రెండోసారి మాత్రమే

  బిగ్ బాస్ చరిత్రలో రెండోసారి మాత్రమే

  బిగ్ బాస్ నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ ఓ స్పెషల్ కంటెస్టెంట్‌ను తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే మూడో సీజన్‌లో టాన్స్‌జెండర్ తమన్నాను కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారు. అలాగే, ఇప్పుడు ప్రియాంక సింగ్‌ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కమెడియన్‌గా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత లేడీ గెటప్‌లతో ఫేమస్ అయ్యాడు సాయితేజ. ఈ క్రమంలోనే ఆ మధ్య లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ‘ప్రియాంక సింగ్‌'గా మారిపోయాడు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద సంచలనం అయింది.

  Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times


  టాలీవుడ్, బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా తాజా వార్తల కోసం, తారల ఇంటర్యూల కోసం, టెలివిజన్ సీరియల్ అప్‌డేట్స్ కోసం, ఫోటో గ్యాలరీల కోసం, సినిమా ఈవెంట్ల కోసం, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణల కోసం.. మీరు వెంటనే ఫేస్‌బుక్ ( https://www.facebook.com/TeluguFilmibeat/) ట్విట్టర్ (https://twitter.com/TeluguFilmibeat), ఇన్స్‌టాగ్రామ్ (https://www.instagram.com/filmibeatteluguofficial/) అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series. This Show Makers Planing for 5th One. Jabardasth Fame Transgender Priyanka Singh Selected for This Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X