»   »  మంచి చూడ్డం లేదు, బూతే చూస్తున్నారు: షేకింగ్ శేషు వివరణ!

మంచి చూడ్డం లేదు, బూతే చూస్తున్నారు: షేకింగ్ శేషు వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బుల్లితెరపై ప్రసారం అవుతున్న 'జాక్ పాట్' అనే షోకు సంబంధించిన ప్రోమోలో షేకింగ్ శేషు 'మీది లేస్తుంది నాది పడుకుంటుంది' అని కామెంట్స్ చేయడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

బుల్లితెర కార్యక్రమాల్లో వల్గారిటీ ఎక్కువ అవుతోందని, ఇంట్లో అందరూ చూసే విధంగా టీవీ కామెడీ షోలు ఉండటం లేదని, అత్యంత నీచంగా, డబల్ మీనింగ్ డైలాగుతో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.

తన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో షేకింగ్ శేషు వివరణ ఇచ్చారు.

నాకు ఎప్పుడూ చెడ్డపేరు లేదు

నాకు ఎప్పుడూ చెడ్డపేరు లేదు

ఎన్నో ఏళ్ల నుండి టీవీ ఫీల్డ్ లో ఉంటున్నాను. ఏ నాడు నాకు చెడ్డ పేరు రాలేదు. మరి అది ప్రోమో మహత్యమో? నా దురదృష్టమో... ఆ పదాన్ని ఒక్కదాన్ని పెట్టి నన్ను చాలా అన్ పాపులర్ చేసారు. జాక్ పాట్ షోలో ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే నేను అన్న పదానికి అర్థం ఏమిటో తెలుస్తుంది. ప్రొగ్రాం చూపించకుండా ఓన్లీ ప్రోమో చూసి.... నాపై ఇలాంటి అభిప్రాయానికి రావొద్దని శేషు తెలిపారు.

బూతు బూతు అని ప్రోమోలు వేస్తున్నారు

బూతు బూతు అని ప్రోమోలు వేస్తున్నారు

ఇపుడు పరిస్థితి ఎలా ఉందంటే... టోటల్ స్క్రిప్టులో ఏక్కడో ఏదో ఒక పంచ్ చెబితే... పంచ్ లో ఓ చిన్న ద్వందార్థం ఉంటే దాన్నే ప్రోమోగా కట్ చేసి పెట్టేస్తున్నారు. ఆ పంచ్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ప్రోగ్రాం చేసే వాళ్లకి అక్కర్లేదు. ఇపుడు నేనొక ఉదాహరణకు ఒక పదం చెబుతాను... దానికి మీరే బాధ పడతారు. అమ్మ పెట్టేది అరటి పండు నాన్న పెట్టేది ఏపండు అనగానే హిహిహి అని నవ్వేస్తారు. ఎందుకండీ అలా నవ్వుతారు? అమ్మ పెట్టేది అరటి పండు నాన్న పెట్టేది చింతపండు. ఇది నా ఉద్దేశ్యం.... మీ ఉద్దేశ్యం వేరేది అయి ఉండొచ్చు. ఈ ప్రోగ్రాం చేసిన వాళ్లు ఇది బూతు బూతు బూతు అని పెట్టేయడం ప్రోమోలు వేసేయడం. ఇది ఎలా తయారైంది అంటే ఆర్టిస్టుల పరువు పోతోందండీ... అంటూ శేషు ఆవేదన వ్యక్తం చేసారు.

మీది లేస్తుంది... నాది పడుకుంటుంది

మీది లేస్తుంది... నాది పడుకుంటుంది

మీది లేస్తుంది... నాది పడుకుంటుంది అనే వివాదంపై స్పందిస్తూ.... ఇంటర్నెట్లో ప్రోగ్రాం మొత్తం చూస్తు అసలు విషయం అర్థమవుతుంది. యాక్చువల్ గా నేను ఫస్ట్ రౌండ్ లో విన్ అయ్యాను. నేనే మిగతా వారందరికీ టాస్క్ ఇవ్వాలి. అలాంటి టైమ్ లో వీరందరినీ ఓడించాలి... ఏం చేద్దాం... ఎలా ఓడిద్దాం అని ఆలోచించి... అలీ అనే అబ్బాయికి హిందూ దేవాలయాల గురించిన టాస్క్ ఇచ్చాను. అపుడు అతడు ఏంటి బాబాయ్ నాకు మీ హిందూ దేవాలయాల గురించి నాకేం తెలుస్తుంది.. నేను ముస్లింని కదా అన్నాడు.. అందుకు నేను అలా ఇస్తేనే నీ రేటింగ్ పడుకుంటుంది... నా రేటింగ్ లేస్తుంది అని అన్నాను. అక్కడ రేటింగ్ అనే పదం తీసేసి... నీది లేస్తుంది, నా ది పడుకుంటుంది అని వేసారు. సంస్కారం ఉన్నవాడెవడైనా నీది లేస్తుంది, నాది పడుకుంటుంది అని పదం వాడతాడా?.... అని షేకింగ్ శేషు వివరణ ఇచ్చారు.

కమల్ హాసన్ మీద కూడా...

కమల్ హాసన్ మీద కూడా...

యూట్యూబ్‌లో ఇలాంటివి చాలా పెడుతున్నారు. కమల్ హాసన్ గారి గురించి కూడా ఇటీవల ఏదో..... బాహుబలి ఓ చెత్త, ప్రభాస్ ఓ గొర్రె అన్నట్లు టైటిల్ పెట్టారు. అది చూసి చాలా మంది బాహుబలి చెత్త అని ఆయన అన్నట్లు నమ్మేస్తున్నారు. నేను మా చుట్టాలింటికి వెళితే పరస్త్రీ ఇంటికి వెళ్లాడని టైటిల్ పెట్టారు. ఇంత సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరస్థితి ఆర్టిస్టుకు వస్తే వాడు ఏం బాగుపడతాడు.... అని షేకింగ్ శేషు ఆవేదన వ్యక్తం చేసారు.

మంచి చెబితే సమాజం వినడం లేదు

మంచి చెబితే సమాజం వినడం లేదు

జబర్దస్త్‌లో డబల్ మీనింగుతో రెండు ఎపిసోడ్లు చేసాను. ఆ రెండు విన్నయ్యాను. అలా కాకుండా నార్మల్ గా చేసిన ఎపిసోడ్లన్నీ ఓడిపోయాను. వల్గారిటీకి ఇస్తున్న ప్రాధాన్యత మంచికి ఇవ్వడం లేదు. మంచి చెబితే ఈ సమాజం వినడం లేదు. ఏదైనా కొంచె జుగుప్సాకరంగా మసాలా యాడ్ చేస్తే సూపర్ హిట్. అది మీ తప్పు కాదు... జనాలను ఇలాను తయారు చేస్తున్నారు. షేకింగ్ శేషు ఎప్పుడూ ఇలా చేయడు.... ఎప్పుడూ వల్గారిటీ ఉండదు. వాళ్ల ప్రమోషన్ కోసం వాళ్లు ఏదో ఒక్క పదాన్ని కట్ చేసారు. మార్కెటింగ్ ట్రిక్సే ఇదంతా... నేను బూతుకు ప్రాముఖ్యత ఇవ్వను, తప్పుగా అర్థం చేసుకోవద్దు.

పాపం అనసూయ కూడా బాధ పడింది

పాపం అనసూయ కూడా బాధ పడింది

పాపం అనసూయ కూడా మీకు ఈ విషయమై రిక్వెస్ట్ చేసి ఉంటుంది. సినిమా యాక్టర్ పృథ్వి కూడా ఆ కటింగే చూసి నాపై విమర్శలు చేసారు. ఆయన కూడా అలా అనడంతో ఇలా ఈ రోజు మీ ముందుకు వివరణ ఇచ్చుకోవడానికి రావాల్సి వచ్చింది అని షేకింగ్ వేషు తెలిపారు.

‘బూతు' టీవీ షోలు, ఇంకా హీనంగా... నాకు గుణపాఠమే: అనసూయ వివరణ!

‘బూతు' టీవీ షోలు, ఇంకా హీనంగా... నాకు గుణపాఠమే: అనసూయ వివరణ!

మీది లేస్తుంది... నాది పడుకుంటుంది అంటూ అనసూయ హోస్ట్ చేస్తున్న ‘జాక్ పాట్'లో బూతు డైలాగులు పేలడంపై ఆమె వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Photo Courtesy : ETV

English summary
Jabardasth Shaking Sheshu Clarifies about Anchor Anasuya, Sheshu Most Vulgar Conversation
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu