twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth: ఆల్ టైమ్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కమెడియన్ ఎవరంటే?

    |

    టెలివిజన్ రంగంలో ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన జబర్దస్త్ ఇటీవల కాలంలో మాత్రం ఒక్కసారి డౌన్ అయింది అని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెడీ షో నుంచి కొంత మంది కమెడియన్స్ కూడా బయటకు వెళ్లిపోతూ అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇక ఈ తరుణంలో కొంతమంది ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా జబర్దస్త్ రెమ్యునరేషన్స్ పై కూడా అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఈ క్రమంలో జబర్దస్త్ లో ఆల్ టైమ్ అత్యధిక పారితోషకం ఎవరు అందుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్

    జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్

    జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు గట్టిగానే అందుకుంటున్నారు అని చెప్పవచ్చు. మొదట సినిమాలో నటించిన వారు కూడా ఆ తర్వాత జబర్దస్త్ లోకి వస్తున్నారు. ఒక విధంగా సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే లాభపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొందరు అయితే ఏకంగా ఫ్లాట్స్ కూడా కొనుగోలు చేశారు.

    సీనీయర్స్ ఎందుకు వెళ్లిపోయారంటే?

    సీనీయర్స్ ఎందుకు వెళ్లిపోయారంటే?

    2013లో మొదలైన జబర్దస్త్ ఆ తర్వాత కంటిన్యూగా కొన్నేళ్ల వరకు కూడా టాప్ రేటింగ్ అందుకుంటూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే అందులో నుంచి కొన్నాళ్ళకు కొంతమంది సీనియర్ కమెడియన్స్ వివిధ కారణాల వలన బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొందరు సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉండడంతో బయటకు వెళ్ళిపోగా మరి కొందరు మాత్రమే నిర్వాహకుల తీరు నచ్చకపోవడంతో బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది.

    కిర్రాక్ ఆర్పీ కాంట్రవర్సీ కామెంట్స్

    కిర్రాక్ ఆర్పీ కాంట్రవర్సీ కామెంట్స్

    ముఖ్యంగా జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడంతో ఆ షోపై ఎన్నో రకాల అనుమానాలు కూడా వస్తున్నాయి. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత మరి కొంతమంది సీనియర్ కమెడియన్లు కూడా ఆయన బాటలోనే కామెడీ షో లో నుంచి బయటకు వచ్చేశారు. రీసెంట్ గా కిరాక్ ఆర్పీ కూడా జబర్దస్త్ షోపై వివిధ రకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కమెడియన్స్ కారణంగానే జబర్దస్త్ ఆ స్థాయిలో క్రేజ్ అందుకుంది అని.. కానీ కష్టపడిన వారిపై ఆ కామెడీ షో నిర్వాహకులు కృతజ్ఞత చూపలేకపోయారు అని కూడా అన్నారు.

    హై రేంజ్ రెమ్యునరేషన్స్

    హై రేంజ్ రెమ్యునరేషన్స్

    ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే జబర్దస్త్ ద్వారా మంచి పారితోషికం అందుకున్న వారి సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా టీమ్ లీడర్స్ అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్స్ అందుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు 18 రేటింగ్ వచ్చినప్పుడు మినిమం సైడ్ క్యారెక్టర్ లో నటించిన వారికి కూడా ఒక ఎపిసోడ్ కు 5 వేలకు పైగా ఇచ్చారట. ఇక టీమ్ లీడర్స్ అయితే లక్షల్లో పారితోషికాలు అందుకున్నట్లు తెలుస్తోంది.

    అందరికంటే ఎక్కువ అతనికి..

    అందరికంటే ఎక్కువ అతనికి..

    ఇంకా రీసెంట్ గా అప్పారావు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో మొన్నటి వరకు సుడిగాలి సుదీర్ కొనసాగినప్పుడు అతను అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్నట్లుగా తెలియజేశాడు. అతని రెమ్యునరేషన్ నెంబర్ ఎంత? అని మాత్రం చెప్పలేదు కానీ అతను ఉన్నప్పటి వరకు అత్యధిక పేమెంట్ కమెడియన్ అని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ద్వారా సుడిగాలి సుదీర్ ఒక్కో ఎపిసోడ్ కు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వారితోషికం అందుకునేవారట.

    ఆల్ టైమ్ టాప్ రెమ్యునరేషన్

    ఆల్ టైమ్ టాప్ రెమ్యునరేషన్


    అయితే జబర్దస్త్ లో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో అత్యధికంగా పారితోషికం అందుకున్న వారిలో మాత్రం చమ్మక్ చంద్ర టాప్ లిస్టులో ఉంటాడు అని కూడా అప్పారావు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సుడిగాలి సుదీర్ కంటే ముందు అతను ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా సీనియారిటీ ప్రకారం చమ్మక్ చంద్ర కు ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు అని తెలియజేశాడు. ఇక మార్కెట్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే చమ్మక్ చంద్ర ఒక్క ఎపిసోడ్ కు 2 లక్షల పైగానే రెమ్యూనరేషన్ అందుకునేవారని తెలుస్తోంది.

    English summary
    Jabardasth show all time top remuneration comedian
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X