‘ఇండస్ట్రీలో పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్లాలి.. లేకపోతే..’

బుల్లితెర ప్రేక్షకులను దశాబ్దానికి పైగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా, హీరోలుగా, స్టార్ నటులుగా, స్టార్ యాంకర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఇక చిన్న ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందీ షో. 2013లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ 12 ఏళ్లుగా తెలుగు టీవీ ఆడియెన్స్ ను నిర్విరామంగా అలరిస్తూనే వస్తోంది. అయితే ఈషో ద్వారా తన్మయి టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది. జబర్దస్త్ తన్మయిగా గుర్తుండిపోయింది. పలు ఎపిసోడ్స్ ల్లో మెరిసి తనదైన శైలిలో ఆకట్టుకుంది.

ట్రాన్స్ జెండర్ గా తన్మయి జబర్దస్త్ లో అవకాశం అందుకుంది. తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. 1995లో హైదరాబాద్ లోనే పుట్టిన పెరిగిన తన్మయి తను ట్రాన్స్ గా మారిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో పలు మూవీస్ ల్లో నటించింది. వర్జిన్ స్టోరీస్ తో పాటు పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఆర్టిస్ట్ గా, కమెడీ ఆర్టిస్ట్ గా పలు షోల్లో మెరిచింది. జబర్దస్త్ కామెడీ షోతో పాటు జీ తెలుగులో వచ్చిన అదిరింది షోలోనూ కనిపించింది.

Jabardasth Tanmay faced Problems with Tollywood top Celebrity

ఇక పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దగ్గరి దాకా వచ్చి చేజారిపోయింది. ఇలా తన సినీ జర్నీని సాగించింది. అయితే ఈ క్రమంలో తనకు ఇండస్ట్రీలోని పలువురు పెద్ద స్థాయిలో ఉన్న నీచపు సెలబ్రెటీల నుంచి తనకు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కుటుంబ సమస్యల్లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ వ్యక్తి తనను దారుణంగా ఆడుకున్నాడని తన్మయి కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది.

ఇంటర్వ్యూలో తన్మయి మాట్లాడుతూ.. నాకు కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. మా నాన్న, అమ్మ ఇద్దరు ఆరోగ్య సమస్యల్లో ఉన్నారు. అదే సమయంలో నన్ను ఇండస్ట్రీలోని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తనతోనే ఉండాలని పిలిచినప్పుడల్లా వెళ్లాలని బెదిరించే వాడు. వినకపోతే కొట్టేవాడు. నానా రకాలుగా తిట్టడం, వేధించారు. నా ట్రాన్స్ ఫాం గురించి కూడా అప్పటికి ఇంట్లో తెలియదు. నాకు డబ్బులు అవసరం పడి వాళ్లతో ఉండాల్సి వచ్చింది. ఇక నన్ను కొట్టడం, చేయిచేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరించే వారు.

ఇక ఇప్పుడైతే నాకు ఎలాంటి లవ్, రిలేషన్ షిప్ లేదు. నాకున్న లక్ష్యం కూడా ఒక్కటే. నేను బతికి ఉన్నంత వరకు నా కుటుంబం ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను. ఇక మా ఇంట్లో మా అన్నయ్యనే అన్నీ చూసుకున్నారు. నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నాడు. నేను ట్రాన్స్ మారానని కాస్తా మా అన్నయ్యకు కోపం ఉండొచ్చు కానీ బయటపడడు. ఇప్పుడు నాకు జబర్దస్త్ పేరు ఉండటంతో ప్రస్తుతం అన్నీ అలా సర్దుకున్నాయి. ఇక ఒక సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. చనిపోయే దాన్ని బతికాను, అప్పుడు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. ఇమ్మాన్యుయేల్, నూకరాజు నాకు సహకారంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X