Jabardasth Varsha: వాచ్‌మెన్ కొడుకు కోసం జబర్దస్థ్ వర్ష.. అంతా దేవుడే చూసుకొంటాడు అంటూ..
జబర్దస్త్ రియాలిటీ షో ద్వారా కొద్ది కాలంలోనే టాప్ సెలబ్రిటీగా మారిన వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ ఉండదు. నిత్యం బుల్లితెరపై యాక్టివ్‌గా రియాలిటీ షోలతో ట్రెండింగ్‌లో ఉంటారు. తన మాటలతో, నవ్వులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఓ టాక్ షోకు హోస్ట్‌గా మారారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టైలింగ్ షో రూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జబర్దస్త్ రియాలిటీ షోలోని కమెడియన్ల గురించి తన అభిప్రాయాలను ఫిల్మీబీట్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ కార్తీక్, వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో పంచుకొన్నారు. సోషల్ సర్వీస్ గురించి ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
నాకు ప్రత్యేకంగా ఎలాంటి గోల్స్ లేవు. నాకు ఇది కావాలి. అది కావాలి అనే కోరికలు లేవు. జీవితంలో ఎత్తు పల్లాలు లేకపోతే లైఫ్ చాలా ప్లేన్‌గా ఉంటుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు ఉన్నాడు. అన్నీ ఆయన చూసుకొంటాడు. కాబట్టి మనం దూసుకుపోతూను ఉండాలి అని వర్ష అన్నారు.

నేను ఓ బాబును చదివించేందుకు నిర్ణయం తీసుకొన్నాను. కానీ అలాంటివి నాకు చెప్పడం ఇష్టం లేదు. ఓ సందర్భంలో షేర్ చేసుకొన్నాను. నేను ఉండే ఇంట్లో వాచ్‌మెన్ అబ్బాయిని చదివించాను. కానీ ఇప్పుడు వాళ్లు బాగా సెటిల్ అయ్యారు. ప్రజెంట్‌గా ఆ బాబును వాళ్ల తల్లిదండ్రులే చదివించుకొంటున్నారు. వాళ్లు ఓ సందర్భంలో ఆర్థిక సమస్యల్లో ఉన్న సమయంలో నేను హెల్ప్ చేశాను. ఆ అబ్బాయికి చదివిస్తానని చెబితే ముందు ఒప్పుకోలేదు. కానీ నేను ఒప్పించాను అని జబర్దస్త్ వర్ష తెలిపారు.
ఇప్పుడు మా వాచ్‌మెన్ వాళ్లు సొంత ఇల్లు కట్టుకొన్నారు.వాళ్లు మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టుకొన్నారు. అది నా జీవితంలో గొప్ప అనుభూతి. ఆ తర్వాత వాళ్లు వచ్చి మా బాబును మేమే చదివించుకొంటామని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్లు బాగా సెటిల్ అయ్యారు. కాబట్టి వాళ్లకు ఇచ్చే డబ్బుు వేరే వాళ్లకు ఇచ్చి చదివించాలని అనుకొంటున్నాను అని యాంకర్ వర్ష అన్నారు.
ముందుగా చెప్పినట్టే.. నాకు పెద్దగా గోల్స్ లేవు. దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. దానిని నేను నమ్ముతాను. ఈ రంగంలోకి వచ్చే వాళ్లందరూ తమ వర్క్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇతరులను చూసి కాకుండా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రస్తుతం టెంపుల్స్‌లో ఎక్కువగా గడుపుతున్నాను. తిరుపతి, అరుణాచలం, కాణిపాకం లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దేవుడు ఎట్లా రాసి పెట్టి ఉంటే మనం అట్లా వెళ్ళిపోతాం అని వర్ష అన్నారు.
జబర్దస్త్ వర్ష విషయానికి వస్తే.. పాపులర్ రియాలిటీ షోలో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి స్కిట్స్ చేసి భారీ అభిమానులను సంపాదించుకొన్నారు. వారిద్దరి జోడికి మంచి పాపులారిటీ కూడా లభించింది. ప్రస్తుతం టెలివిజన్ షోలో టాప్ యాంకర్‌గా గుర్తింపు పొందారు. సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకొంటున్నాను అని ఆమె చెప్పారు.


Click it and Unblock the Notifications











