‘నువ్వు ఇంట్లో దూరే టైప్.. వేదికపైనే అమ్మాయితో అలా’.. పండుపై జబర్దస్త్ వర్ష కామెంట్స్
జబర్దస్త్ వర్ష తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టీవీ ఆడియెన్స్ లో కామెడీ ఆర్టిస్ట్ గా చాలా కాలం అలరించింది. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ టీమ్ లో నటించి ఆకట్టుకుంటుంది. తనకు వీలైనంత వరకు కామెడీ పంచుతూ వచ్చింది. తన టాలెంట్ తో ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. అటు జబర్దస్త్ కామెడీ షోలో నటిస్తూనే ఇటు కిస్సిక్ టాక్స్ అనే టెలివిజన్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు టెలివిజన్ సెలబెట్రీలు, మూవీ యాక్టర్స్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వర్ష వారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అడుగుతూ ఆసక్తికరంగా సమాధానాలు రాబడుతోంది.
ఇక తాజాగా జబర్దస్త్ వర్ష కిస్సిక్ టాక్స్ షోకు ఢీ డ్యాన్సర్ పండు హాజరవ్వడం విశేషం. ఈ సందర్భంగా వర్ష పండును ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగింది. పండు షోకు రాగానే జబర్దస్త్ వర్షపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాసేపు యాంగ్రీగా మాట్లాడుతూ వర్షను భయపడేలా చేస్తాడు. దీంతో వర్ష నువ్వు ఇటుక ఇటుక మీద పేర్చి ఇల్లు కట్టే రకం కాదు.. ఏకంగా ఇంట్లో దూరే రకం అని పండుపై వర్ష షాకింగ్ గా కామెంట్స్ చేస్తుంది. దాంతో పండు కూడా షాక్ అవుతాడు. ఆ తర్వాత వర్ష పండును మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి పండు నిర్మోహమాటంగా సమాధానాలు ఇస్తూ వస్తాడు.

పండు మాట్లాడుతూ.. 'ఈసారి ఎలాగైనా నే ఢీ షోలో కప్ కొడుతాను. ఇప్పటికీ ఢీలో చేయబట్టి 8 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇప్పటి వరకు కప్ అందుకోలేక పోయాయి. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను. కొన్ని విషయాలు వినడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు వాళ్లు ఏం చూసి అలా జడ్జ్ చేస్తారో అర్థం కాదు. ఇన్ని సీజన్లు చేసినప్పటికీ నువ్వు డ్యాన్స్ చేశావా? ఇంకేమన్నా చేశావా? అంటుంటారు. దాంతో చాలా బాధగా అనిపిస్తుంది. ఇన్ని సీజన్లు పూర్తైనా నాకే డౌట్ వస్తుంటుంది. ఇక నా కంటే జూనియర్స్ నా ముందే కప్ పట్టుకొని వెళ్లారు. కానీ నేను జనాలను మనస్ఫూర్తిగా ఎంటర్ టైన్ చేశానా? లేదా? అనేదే చూస్తాను.
నాకు ఢీ షోలో ఇటీవల ఇటుక మీద ఇటుక అనే సాంగ్ డ్యాన్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ అన్ననే సాయం చేశారు. అన్న గురించి చెప్పినా ఆయనకు నచ్చదు. ఇక నేను స్టేజీ మీద ఎప్పటికీ మర్చిపోలేని ఘటన ఒకటి జరిగింది. ఒక ఈవెంట్ లో కు వెళ్లినప్పుడు వేదికపై నేను అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఇలా ముందుకు పట్టుకున్నాను. అక్కడ ఒక ముసలాయన ఫుల్ గా తాగేసి వచ్చి నవ్వుతూ కామెంట్స్ చేశాడు. భలే పట్టుకున్నావురా ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఊ కానివ్వు కానివ్వు చూడటానికే కదా మేం వచ్చిందంటూ అందర్ని పిలుస్తూ భలే రచ్చ చేశాడు. అది ఎప్పటికీ గుర్తుకుండిపోతోంది.
ఇక అమ్మాయిలతో లవ్ లో ఉంటే సీరియస్ గా ఉండాలని, అమ్మాయిలతో ఉండాలని అనుకున్నప్పుడు లవ్ అని చెప్పుకోవడం వద్దు. నువ్వు ఒక అమ్మాయిని మోసం చేస్తే కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది తిరిగి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మనకు డబ్బులు లేకపోతే ఎవ్వరూ విలువ ఇవ్వరు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. కేవలం నా ఫ్యామిలీ కోసమే ఇంత వరకు కష్టపడుతూ వస్తున్నాను. అలాగే నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఇప్పుడు లేరు. గతంలో ఫ్రెండ్స్ తో నాకు చిన్న ప్రాబ్లం వచ్చి ఇక చాలా దూరంగా ఉంటున్నాను.' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











