ఆమెను చూస్తుంటే వేడెక్కిపోతోంది... రమ్యకృష్ణపై టాప్ హీరో షాకింగ్ కామెంట్స్
80, 90 దశకాలలో తన అందం, అభినయంతో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపారు రమ్యకృష్ణ. గ్లామర్ షో మాత్రమే కాదు అద్భుతమైన నటిగానూ ఆమె ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అమాయకత్వం అయినా, పొగరుబోతుతనం నిండిన క్యారెక్టర్లు అయినా, అమ్మవారిగా రౌద్రరూపం చూపించినా అది రమ్యకృష్ణకే చెల్లింది. హీరోయిన్‌గా పీక్స్ చూసిన ఈ దిగ్గజ నటి.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఫుల్ బిజీగా ఉంటూ తన మార్క్ చూపిస్తున్నారు.
సూత్రదారులతో బ్రేక్
1985లో భలేమిత్రులు మూవీతో తెలుగు వారిని పలకరించారు రమ్యకృష్ణ. తొలినాళ్లలో తను చేసిన పాత్రలకు అంతగా గుర్తింపు రాలేదు. అయినప్పటికీ చిన్నా చితకా పాత్రలైనా చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఎదురుచూస్తోన్న సమయంలో రమ్యకృష్ణ నట జీవితాన్ని మలుపు తిప్పారు కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, భానుచందర్ కాంబోలో వచ్చిన సూత్రధారులు చిత్రంలో అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ. ఆ వెంటనే ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి.

వరుస హిట్స్‌తో స్టార్ డమ్
ఆ తర్వాత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలకు పనిచేసి స్టార్ డమ్ అందుకున్నారు. అల్లుడుగారు. అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, అల్లరి మొగుడు, బంగారు బుల్లోడు, మేజర్ చంద్రకాంత్, క్రిమినల్, హలో బ్రదర్, ముగ్గురు మొనగాళ్లు, అమ్మోరు, ధర్మచక్రం, అన్నమయ్య, ఆహ్వానం, కంటే కూతురినే కనాలిరా, ఇద్దరు మిత్రులు వంటి హిట్ చిత్రాల్లో నటించారు.
నీలాంబరిగా, శివగామిగా పవర్‌ఫుల్ యాక్టింగ్
సాఫ్ట్ రోల్స్ మాత్రమే కాదు.. పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌కు రమ్యకృష్ణ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో నీలాంబరిగా ఆమె నటన హైలెట్‌గా నిలిచింది. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిలో ఐకానిక్ రోల్ శివగామి దేవిగా రమ్య నటన హైలైట్ అయ్యింది. దిగ్గజ నటి శ్రీదేవి చేయాల్సిన ఆ పాత్ర.. రమ్యకృష్ణను వెతుక్కుంటూ వచ్చింది. 40 ఏళ్ల కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 260కి పైగా చిత్రాలు చేశారు రమ్యకృష్ణ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడారు రమ్యకృష్ణ. ఈ దంపతులకు ఓ బాబు సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు.
బాడీ వేడెక్కిపోతోంది.
తాజాగా సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్‌గా వచ్చిన రమ్యకృష్ణ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇద్దరూ కలిసి నరసింహలోని విరిసేటి పువ్వా సాంగ్‌కి డ్యాన్స్ వేశారు. రమ్యకృష్ణ వచ్చేసింది వేడి పెరిగిపోయిందని జగపతి బాబు అనడంతో అంతా షాకయ్యారు. ప్రపంచంలో ఎవరైనా ఫోన్ చేస్తే హలో అంటారు.. ఈమె మాత్రం డిఫరెంట్‌గా సౌండ్ ఇస్తుందని రమ్యను టీజ్ చేశారు జగపతి. రమ్యకృష్ణ లాంటి హాట్ అమ్మాయి.. కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరు ఎక్కించుకోరని ప్రశ్నిస్తాడు జగపతి.
దానికి ఆమె ఆన్సర్ ఇస్తూ అందంగా, హ్యాండ్సమ్‌గా కనిపించే జగపతిబాబు.. హీరోయిన్లను ట్రై చేసేవాడని లీక్ చేసింది రమ్య. నీకు చిన్నప్పటి నుంచి చాలా మంది సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లటం జరిగాయా అని జగపతి అనగా.. నువ్వు కూడా అంటూ రమ్యకృష్ణ చెప్పడంతో జగపతి కిందపడి దొర్లేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి రమ్యకృష్ణ చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











