»   » పవన్ పార్టీ లాంచ్ టైమ్ లో టీవీ రేటింగ్స్ లిస్ట్

పవన్ పార్టీ లాంచ్ టైమ్ లో టీవీ రేటింగ్స్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మార్చి 14 న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లాంచ్ ని దాదాపు అన్ని టీవీ ఛానెల్స్ ( సాక్షి ఛానెల్ తప్ప) లైవ్ ఇచ్చాయి. అన్నీ ఛానెల్స్ రేటింగ్ అదిరిపోయింది. ఆ జీఆర్పీ రేటింగ్స్ (మాకు అందిన సమాచారం ప్రకారం)

Jana Sena Party Launch Ratings & Rankings

1: TV9 - 17.06

2: N TV - 6.34

3: TV5 - 6.16

4: Studio N - 5.06

5: 10 TV - 2.71

6: ABN - 2.53

7: ETV2 - 2.48

8: V6 - 0.62

9: Gemini News - 0.40

10: 6 TV - 0.42.


జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ విశాఖపట్నంలో ఈనెల 27వతేదీన నిర్వహించబోతున్న బహిరంగసభకు ముందుగానే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ హటావో అని పిలుపిచ్చిన పవన్‌ ఇప్పటికే అహ్మదాబాద్‌కి వెళ్లి భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడితో భేటీ అయ్యారు. ఆయనకు, భాజపాకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబుతో సమావేశమైన పవన్‌ తాజాగా మరోసారి రెండు, మూడు రోజుల్లో భేటీ కావాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయనతో చర్చించే అవకాశముంది.

ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ...తన జనసేన పార్టీ తరుపున ..బీజీపే పార్టీ ప్రధాన అభ్యర్ది నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. దేశానికి నరేంద్రమోడీ వంటి బలమైన ప్రధానమంత్రి అవసరం ఎంతో ఉందని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీహీరో పవన్‌కల్యాణ్‌ చెప్పారు. మోడీకి, ఆయన పార్టీ భాజపాకు తాము మద్దతిస్తామని ప్రకటించారు. తనకు పదవులకన్నా తెలుగు ప్రజల సంక్షేమమే ముఖ్యమని పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది, లేనిదీ త్వరలో ప్రకటిస్తానన్నారు. పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

''కేంద్రప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌ వూగిసలాట ధోరణి కారణంగా దేశానికి ఎంతో నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరే దానికి మంచి ఉదాహరణ. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉండిఉంటే అలా జరిగేది కాదు. దేశానికి మోడీ వంటి గట్టి ప్రధానమంత్రి అవసరం. ఆయనకు నా తరఫున, నా పార్టీ తరఫున మద్దతు తెలపటానికి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మోడీతో చర్చించాను. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీకి, ఆయన పార్టీ భాజపాకు మద్దతిస్తాను. నేను రాజకీయ నాయకుడిని కాను. అధికారంలోకి రావాలని, పదవులను చేపట్టాలని నాకు లేదు.

తెలుగు ప్రజలకు మంచి చేయటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలుంటే అది తెలుగు ప్రజలకే కాదు.. దేశ సమగ్రతకే భంగకరం. కానీ, ఏ నాయకుడూ దీనిపై దృష్టి సారించటం లేదు. తెలుగు అనే గుర్తింపు, తెలుగు ప్రజల మధ్య ఐక్యత లేకపోవటం దేశ సమగ్రతకు మంచిదికాదని మోడీ కూడా అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌లో తెలుగు ప్రజానీకం సీమాంధ్ర, తెలంగాణ అన్న భేదం లేకుండా ఎంతో సఖ్యతతో ఉంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో అది ఎందుకు సాధ్యం కాదని మోడీ ప్రశ్నించారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ప్రజలు ఐక్యతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ ప్రధానమంత్రి కావటం తెలుగు ప్రజలకు అవసరం. మోడీ ప్రధాని కాబోతున్నారు. నాకు ఆ విషయంలో పూర్తి నమ్మకం ఉంది. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలా? వద్దా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి? అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి కొన్ని రోజులు పడుతుంది'' అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి పవన్‌కల్యాణ్‌ నిరాకరించారు. భాజపా తరఫున ప్రచారం చేస్తారా అని అడిగినప్పుడు.. ఆ పార్టీకి మద్దతిస్తానని పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో తన సోదరుడు చిరంజీవి దారి, తన దారి ఎందుకు వేరైందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. తమిళనాడులో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకొని గట్టి పునాదిని ఏర్పర్చుకున్న భాజపా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెదేపా, జనసేనలతో చేతులు కలపటానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే, పవన్‌, మోడీ సమావేశం జరిగిందని, త్వరలో జనసేన ఎన్‌డీఏలో చేరుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

English summary
Pawan Kalyan's Jana Sena Party Launch has been telecasted in all the News Channels on March 14th. Except for V6 Channel, Jana Sena Party Launch is at NO.1 Position for all the channels when its comes Program Rank. Here are the GRP Ratings of Telugu News Channels when the launch was aired live.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu